Ravi Teja New Movie: ‘క్రాక్’ కాంబినేషన్ రిపీట్.. రవితేజ కొత్త మూవీ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది-ravi teja gopichand malineni combo repeats for the fourth time for upcoming movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ravi Teja New Movie: ‘క్రాక్’ కాంబినేషన్ రిపీట్.. రవితేజ కొత్త మూవీ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది

Ravi Teja New Movie: ‘క్రాక్’ కాంబినేషన్ రిపీట్.. రవితేజ కొత్త మూవీ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది

Chatakonda Krishna Prakash HT Telugu
Jul 09, 2023 01:57 PM IST

Ravi Teja New Movie: రవితేజ - గోపీచంద్ మలినేని కాంబోలో నాలుగో చిత్రం రూపొందనుంది. ఈ మూవీ అనౌన్స్‌మెంట్ నేడు వచ్చింది.

రవితేజ
రవితేజ

Ravi Teja New Movie: గతేడాది ధమాకా సినిమాతో బంపర్ హిట్ కొట్టిన మాస్ మహారాజ రవితేజకు ఈ ఏడాది రావణాసుర నిరాశను మిగిల్చింది. విభిన్న చిత్రంగా పేరు తెచ్చుకున్నా బాక్సాఫీస్ వద్ద రావణాసుర రాణించలేకపోయింది. అయితే రవితేజ నటనకు మాత్రం ఫుల్ మార్క్స్ పడ్డాయి. కానీ హిట్ కాలేకపోయింది. ప్రస్తుతం టైగర్ నాగేశ్వర రావు సినిమాను రవితేజ చేస్తున్నాడు. ఈ తరుణంలో మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు రవితేజ. డాన్ శీను, బలుపు, క్రాక్ సినిమాలతో గతంలో తనకు మూడు విజయాలు ఇచ్చిన దర్శకుడు గోపీచంద్ మలినేనితో నాలుగోసారి కలిసి పని చేయనున్నాడు. రవితేజ - గోపీచంద్ మలినేని (RT4GT) కాంబోలో నాలుగో సినిమా అనౌన్స్‌మెంట్ నేడు వెల్లడైంది.

రవితేజ - గోపీచంద్ మలినేని కాంబోలో రానున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ కింద నవీన్ ఎర్నేనీ, వై రవిశంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. క్రాక్‍కు మ్యూజిక్ అందించిన ఎస్.తమన్ ఈ నయా చిత్రానికి కూడా సంగీతం అందించనున్నాడు. ఈ వివరాలను మైత్రీ మూవీ మేకర్స్ నేడు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ట్వీట్ చేసింది.

“బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేసేందుకు మాసీయెస్ట్ కాంబో మళ్లీ వచ్చేస్తోంది. RT4GM కోసం మాస్ మహారాజ రవితేజ, బ్లాక్‍బాస్టర్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని మరోాసారి చేతులు కలిపారు. సెన్సేషనల్ తమన్ మ్యూజిక్ అందిచనున్నాడు” అని మైత్రీ మూవీ మేకర్స్ ట్వీట్ చేసింది. కాగా, ఈ సినిమా క్రాక్-2 అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అయితే, ఈ విషయంపై చిత్రయూనిట్ స్పష్టతనివ్వలేదు.

కాగా, రవితేజ ప్రస్తుతం టైగర్ నాగేశ్వర రావు సినిమా చేస్తున్నాడు. అలాగే, ఈగల్ మూవీ కూడా చేయాల్సి ఉంది. వీటి తర్వాత గోపీచంద్ మలినేనితో ఈ మూవీ షూటింగ్ మొదలయ్యే ఛాన్స్ ఉంది.

2021లో రవితేజ - గోపిచంద్ మలినేని కాంబినేషన్‍లో వచ్చిన మూడో మూవీ క్రాక్ సూపర్ హిట్ అయింది. వరుస పరాజయాలతో కష్టాల్లో ఉన్న రవితేజకు మళ్లీ బంపర్ విజయాన్ని క్రాక్ అందించింది. మాస్ మహారాజ కెరీర్‌లోని అతిపెద్ద బ్లాక్‍బ్లాస్టర్‌గా నిలిచింది.

టీ20 వరల్డ్ కప్ 2024