Ranneeti web series trailer: ఓటీటీలోకి మరో థ్రిల్లింగ్ వెబ్ సిరీస్.. ట్రైలర్ వచ్చేసింది.. తెలుగులోనూ స్ట్రీమింగ్-ranneeti balakot and beyond web series trailer released jio cinema to stream the new series from 25th april ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ranneeti Web Series Trailer: ఓటీటీలోకి మరో థ్రిల్లింగ్ వెబ్ సిరీస్.. ట్రైలర్ వచ్చేసింది.. తెలుగులోనూ స్ట్రీమింగ్

Ranneeti web series trailer: ఓటీటీలోకి మరో థ్రిల్లింగ్ వెబ్ సిరీస్.. ట్రైలర్ వచ్చేసింది.. తెలుగులోనూ స్ట్రీమింగ్

Hari Prasad S HT Telugu

Ranneeti web series trailer: ఓటీటీలోకి మరో థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ వచ్చేస్తోంది. దీనికి సంబంధించిన ట్రైలర్ బుధవారం (ఏప్రిల్ 17) రిలీజ్ కాగా.. జియో సినిమాలో స్ట్రీమింగ్ కానున్న ఈ సిరీస్ తెలుగులోనూ వస్తోంది.

ఓటీటీలోకి మరో థ్రిల్లింగ్ వెబ్ సిరీస్.. ట్రైలర్ వచ్చేసింది.. తెలుగులోనూ స్ట్రీమింగ్

Ranneeti web series trailer: పుల్వామా దాడి, తర్వాత పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ఇండియా చేసిన దాడుల ఆధారంగా ఇప్పటికే బాలీవుడ్, టాలీవుడ్ లో పలు సినిమాలు వచ్చాయి. తాజాగా ఈ నేపథ్యంలోనే ఓ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ రూపొందింది. ఈ సిరీస్ పేరు రణ్‌నీతి బాలాకోట్ అండ్ బియాండ్. జియో సినిమాలో స్ట్రీమింగ్ కానున్న ఈ కొత్త సిరీస్ తెలుగులోనూ రాబోతోంది.

రణ్‌నీతి వెబ్ సిరీస్ ట్రైలర్

బాలీవుడ్ నటీనటులు జిమ్మీ షెర్గిల్, లారా దత్తా నటించిన వెబ్ సిరీస్ రణ్‌నీతి: బాలాకోట్ అండ్ బియాండ్. ఈ వెబ్ సిరీస్ ఏప్రిల్ 25 నుంచి జియో సినిమాలో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా బుధవారం (ఏప్రిల్ 17) ఈ సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేశారు. సంతోష్ సింగ్ డైరెక్ట్ చేసిన ఈ వార్ డ్రామా సిరీస్ ఎలా ఉండబోతోందో ట్రైలర్ కళ్లకు కట్టినట్లు చూపించింది.

పుల్వామా దాడి, ఆ తర్వాత పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ఇండియా జరిపిన మెరుపు దాడుల వెనుక అసలు ఏం జరిగింది? ఈ దాడులపై పాకిస్థాన్ రియాక్షన్, అంతర్జాతీయ వేదికలపై వాళ్ల మొసలి కన్నీరులాంటి అంశాలన్నింటినీ ఈ సిరీస్ లో చూపించే ప్రయత్నం చేసినట్లు ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది. ట్రైలర్ లోనే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్టంట్స్ ను కూడా చూపించారు.

"ఈ కథ మీకు తెలుసు. కానీ ఈ యుద్ధం మీకు తెలియదు. ఇండియా చేసిన ఈ చారిత్రక ఆధునిక యుద్ధం గురించి తెలుసుకోండి. రణ్‌నీతి: బాలాకోట్ అండ్ బియాండ్ ట్రైలర్ వచ్చేసింది" అనే క్యాప్షన్ తో జియో సినిమా ఈ ట్రైలర్ ను షేర్ చేసింది. ఈ సిరీస్ హిందీతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, మరాఠీ, బంగ్లా భాషల్లోనూ స్ట్రీమింగ్ కానుంది.

రణ్‌నీతి వెబ్ సిరీస్

రణ్‌నీతి వెబ్ సిరీస్ లో లారా దత్తా, జిమ్మి షెర్గిల్ ప్రధాన పాత్రల్లో నటించారు. గతంలో తాను ఎప్పుడూ పోషించని పాత్ర ఇది అని జిమ్మీ షెర్గిల్ చెప్పాడు. యుద్ధం వెనుక వార్ రూమ్ లో జరిగిన ఘటనలను కళ్లకు కట్టబోతున్న ఇలాంటి వెబ్ సిరీస్ లో నటించడం చాలా సంతోషంగా ఉందని అతడు అన్నాడు. ఈ సిరీస్ షూటింగ్ సందర్భంగా తాము ఎదుర్కొన్న సవాళ్లను కూడా అతడు గుర్తు చేసుకున్నాడు.

అటు లారా దత్తా కూడా ఈ సిరీస్ లో నటించడంపై స్పందించింది. రణ్‌నీతిలో పని చేసినటువంటి టీమ్ తో నటిస్తే.. ఓ యాక్టర్ గా ఎంతో వృద్ధి సాధిస్తామని, ప్రతి సీన్, ప్రతి డైలాగ్ డెలివరీలోనూ ఆ వృద్ధి కనిపిస్తుందని ఆమె చెప్పింది. ఈ కొత్త సిరీస్ ఏప్రిల్ 25 నుంచి జియో సినిమాలో స్ట్రీమింగ్ కానుంది.

ఇప్పటికే పుల్వామా దాడి, తర్వాత జరిగిన పరిణామాలపై ఫైటర్, ఆపరేషన్ వాలెంటైన్ లాంటి సినిమాలు ఈ మధ్యే వచ్చిన విషయం తెలిసిందే. వాటికి భిన్నంగా యుద్ధం వెనుక వార్ రూమ్ లో జరిగిన ఘటనలను ఇందులో చూపించబోతున్నట్లు మేకర్స్ చెబుతున్నారు.