Rashmika Mandanna Varisu Movie: రోల్‌కు ఇంపార్టెన్స్ లేకపోయినా విజయ్ కోసమే సినిమా చేశా- వారిసుపై రష్మిక కామెంట్స్
Rashmika Mandanna Varisu Movie: వారిసు సినిమాలో తన క్యారెక్టర్‌కు ఇంపార్టెన్స్ లేకపోయినా విజయ్ కోసమే ఈ సినిమాను అంగీకరించినట్లు చెప్పింది రష్మిక మందన్న. ఆమె చేసిన కామెంట్స్ కోలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
Rashmika Mandanna Varisu Movie: వారిసు సినిమాతో ఫస్ట్ టైమ్ కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌తో జోడికట్టింది రష్మిక మందన్న. దాదాపు రెండేళ్ల తర్వాత ఈ సినిమాతోనే కోలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చింది రష్మిక. సంక్రాంతి సందర్భంగా జనవరి 11న వారిసు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాలో రష్మిక రోల్‌పై విమర్శలు వినిపించాయి. రష్మిక ఈసినిమాలో కేవలం పాటలు, కొన్ని సీన్స్‌కు మాత్రమే పరిమితమైందని నెటిజన్లు కామెంట్స్ చేశారు.
ఈ విమర్శలపై ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో స్పందించింది రష్మిక మందన్న. తన క్యారెక్టర్‌కు ఇంపార్టెన్స్ లేదని తెలిసినా విజయ్ కోసమే వారిసు సినిమాను అంగీకరించినట్లు చెప్పింది. కథ విన్నప్పుడే కథలో తన క్యారెక్టర్‌కు ఎలాంటి ప్రాముఖ్యత లేదని అర్థమైందని చెప్పింది రష్మిక మందన్న.
కేవలం రెండు పాటల్లో మాత్రమే తాను కనిపిస్తానని తెలుసునని పేర్కొన్నది. ఇదే విషయాన్ని షూటింగ్‌లో ఉండగా విజయ్‌తో చాలా సార్లు పంచుకున్నానని అన్నది. రెండు పాటలు తప్పితే సినిమాలో నేను చేసేది ఏమీ లేదని విజయ్‌తో జోక్ చేసేదానినని పేర్కొన్నది.
కానీ విజయ్‌పై ఉన్న అభిమానంతోనే వారిసు సినిమాను ఒప్పుకున్నానని అన్నది. విజయ్ అంటే చాలా ఇష్టమని, చాలా ఏళ్లుగా ఆయన్ని ఆరాధిస్తున్నానని చెప్పింది. అతడితో కలిసి పనిచేసే అవకాశం రావడంతో క్యారెక్టర్ గురించి ఆలోచించకుండా వారిసు సినిమాలో భాగమయ్యానని చెప్పింది.
తాను కనిపించే ఆ రెండు పాటలతోనైనా ప్రేక్షకుల్ని మెప్పిస్తే చాలానుకున్నానని పేర్కొన్నది. రష్మిక చేసిన కామెంట్స్ ప్రస్తుతం కోలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. వారిసు సినిమాకు వంశీపైడిపల్లి దర్శకత్వం వహించాడు. దిల్‌రాజు ఈ సినిమాను నిర్మించాడు. వారసుడు పేరుతో తెలుగులో ఈ సినిమా రిలీజైంది.