Rashmika Mandanna on Accident: ‘రేపు ఉంటుందో.. లేదో తెలియదు.. అందుకే..’: ప్రమాదంపై హీరోయిన్ రష్మిక ఎమోషనల్ నోట్
Rashmika Mandanna on Accident: రష్మిక మందన్నా స్వల్ప ప్రమాదానికి గురయ్యారు. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా వెల్లడించారు. కోలుకుంటున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఇన్‍స్టాగ్రామ్‍లో ఎమోషనల్‍గా ఓ పోస్ట్ చేశారు.
స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్నారు. ఐకాన్ అల్లు అర్జున్ హీరోగా ఉన్న క్రేజీ మూవీ ‘పుష్ప 2: రూల్’లో రష్మిక నటిస్తున్నారు. రెయిన్‍బో, కుబేరా సహా మరో రెండు చిత్రాలు రష్మిక లైనప్‍లో ఉన్నాయి. అయితే, కొన్ని రోజులుగా రష్మిక బయట పెద్దగా కనిపించలేదు. అందుకు కారణమేంటో ఆమె ఇప్పుడు వెల్లడించారు. తనకు స్వల్వ ప్రమాదం అయిందని, గాయం నుంచి కోలుకుంటున్నట్టు తెలిపారు. అలాగే ఇన్‍స్టాగ్రామ్‍లో సుదీర్ఘ పోస్ట్ చేశారు.
ఇంట్లోనే ఉంటున్నా
గాయం నుంచి తాను కోలుకుంటున్నానని, డాక్టర్ల సూచనతో ఇంట్లోనే ఉంటున్నానని రష్మిక మందన్నా క్యాప్షన్ రాశారు. తన ఫొటోను కూడా పోస్ట్ చేశారు. “కొంతకాలంగా ఇక్కడికి, బయటికి నేను రావడం లేదని తెలుసు. నేను గత నెలలో యాక్టివ్‍గా లేకపోవడానికి చిన్న ప్రమాదమే కారణం. నేను ఇప్పుడు కోలుకుంటున్నా. డాక్టర్లు చెప్పిన విధంగా ఇంట్లోనే ఉంటున్నా” అని రష్మిక పోస్ట్ చేశారు. తాను ఇప్పుడు బాగానే ఉన్నానని రష్మిక తెలిపారు. తన పనులు తాను చేసుకుంటున్నానని పేర్కొన్నారు.
అందుకే సంతోషంగా ఉండండి
రేపు ఉందో లేదో మనకు తెలియదని, అందుకే ప్రతీ రోజు సంతోషంగా ఉండాలని రష్మిక మందన్నా ఎమోషనల్‍గా రాసుకొచ్చారు. “ఎప్పుడూ మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వండి. ఎందుకంటే జీవితం చాలా సున్నితమైనది, స్వల్పమైనది. ఒకవేళ మనకు రేపో ఉంటుందో లేదో తెలిదు. అందుకే ప్రతీ రోజు హ్యాపీనెస్‍తో ఉండాలి” అని రష్మిక మందన్నా తెలిపారు.
చాలా లడ్డూలు తింటున్నా
ఇంకో అప్‍డేట్ అంటూ ఓ విషయం చెప్పారు రష్మిక మందన్నా. తాను చాలా లడ్డూలు తింటున్నానని తెలిపారు. క్యూట్‍గా ఎక్స్‌ప్రెషన్ పెట్టిన ఫొటోలను రష్మిక పోస్ట్ చేశారు. ప్రమాదమైందంటూ సరదాగా.. ఎమోషనల్‍గా నోట్ రాశారు మందన్నా.
రష్మిక ఈ విషయం చెప్పటంతో చాలా మంది నెటిజన్లు స్పందిస్తున్నారు. త్వరగా కోలుకోవాలని కామెంట్లు చేస్తున్నారు. రికవర్ అవుతున్నానని చెప్పడం సంతోషంగా ఉందంటూ రాసుకొస్తున్నారు. లడ్డూలు తినడాన్ని బాగా ఎంజాయ్ చేయండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
రష్మిక లైనప్
అల్లు అర్జున్‍తో రష్మిక నటించిన పుష్ప 2: ది రూల్ సినిమా డిసెంబర్ 6వ తేదీన రిలీజ్ కానుంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై పాన్ రేంజ్‍లో భారీ క్రేజ్ ఉంది. ధనుష్, నాగార్జున లీడ్ రోల్స్ చేస్తున్న కుబేర చిత్రంలోనూ ముఖ్యమైన పాత్ర చేస్తున్నారు రష్మిక. ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. లేడీ ఓరియెండెట్ చిత్రం ది గర్ల్‌ఫ్రెండ్ మూవీని కూడా చేస్తున్నారు. బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్‍తో సికిందర్ చిత్రం కూడా రష్మిక లైనప్‍లో ఉంది. విక్కీ కౌశల్‍తో చావా చిత్రంలోనూ ఆమె నటించారు. ఈ మూవీ కూడా డిసెంబర్ 6న విడుదల కావాల్సి ఉంది. ఈ హిస్టారికల్ ఎపిక్ చిత్రాన్ని దర్శకుడు లక్ష్మణ్ ఉతేకర్ తెరకెక్కించారు. రెయిన్‍బో అనే తెలుగు మూవీకి కూడా రష్మిక లైనప్‍లో ఉంది. ఇలా తీరిక లేకుండా వరుస చిత్రాలతో జోరు మీద ఉన్నారు.