Rashmika Mandanna: అంబానీ ఇంట్లో రష్మిక మందన్నాకు ఘోర అవమానం.. వీడియో వైరల్
Rashmika Mandanna at Mukesh Ambani: కన్నడ బ్యూటి రష్మిక మందన్నా సౌత్ ప్రేక్షకులకు నేషనల్ క్రష్‍గా మారిపోయింది. పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న ఈ హీరోయిన్‍కు తాజాగా ఊహించని విధంగా అవమానం జరిగింది. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Mukesh Ambani Ganpati Puja 2023: ఛలో సినిమాతో తెలుగు వారికి పరిచయమైన కన్నడ సుందరాంగీ రష్మిక మందన్నా అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‍గా స్టార్‍డమ్ తెచ్చుకుంది. అంతేకాకుండా నేషనల్ క్రష్‍గా గుర్తింపు పొందింది. ఇక పుష్ప మూవీతో వచ్చిన క్రేజ్ ద్వారా బాలీవుడ్ సినిమాల్లో హీరోయిన్‍గా అవకాశాలు కొట్టేసింది. మిషన్ మజ్ను, గుడ్ బై వంటి చిత్రాలతో ఆకట్టుకుంది. అలాగే తమిళంలో వారిసు సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
తారల సందడి
ఇదిలా ఉంటే తాజాగా రష్మిక మందన్నా అపర కుబేరుడు ముకేష్ అంబానీ ఇంట్లో నిర్వహించిన వినాయక చవితి వేడుకలకు హాజరైంది. ప్రతి ఏడాది అంబానీ ఇంట్లో జరిగే గణేష్ ఉత్సవాల్లో బాలీవుడ్ ప్రముఖులు, క్రికెట్ స్టార్స్ పాల్గొంటారని తెలిసిందే. అందులో భాగంగానే ఈ ఏడాది గణపతి వేడుకల్లో షారుక్ ఖాన్, అజయ్ దేవగన్, దిశా పటానీ, జాన్వీ కపూర్, ఖుషి కపూర్, శ్రద్ధా కపూర్‍లతోపాటు సౌత్ బ్యూటిలు నయనతార, రష్మిక మందన్నా సందడి చేశారు.
జవాన్ ద్వారా
జవాన్ సినిమాతో హిందీలోకి ఎంట్రీ ఇవ్వడమే కాకుండా సాలిడ్ హిట్ కొట్టిన నయనతారకు తొలిసారిగా అంబానికి ఇంటి నుంచి ఆహ్వానం అందింది. అలాగే బాలీవుడ్ రెండు మూడు చిత్రాలతో పాపులర్ అయిన రష్మికకు కూడా ఇన్విటేషన్ వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ వేడుకల్లో రష్మిక మందన్నాకు అవమానం జరిగినట్లు అభిమానులు భావిస్తున్నారు.
మూతి తిప్పుకుంటూ
రష్మిక మందన్నా నిల్చుని ఉంటే.. ఆమె వైపుకు సాహో బ్యూటి శ్రద్ధా కపూర్ వచ్చింది. శ్రద్ధాను చూసి రష్మిక స్మైల్ చేసినా.. ఆమె మాత్రం పెద్దగా పట్టించుకోకుండా వెళ్లిపోయింది. దాంతో కొద్దిగా షాక్ అయిన రష్మిక.. మూతి తిప్పుకుంది. పట్టించుకోలేదేంటీ అన్నట్లుగా ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
కావాలనే చేసిందా?
రష్మిక మందన్నాను శ్రద్ధా కపూర్ అలా అవాయిడ్ చేయడంపై ఆమె అభిమానులతోపాటు నెటిజన్లు మండిపడుతున్నారు. "రష్మికను శ్రద్ధా కావాలనే ఇగ్నోర్ చేసిందా? యారగెన్సా? యాటిట్యూడా?" అంటూ ప్రశ్నిస్తున్నారు. మరికొంతమంది "నేషనల్ క్రష్ అంటే ఆ మాత్రం జెలసీ ఉండాలి" అంటూ వీడియో షేర్ చేస్తున్నారు.