RGV Movies: ఒకేసారి రెండు సినిమాల రిలీజ్ డేట్‍లు ప్రకటించిన ఆర్జీవీ.. వారం గ్యాప్‍లోనే..-ram gopal varma announces vyuham and shapatham movies release dates at once tollywood news ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rgv Movies: ఒకేసారి రెండు సినిమాల రిలీజ్ డేట్‍లు ప్రకటించిన ఆర్జీవీ.. వారం గ్యాప్‍లోనే..

RGV Movies: ఒకేసారి రెండు సినిమాల రిలీజ్ డేట్‍లు ప్రకటించిన ఆర్జీవీ.. వారం గ్యాప్‍లోనే..

Chatakonda Krishna Prakash HT Telugu
Feb 10, 2024 03:55 PM IST

RGV - Vyuham, Shapatham Movies: రామ్‍గోపాల్ వర్మ ఒకేసారి రెండు సినిమాల రిలీజ్ డేట్‍లను ప్రకటించారు. వ్యూహం, శపథం చిత్రాల విడుదల తేదీలను వెల్లడించారు. వారం గ్యాప్‍లోనే ఈ రెండు చిత్రాలు రానున్నాయి.

RGV Movies: ఒకేసారి రెండు సినిమాల రిలీజ్ డేట్‍లు ప్రకటించిన ఆర్జీవీ
RGV Movies: ఒకేసారి రెండు సినిమాల రిలీజ్ డేట్‍లు ప్రకటించిన ఆర్జీవీ

Vyuham, Shapatham Movies: దర్శకుడు రామ్‍గోపాల్ వర్మ (RGV).. కొన్నిసార్లు అనూహ్యమైన పనులు చేస్తుంటారు. ఇప్పుడు.. ఒకేసారి ఏకంగా రెండు సినిమాల రిలీజ్ డేట్‍లను ప్రకటించారు. వారం గ్యాప్‍లోనే రెండు చిత్రాలను విడుదల చేసేందుకు డిసైడ్ అయ్యారు. తాను దర్శకత్వం వహించిన పొలిటికల్ డ్రామా చిత్రాలు వ్యూహం, శపథం విడుదల తేదీలను ఆర్జీవీ ఖరారు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల ఆధారంగా ఈ చిత్రాలను ఆయన తెరకెక్కించారు.

వ్యూహం సినిమా కొన్ని అడ్డంకుల తర్వాత ఇటీవలే విడుదలకు గ్రీన్‍సిగ్నల్ పొందింది. ఈ చిత్రం సెన్సార్‌ సర్టిఫికేట్‍ను తెలంగాణ హైకోర్టు రద్దు చేయగా.. మరోసారి దర్శక నిర్మాతలు అప్పీల్ చేశారు. అయితే, రెండోసారి సెన్సార్ తర్వాత విడుదల చేసుకునేందుకు వ్యూహం చిత్రానికి లైన్ క్లియర్ అయింది. దీంతో వ్యూహం ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని వేచిచూస్తున్న తరుణంలో రిలీజ్ డేట్‍ను ఆర్జీవీ వెల్లడించారు.

వ్యూహం, శపథం రిలీజ్ డేట్‍లు ఇవే..

వ్యూహం సినిమాను ఫిబ్రవరి 23వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు ఆర్జీవీ నేడు వెల్లడించారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‍మోహన్ రెడ్డి చేసిన యాత్రలు, ఆయనకు వ్యతిరేకంగా జరిగిన చర్యలను వ్యూహంలో చూపిస్తానని ఆర్జీవీ గతంలోనే చెప్పారు. 2009లో అప్పటి సీఎం వైఎస్ఆర్ మృతి, ఆ తర్వాత ఆయన కుమారుడు వైఎస్ జగన్‍మోహన్ రెడ్డికి ఎదురైన ఇబ్బందులు, ఆయన చేసిన ఓదార్పు యాద్ర, పాదయాత్ర, జైలుకు వెళ్లడం, పార్టీని స్థాపించడం లాంటివి వ్యూహంలో ఉండనున్నాయని ట్రైలర్‌తో తెలిసింది. వైఎస్ జగన్ పాత్రలో అజ్మల్ నటించారు.

శపథం సినిమాను మార్చి 1వ తేదీన విడుదల చేయనున్నట్టు రామ్‍గోపాల్ వర్మ వెల్లడించారు. రిలీజ్ డేట్లతో ఓ కొత్త పోస్టర్‌ను ఆయన ట్వీట్ చేశారు. అంటే.. వ్యూహం, శపథం చిత్రాల రిలీజ్‍కు వారం మాత్రమే గ్యాప్ ఉంది. ఇలా ఒకే దర్శకుడికి చెందిన చిత్రాలు వారం వ్యవధిలో రావడం థియేటర్లలోకి రావడం అత్యంత అరుదు. అయితే, డిఫరెంట్‍గా ఆలోచించే ఆర్జీవీ ఈ నిర్ణయం తీసుకున్నారు.

2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గెలిచి జగన్‍మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాతి పరిస్థితులను శపథంలో చూపిస్తానని ఆర్జీవీ చెప్పారు. వ్యూహానికి కొనసాగింపుగానే శపథం ఉంటుందని గతంలోనే తెలిపారు.

శపథం పరిస్థితేంటి!

వ్యూహం సినిమాకు గ్రీన్ సిగ్నల్ రావటంతో ఫిబ్రవరి 23వ తేదీన థియేటర్లలోకి రావడం ఖాయం. అయితే, శపథం సినిమాకు ఇప్పటి వరకు సెన్సార్ అవలేదు. ట్రైలర్ కూడా రాలేదు. ఈ చిత్రంపై అభ్యంతరాలతో ఎవరైనా కోర్టుకు వెళితే.. ఎలాంటి పరిణామాలు నెలకొంటాయో చూడాలి. జనవరిలోనే రిలీజ్ కావాల్సిన వ్యూహం.. కోర్టు కేసు వల్ల ఫిబ్రవరికి వచ్చింది. మరి, శపథం చిత్రం అడ్డంకులు లేకుండా మార్చి 1వ తేదీనే వస్తుందో.. ఆలస్యమవుతుందో చూడాలి.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలు మరో మూడు నెలల్లోనే జరగనున్న నేపథ్యంలో.. ఆలోగానే వ్యూహం, శపథం రిలీజ్ చేయాలని ఎప్పుడో డిసైడ్ అయ్యారు ఆర్జీవీ. దీంతో వారం గ్యాప్‍తోనే ఈ మూవీస్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసుకున్నారు.

రామదూత క్రియేషన్స్ పతాకంపై వ్యూహం, శపథం చిత్రాలను దాసరి కిరణ్ కుమార్ నిర్మించారు. ఈ చిత్రాల్లో వైఎస్ జగన్ పాత్రను అజ్మల్ చేయగా.. భారతి పాత్రలో మానస నటించారు.

IPL_Entry_Point