Salaar Huge Record: ప్రభాస్ సలార్ ఖాతాలో మరో రికార్డు.. ఇదే తొలి ఇండియన్ సినిమా-salaar huge record in north america before its release ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Salaar Huge Record: ప్రభాస్ సలార్ ఖాతాలో మరో రికార్డు.. ఇదే తొలి ఇండియన్ సినిమా

Salaar Huge Record: ప్రభాస్ సలార్ ఖాతాలో మరో రికార్డు.. ఇదే తొలి ఇండియన్ సినిమా

Hari Prasad S HT Telugu
Jul 17, 2023 08:01 PM IST

Salaar Huge Record: ప్రభాస్ సలార్ ఖాతాలో మరో రికార్డు చేరింది. ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ సినిమాగా సలార్ నిలిచింది. సలార్ నార్త్ అమెరికాలో ఈ రికార్డును సొంతం చేసుకుంది.

సలార్ మూవీ
సలార్ మూవీ

Salaar Huge Record: ఈ ఏడాది మోస్ట్ అవేటెడ్ మూవీ సలార్. ప్రభాస్, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ కావడంతో ఈ మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచే సలార్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలే ఇప్పుడు కొన్ని రికార్డులను తిరగరాస్తున్నాయి. అసలు సినిమా ఏంటి? కథేంటి? అన్నదానితో సంబంధం లేకుండా ప్రభాస్, ప్రశాంత్ పేర్లపైనే సలార్ అద్భుతాలు క్రియేట్ చేస్తోంది.

తాజాగా నార్త్ అమెరికాలో ఇప్పటి వరకూ ఏ ఇండియన్ సినిమాకూ సాధ్యం కాని రికార్డును సలార్ సొంతం చేసుకుంది. ఈ సినిమాను నార్త్ అమెరికాలో యూఎస్ఏకు చెందిన ప్రత్యాంగిరా సినిమాస్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. ఆ సంస్థ వెల్లడించిన సమాచారం మేరకు నార్త్ అమెరికాలో సలార్ మూవీ ఏకంగా 1980 లొకేషన్లలో రిలీజ్ కాబోతోంది.

ఇప్పటి వరకూ ఏ ఇండియన్ సినిమా ఇన్ని లొకేషన్లలో రిలీజ్ కాలేదు. ఈ లొకేషన్లలో సెప్టెంబర్ 27న సలార్ ప్రీమియర్ షోలు ఉంటాయని కూడా ఆ సంస్థ వెల్లడించింది. ఈ మధ్యే సలార్ టీజర్ రిలీజైన విషయం తెలిసిందే. ఇండియాలో తొలి 24 గంటల్లో అత్యధిక మంది చూసిన టీజర్ గా రికార్డు కూడా క్రియేట్ చేసింది.

సలార్ మూవీలో ప్రభాస్ సరసన శృతి హాసన్ నటిస్తోంది. అంతేకాదు పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు, ఈశ్వరి రావు ముఖ్యమైన పాత్రల్లో నటించారు. కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ ఈ సలార్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

ప్రభాస్(Prabhas) స‌లార్ మూవీ సెప్టెంబ‌ర్ 28న వ‌ర‌ల్డ్‌వైడ్‌గా రిలీజ్ కానుంది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల కోస గ‌ట్టి పోటీ నెలకొందని తెలుస్తోంది. స‌లార్ ఓటీటీ(Salaar OTT) డీల్ దాదాపు క్లోజ్ అయిందట. స‌లార్ ఓటీటీ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్నట్టుగా తెలిసింది. ద‌క్షిణాదితో పాటు హిందీ భాష‌ల‌కు సంబంధించిన స్ట్రీమింగ్ రైట్స్‌ను దాదాపు 200 కోట్లకు అమెజాన్ ప్రైమ్ ద‌క్కించుకున్నట్టుగా చెబుతున్నారు.

ఓటీటీ రైట్స్ ద్వారానే సినిమా కోసం ప్రొడ్యూస‌ర్లు పెట్టిన పెట్టుబ‌డిలో 80 నుంచి 90 శాతం వ‌ర‌కు రిక‌వ‌రీ అయిన‌ట్లు టాక్ నడుస్తోంది. థియేట్రిక‌ల్, శాటిలైట్ రైట్స్ ద్వారా నిర్మాత‌ల‌కు వ‌చ్చేదంతా లాభాలేన‌ని అంటున్నారు. ప్రభాస్ తో పాటు స‌లార్‌కు ఉన్న క్రేజ్‌కు ఇది నిదర్శనమని సినీ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

Whats_app_banner

సంబంధిత కథనం