Rashmika Mandanna: గీతాంజలిగా రష్మిక మందన్నా.. యానిమల్ ఫస్ట్ లుక్ ఎంత బాగుందో చూశారా?-rashmika mandanna first look from ranbir kapoor animal movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rashmika Mandanna: గీతాంజలిగా రష్మిక మందన్నా.. యానిమల్ ఫస్ట్ లుక్ ఎంత బాగుందో చూశారా?

Rashmika Mandanna: గీతాంజలిగా రష్మిక మందన్నా.. యానిమల్ ఫస్ట్ లుక్ ఎంత బాగుందో చూశారా?

Sanjiv Kumar HT Telugu
Sep 23, 2023 12:35 PM IST

Rashmika Mandanna Look From Animal: నేషనల్ క్రష్ సౌత్, నార్త్ అంటూ తేడా లేకుండా సినిమాలతో దూసుకుపోతోంది. తాజాగా యానిమల్ చిత్రంలోని రష్మిక మందన్నా ఫస్ట్ లుక్‍ను మేకర్స్ విడుదల చేసి ఆమె అభిమానులకు సర్‍ప్రైజ్ ఇచ్చారు.

గీతాంజలిగా రష్మిక మందన్నా.. యానిమల్ ఫస్ట్ లుక్ ఎంత బాగుందో చూశారా?
గీతాంజలిగా రష్మిక మందన్నా.. యానిమల్ ఫస్ట్ లుక్ ఎంత బాగుందో చూశారా?

కన్నడ ముద్దుగుమ్మ రష్మిక మందన్నా పుష్ప సినిమాతో ఎంత క్రేజ్ తెచ్చుకుందో తెలిసిందే. అందులో శ్రీవల్లిగా దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అట్రాక్ట్ చేసింది. దీంతో ఆమెకు వరుసపెట్టి సినీ అవకాశాలు రావడం మొదలైంది. తమిళంలో వారసుడు సినిమా చేస్తే.. హిందీలో మిషన్ మజ్ను, గుడ్ బై వంటి చిత్రాలు చేసింది. ప్రస్తుతం రష్మిక చేతిలో రెండు మూడు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటే బాలీవుడ్ రణ్‍బీర్ కపూర్ హీరోగా నటిస్తున్న యానిమల్ మూవీ.

అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న యానిమల్ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదివరకు విడుదల చేసిన యానిమల్ యాక్షన్ గ్లింప్స్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు యానిమల్ హీరోయిన్ రష్మిక మందన్నా ఫస్ట్ లుక్‍ను రిలీజ్ చేశారు. యానిమల్ సినిమాలో గీతాంజలిగా రష్మిక కనిపించనుందని మేకర్స్ తెలిపారు. దీనికి సంబంధించిన పోస్టర్‍ను డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ట్వీట్ చేశారు. ఇప్పుడు ఇది వైరల్ అవుతోంది.

యానిమల్ ఫస్ట్ లుక్ పోస్టర్‍లో మెరూన్ కలర్ బ్లౌజ్‍లో నుదుట కుంకుమతో ఎంతో పద్ధతిగా కనిపించింది రష్మిక మందన్నా. ఇది చూసి ఆమె అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. అలాగే ఈ పోస్టర్ ద్వారా యానిమల్ టీజర్‍ను సెప్టెంబర్ 28కి ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపారు. అలాగే యానిమల్ చిత్రాన్ని డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా హిందీతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.

ఇదిలా ఉంటే యానిమల్ మూవీని టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్స్ పై భూషణ్ కుమార్, ప్రణవ్ రెడ్డి వంగా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దీని తర్వాత ఇదే టీ సిరీస్ సంస్థలో సందీప్ రెండు సినిమాలు చేయనున్నాడు. ప్రభాస్‍తో స్పిరిట్ ఒకటి అయితే.. మరొకటి అల్లు అర్జున్‍తో భద్రకాళి మూవీ. ఇక రష్మిక.. పుష్ప 2, రెయిన్ బో చిత్రాలతోపాటు రవితేజ, గోపీచంద్ మలినేని సినిమాలో చేయనుందని టాక్.

Whats_app_banner