RX 100 Director Next Movie: ఆర్ఎక్స్ 100 చిత్రంతో అద్భుత విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు దర్శకుడు అజయ్ భూపతి. మొదటి చిత్రంతో సూపర్ హిట్‌ను అందుకున్న ఈ దర్శకుడు తన తదుపరి చిత్రాన్ని శర్వానంద్‌తో మహాసముద్రం అనే సినిమా తీశాడు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టింది. ఫలితంగా మూడో చిత్రంపై కసర్తత్తులు ప్రారంభించాడు. ఇందుకోసం సరికొత్త కథ, కథనాలతో తెరకెక్కే విధంగా సన్నాహాలు చేస్తున్నాడు.
విక్రాంత్ రోనా, కాంతారా లాంటి సూపర్ హిట్ చిత్రాలకు సెన్సేషనల్ ఆల్బమ్ అందించిన అజనీష్ లోక్ నాథ్‌తో పనిచేయనున్నాడు అజయ్ భూపతి. తన మూడో సినిమా కోసం ఈ సంగీత దర్శకుడిని సంప్రదించాడు. ఎలాంటి కథలో అయినా తన నేపథ్య సంగీతం, పాటలతో మరో స్థాయికి తీసుకెళ్లే అజనీష్ లోకనాథ్ అజయ్ భూపతి మూడవ చిత్రానికి సంగీతం అందించనున్నారు.
సరికొత్త కథ కథనాలతో తెరకెక్కున్న ఈ చిత్ర టైటిల్‌ను, ఇతర నటీనటుల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని దర్శకుడు అజయ్ భూపతి స్పష్టం చేశారు. అజనీష్ లాంటి ప్రతిభావంతుడైన సంగీత దర్శకుడితో పనిచేయనుండటం ఆనందంగా ఉందని అన్నారు. తన సొంత బ్యానర్‌లో చేయనున్న సినిమాకు అజనీష్ సంగీతం అందించడం సంతోషంగా ఉందని స్పష్టం చేశారు.
అజయ్ భూపతి తన సొంత బ్యానర్ ఏ క్రియేటివ్ వర్క్స్, ముద్రమీడియా వర్క్స్ పతాకాలపై తన మూడో చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే చిత్రబృందం వెల్లడించనుంది.
సంబంధిత కథనం
టాపిక్