RRR OTT Release | అఫీషియల్‌.. ఆర్‌ఆర్‌ఆర్‌ ఓటీటీలో రిలీజ్‌ అయ్యేది ఆ రోజే-rrr movie ott release date revealed ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rrr Ott Release | అఫీషియల్‌.. ఆర్‌ఆర్‌ఆర్‌ ఓటీటీలో రిలీజ్‌ అయ్యేది ఆ రోజే

RRR OTT Release | అఫీషియల్‌.. ఆర్‌ఆర్‌ఆర్‌ ఓటీటీలో రిలీజ్‌ అయ్యేది ఆ రోజే

HT Telugu Desk HT Telugu
May 12, 2022 11:36 AM IST

ఇండియన్‌ సినిమా రికార్డులను తిరగరాసింది రాజమౌళి ట్రిపుల్‌ ఆర్‌ మూవీ. బాక్సాఫీస్‌ దగ్గర సుమారు రూ.1200 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడా సినిమా ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.

<p>ట్రిపుల్ ఆర్ మూవీలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్</p>
ట్రిపుల్ ఆర్ మూవీలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ (HT_PRINT)

ఎన్నో ఏళ్ల పాటు ఊరించి మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ. భారీ బడ్జెట్‌తోపాటు టాలీవుడ్‌లో ఇద్దరు సూపర్‌ స్టార్లు జూనియర్‌ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ తొలిసారి కలిసి చేసిన మూవీ కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. అభిమానుల అంచనాలను అందుకుంటూ ఈ సినిమా భారీ విజయం సాధించింది. బాక్సాఫీస్‌ దగ్గర రూ.వెయ్యి కోట్ల కలెక్షన్ల మార్క్‌ దాటింది.

yearly horoscope entry point

నాలుగో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా ట్రిపుల్‌ ఆర్ మూవీ నిలిచింది. కలెక్షన్లలో ఆమిర్‌ ఖాన్‌ పీకే మూవీని మించిపోయింది. అయితే ఇప్పటి వరకూ ఈ మూవీని థియేటర్లలో చూడలేకపోయిన లేక చూసి మళ్లీ టీవీ స్క్రీన్‌పై చూడాలనుకుంటున్న వారికి గుడ్‌న్యూస్‌. ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ నెల 20న డిజిటల్‌ ప్రీమియర్‌ ఉన్నట్లు జీ5 అధికారికంగా వెల్లడించింది.

ఆరోజుకు ఓ ప్రత్యేకత కూడా ఉంది. మే 20న ఈ సినిమాలో భీమ్‌గా నటించిన జూనియర్‌ ఎన్టీఆర్‌ బర్త్‌డే. దీంతో అదే రోజు ఓటీటీ రిలీజ్‌కు రెడీ అవుతోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం వెర్షన్‌లు జీ5లో రిలీజ్‌ కాబోతున్నాయి. అటు హిందీ వెర్షన్‌ మాత్రం అదే రోజు నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్‌ కానుంది.

Whats_app_banner