Mangalavaram Poster: ఆర్ఎక్స్100 డైరెక్టర్ కొత్త సినిమా మంగళవారం.. పోస్టర్ విడుదల-rx 100 director ajay bhupathi new movie mangalavaram poster released ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mangalavaram Poster: ఆర్ఎక్స్100 డైరెక్టర్ కొత్త సినిమా మంగళవారం.. పోస్టర్ విడుదల

Mangalavaram Poster: ఆర్ఎక్స్100 డైరెక్టర్ కొత్త సినిమా మంగళవారం.. పోస్టర్ విడుదల

Maragani Govardhan HT Telugu
Feb 28, 2023 12:32 PM IST

Mangalavaram Poster: ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి తీసిన తాజా చిత్రం మంగళవారం. తాజాగా ఈ సినిమా పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. విభిన్న తరహా కాన్సెప్టుతో ఈ సినిమా తెరకెక్కుతోంది.

ఆర్ఎక్స్ 100 డైరెక్టర్ కొత్త సినిమా మంగళవారం
ఆర్ఎక్స్ 100 డైరెక్టర్ కొత్త సినిమా మంగళవారం

Mangalavaram Poster: ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ అదిరిపోయే విజయాన్ని సొంతం చేసుకున్నారు దర్శకుడు అజయ్ భూపతి. ఆ తర్వాత అతడు శర్వానంద్‌తో తీసిన మాహాసముద్రం అనుకున్న స్థాయిలో ఆకట్టుకోపోవడంతో డీలా పడ్డాడు. తాజాగా మరో సారి సరికొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అదే మంగళవారం. ఆసక్తికరమైన టైటిల్‌తో రానున్న ఈ సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు.

మంగళవారం సినిమా పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. ఓ మహిళ ఆకృతిలో సీతాకోకచిలుకను డిజైన్ చేసినట్లున్న ఈ పోస్టర్ ఆకర్షణీయంగా ఉంది. ముందుభాగంలో నుంచి చూస్తే మహిళ కనిపించడం గమనించవచ్చు. టైటిల్ మంగళవారం బట్టి చూస్తే ఈ ది కాన్సెప్టు బేస్డ్ మూవీ అని తెలుస్తోంది.

ఇంతవరకు ఓ భారతీయ సినిమాలోనూ టచ్ చేయని జోనర్‌లో ఈ చిత్రముంటుందని అజయ్ భూపతి చెప్పారు. సినిమాలో దాదాపు 30 పాత్రలు ఉంటాయని, కథనంలో అందరికీ ప్రత్యేకత ఉంటుందని స్పష్టం చేశారు.

కాంతార ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ జరుపుకుంటోంది. నటీనటులు, ఇతర సాంకేతిక సిబ్బందికి సంబంధించిన సమాచారాన్ని త్వరలోనే మేకర్స్ విడుదల చేయనున్నారు. ఈ చిత్రాన్ని స్వాతి గునుపాటి, సురేష్ వర్మ, అజయ్ భూపతి స్వయంగా నిర్మిస్తున్నారు. అజయ్ భూపతి తన సొంత బ్యానర్ ఏ క్రియేటివ్ వర్క్స్, ముద్రమీడియా వర్క్స్ పతాకాలపై తన మూడో చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.

సంబంధిత కథనం

టాపిక్