Brahmastra Advance Bookings: ఆర్ఆర్ఆర్ రికార్డును బ్రేక్ చేసిన బ్రహ్మాస్త్ర.. ఎందులోనో తెలుసా?-ranbir kapoor new movie brahmastra beats rrr in advance bookings ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmastra Advance Bookings: ఆర్ఆర్ఆర్ రికార్డును బ్రేక్ చేసిన బ్రహ్మాస్త్ర.. ఎందులోనో తెలుసా?

Brahmastra Advance Bookings: ఆర్ఆర్ఆర్ రికార్డును బ్రేక్ చేసిన బ్రహ్మాస్త్ర.. ఎందులోనో తెలుసా?

Maragani Govardhan HT Telugu
Sep 06, 2022 06:31 AM IST

Brahmastra Beats RRR in Advance Bookings: రణ్‌బీర్ కపూర్ నటించిన తాజా చిత్రం బ్రహ్మాస్త్ర. ఈ సినిమా అడ్వాన్స్ ఓపెనింగ్స్ విషయంలో ఆర్ఆర్ఆర్ సినిమాను అధిగమించినట్లు ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు.

<p>బ్రహ్మాస్త్ర</p>
బ్రహ్మాస్త్ర

Advance Openings of Brahmastra: రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ కలిసి నటించిన తాజా చిత్రం బ్రహ్మాస్త్ర. దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి ఈ సినిమాకు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. అయన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ చిత్రం సెప్టెంబరు 9న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా విడుదల దగ్గర పడటంతో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా జోరుగా సాగుతున్నాయి. ట్రేడ్ పండితుల విశ్లేషణ ప్రకారం ఆర్ఆర్ఆర్ కంటే కూడా బ్రహ్మాస్త్ర చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ ఎక్కువగా ఉన్నాయట. ఈ విషయాన్ని పీవీఆర్ థియేటర్స్ సంస్థ వెల్లడించింది.

అడ్వాన్స్ బుకింగ్ విషయంలో బ్రహ్మాస్త్ర సినిమాకు దక్షినాది కంటే కూడా హిందీ బెల్టులో ఎక్కువగా ఉన్నాయనేది ఇక్కడ గమనించాల్సిన విషయం. సాధారణ టికెట్ల కంటే కూడా బ్రహ్మాస్త్ర 3డీ వెర్షన్ టికెట్ల ఖరీదు చాలా ఎక్కువగా ఉండటం ఇక్కడ గమనించాల్సిన మరో విషయం.

పీవీఆర్ స్క్రీన్లలో ఆర్ఆర్ఆర్ హిందీ వెర్షన్‌‌కు మంగళవారం లోపు రూ.2.19 కోట్లు అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో వచ్చాయి. బ్రహ్మాస్త్రకు ఆదివారం లోపే రూ.2.3 కోట్ల లభించినట్లు ఆ సంస్థ తెలియజేసింది. ఇంకా విడుదలకు మరో నాలుగు రోజులు ఉండటంతో ఈ వసూళ్లు పెరిగే అవకాశముంది. చివరకు ఎంత కలెక్షన్లు వస్తాయనేది త్వరలోనే తెలియనుంది.

రణ్‌బీర్ కపూర్-ఆలియా భట్ తొలిసారిగా కలిసి నటించిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌనీ రాయ్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాల ఇతిహాసాల ఆధారంగా దర్శకుడు అయ్యన్ ముఖర్జి తెరకెక్కించారు. నరాస్త్ర, నంది అస్త్ర, ప్రభాస్త్ర, జలాస్త్ర, పవనాస్త్ర, బ్రహ్మాస్త్రలకు సంబంధించిన పురాణ గాథలు, వాటి శక్తిని గురించి ఈ సినిమాలో వివరించనున్నారు. హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమా విడుదల కానుంది.

Whats_app_banner

సంబంధిత కథనం