Sai Dharam Tej: గంజాయి అమ్మేవాడిగా సాయి ధరమ్ తేజ్.. గాంజా శంకర్ ఫస్ట్ హై రిలీజ్
Ganja Shankar Video Glimpse: సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా గాంజా శంకర్. మెగా అభిమానులకు ట్రీట్ ఇచ్చేలా సాయి ధరమ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా గాంజా శంకర్ వీడియో గ్లింప్స్ ను వదిలారు మేకర్స్.
Ganja Shankar First High: మెగా కాంపౌండ్ నుంచి హీరోగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్ సుప్రీమ్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఇటీవల విరూపాక్ష సినిమాతో భారీ హిట్ కొట్టాడు. ఇలా సాయి ధరమ్ తేజ్ విభిన్న జానర్లలో చిత్రాలు చేస్తూ తానేంటో నిరూపించుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు పూర్తి మాస్ క్యారెక్టర్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సాయి ధరమ్ తేజ్ లేటెస్ట్ గా నటించిన సినిమా గాంజా శంకర్. కమర్షియల్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా వస్తున్న ఈ సినిమాకు డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వం వహించారు.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య గాంజా శంకర్ సినిమాను నిర్మిస్తుండగా.. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది.మ్యాడ్ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఏ.ఎస్. ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే సినిమాకు టైటిల్ అనౌన్స్ చేయగా ఆదివారం (అక్టోబర్ 15) సాయి ధరమ్ తేజ్ పుట్టినరోజు కానుకగా గాంజా శంకర్ స్పెషల్ వీడియో గ్లింప్స్ రిలీజ్ చేశారు.
గాంజా శంకర్ ఫస్ట్ హై అంటూ విడుదల చేసిన నిమిషం 39 సెకన్ల ఈ వీడియో అదిరిపోయింది. వీడియోతో గాంజా శంకర్ క్యారెక్టర్‌ను డిఫరెంట్‌గా ఇంట్రడ్యూస్ చేశారు. స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ కథ కాదు నాన్న.. మన లోకల్ మ్యాన్ కథ చెప్పు అని తండ్రిని కూతురు అడిగుతుంది. చిన్నప్పుడు చదువు మానేసి, తల్లిదండ్రులు చెప్పింది వినకుండా అడ్డమైన తిరుగుళ్లు తిరుగుతాడని.. జర్దా గుట్కా వంటి దరిద్రపు అలవాట్లతోపాటు ఈజీ లీవ్స్ పండిస్తాడని గాంజా పేరు చెప్పకుండా గంజాయి అమ్ముతాడని సాయి ధరమ్ తేజ్ పాత్ర గురించి చిన్నారికి చెబుతాడు ఓ తండ్రి.
పది గంటల వరకు పార్కులో పడుకుంటాడు.. పది వేలు ఉంటే పార్క్ హయాత్‌లో ఉంటాడు అనే డైలాగ్ చాలా ఆకట్టుకుంది. ఇలా సాయి ధరమ్ తేజ్ గాంజా శంకర్ పాత్ర గురించి ఇంట్రో ఇచ్చారు. వీడియో చూస్తుంటే సాయి ధరమ్ తేజ్ ఎన్నడూ చేయని పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.