RC15 Shooting: ఆర్సీ15 షూటింగ్‌ కోసం రాజమండ్రికి రామ్‌చరణ్‌-rc15 shooting to commence again as ram charan went to rajamundry ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rc15 Shooting: ఆర్సీ15 షూటింగ్‌ కోసం రాజమండ్రికి రామ్‌చరణ్‌

RC15 Shooting: ఆర్సీ15 షూటింగ్‌ కోసం రాజమండ్రికి రామ్‌చరణ్‌

HT Telugu Desk HT Telugu
Oct 12, 2022 03:31 PM IST

RC15 Shooting: ఆర్సీ15 షూటింగ్‌ కోసం రాజమండ్రికి వెళ్లాడు మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌. డైరెక్టర్‌ శంకర్‌ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్‌ మళ్లీ వేగం పుంజుకుంది.

ఆర్సీ15 షూటింగ్ కోసం రాజమండ్రి వెళ్లిన రామ్ చరణ్
ఆర్సీ15 షూటింగ్ కోసం రాజమండ్రి వెళ్లిన రామ్ చరణ్ (Twitter)

RC15 Shooting: ఆర్‌ఆర్‌ఆర్‌లాంటి మెగా మూవీతో పాన్‌ ఇండియా స్టార్‌గా మారిపోయాడు మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌. అయితే ఆ తర్వాత వచ్చిన ఆచార్య మూవీ అతనికి చేదు అనుభవాన్ని మిగిల్చింది. దాని నుంచి బయటపడి మరో మెగా హిట్‌ అందుకునే క్రమంలో లెజెండరీ డైరెక్టర్‌ శంకర్‌ షణ్ముగంతో సినిమా అంగీకరించాడు. ప్రస్తుతం ఆర్సీ15గా పిలుస్తున్న ఈ సినిమాకు ఇంకా టైటిల్‌ పెట్టలేదు.

అయితే ఏ టైమ్‌లో ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభించాడోగానీ.. రామ్‌చరణ్‌ ఫ్యాన్స్‌ ఊహించిన వేగంతో షూటింగ్‌ చేయలేకపోతున్నాడు డైరెక్టర్‌ శంకర్‌. ఇదే సమయంలో అతడు కమల్‌హాసన్‌తో ఇండియన్‌ 2 షూటింగ్‌ ప్రారంభించడం ఆర్సీ15ను ఆలస్యం చేస్తోంది. రెండు మూవీలను ఒకేసారి డైరెక్ట్‌ చేస్తుండటంతో మధ్యమధ్యలో ఆర్సీ15కు కొన్ని రోజుల సమయం ఇస్తున్నాడు.

ఇక ఇప్పుడు మరో షెడ్యూల్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో రామ్‌చరణ్‌ హైదరాబాద్‌ నుంచి రాజమండ్రి వెళ్లాడు. బుధవారం (అక్టోబర్‌ 12) శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి అతడు రాజమండ్రి వెళ్లాడు. బ్లూ ట్రౌజర్స్‌, గ్రీన్‌ షర్ట్‌లో హ్యాండ్సమ్‌గా కనిపించిన చెర్రీ.. చాలా ఉత్సాహంగా కనిపించాడు. ఈ ఆర్సీ15 మూవీలో చరణ్‌ సరసన్‌ బాలీవుడ్ భామ కియారా అద్వానీ నటిస్తున్న విషయం తెలిసిందే.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌లో దిల్‌ రాజు, శిరీష్‌ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ ఆర్సీ15లో అంజలి, జయరామ్‌, సునీల్‌, శ్రీకాంత్, నవీన్‌ చంద్ర ముఖ్యమైన పాత్రల్లో కనిపిస్తున్నారు. ఇక ఈ మధ్యే ఎస్‌జే సూర్య కూడా ఆర్సీ15 తారాగణంలో చేరాడు. ఈ విషయాన్ని రామ్‌చరణే తన ట్విటర్‌ ద్వారా వెల్లడించాడు. ఆ మధ్య చరణ్‌, కియారాపై ఓ పాట షూట్‌ చేశారు.

గణేష్‌ ఆచార్య కొరియోగ్రఫీ చేసిన ఆ పాటను వివిధ లొకేషన్లలో చిత్రీకరించారు. ఈ పాటలో వెయ్యి మందికిపైగా డ్యాన్సర్లు కనిపించనుండటం విశేషం. ఇక ఆర్సీ15 మూవీలో రామ్‌చరణ్‌ డ్యుయల్‌ రోల్‌లో కనిపించనున్నట్లు కూడా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఓ స్టూడెంట్‌గా, పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపిస్తున్నట్లు సమాచారం. ఈసినిమాకు తమన్‌ మ్యూజిక్‌ అందిస్తున్నాడు.

IPL_Entry_Point