Rakul Preet Singh about Relationship: సెలబ్రెటీల రిలేషన్‌షిప్‌పై రకుల్ సంచలన వ్యాఖ్యలు.. అందుకే బయటకు చెప్పమని స్పష్టం-rakul preet singh reveals celebrities hide who they are dating due to fear ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rakul Preet Singh About Relationship: సెలబ్రెటీల రిలేషన్‌షిప్‌పై రకుల్ సంచలన వ్యాఖ్యలు.. అందుకే బయటకు చెప్పమని స్పష్టం

Rakul Preet Singh about Relationship: సెలబ్రెటీల రిలేషన్‌షిప్‌పై రకుల్ సంచలన వ్యాఖ్యలు.. అందుకే బయటకు చెప్పమని స్పష్టం

Maragani Govardhan HT Telugu
Oct 11, 2022 11:45 AM IST

Rakul Reation on Dating: తమ పని నుంచి దృష్టి మరలుస్తారనే భయంతో కొంతమంది నటీ, నటుల తమ విషయాన్ని బయటకు చెప్పేందుకు సంకోచిస్తారని రకుల్ చెప్పింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆసక్తికర విషయాలను పంచుకుంది.

<p>జక్కీ భగ్నానీతో రకుల్</p>
జక్కీ భగ్నానీతో రకుల్ (HT)

Rakul about her relationship: బాలీవుడ్‌లో నటీ, నటులు రిలేషన్‌షిప్‌లో ఉండటం, ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడం తరచూ జరుగుతూనే ఉంటాయి. అయితే చాలా సందర్భాల్లో మీడియా ముందు వారు తమ రిలేషన్‌షిప్ గురించి బయటకు చెప్పేందుకు సెలబ్రెటీలు భయపడుతుంటారు. చివరి వరకు సైలెంట్‌గా ఉంచి.. ఆ తర్వాత ఆ విషయాన్ని తెలియజేస్తారు. కలిసి విహారయాత్రలకు వెళ్లినప్పపటికీ.. తమ మధ్య ఎలాంటి బంధం లేదని చెప్పే వాళ్లున్నారు. అయితే రకుల్ ప్రీత్ సింగ్ ఈ సంప్రదాయానికి బ్రేక్ చేసి ఈ ఏడాది ప్రారంభంలోనే తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ద్వారా జక్కీ భగ్నానీతో రిలేషన్‌లో ఉన్నట్లు చెప్పుకొచ్చింది. ఇటీవలో హిందుస్థాన్ టైమ్స్‌తో జరిగిన ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. సెలబ్రెటీలు ఇలా చేయడానికి గల కారణాన్ని వివరించింది.

తమ పని నుంచి దృష్టి మరలుస్తారనే భయంతో కొంతమంది నటీ, నటుల తమ విషయాన్ని బయటకు చెప్పేందుకు సంకోచిస్తారని రకుల్ చెప్పింది. "అవును.. చాలా మందిలో ఇలాంటి మనస్తత్వమే ఉంటుంది. నా పని నుంచి దృష్టి మరలుస్తుందనే కారణంతో కొంతమంది తమ వ్యక్తిగత విషయాలను బయటకు చెప్పరు. కానీ మనం 2022లో ఉన్నాం. నా వ్యక్తిగత జీవితం.. వృత్తిపరమైన విశ్వసనీయతను దెబ్బతీస్తుందనుకుంటే ఏదో తప్పు జరుగుతుందని అర్థం. దాన్ని సరిదిద్దాలి. అది నన్ను ప్రభావితం చేస్తే.. నేను దాన్ని మార్చబోతున్నాను. ఎందుకంటే నేను నా జీవితాన్ని రెండు మార్గాల్లో జీవించాలనుకునే వ్యక్తిని కాదు." అని రకుల్ స్పష్టం చేసింది.

తను ఎవరితో డేటింగ్ చేస్తున్నానే విషయంపై ఎలాంటి కపటం లేకుండా ఉండాలని రకుల్ వివరించింది. "ఏదేమైనప్పటికీ నేను కెమెరా ముందు నటిస్తున్నాను. కాబట్టి రోజులో మిగిలే ఉండే 2, 3 గంటల్లో నేను.. నేనుగా ఉండాలనుకుంటున్నాను. అప్పుడు కూడా తిరిగి నటించను. ఇది అందరికీ వర్తిస్తుంది. ఏ మనిషికైనా జీవితంలో ఏదోక సమయంలో భాగస్వామి ఉండటం అత్యంత సహజం. నేను భిన్నంగా ఏం చేయడం లేదు. బహుశా ప్రపంచంలోనే ఇది అత్యంత పూర్తి చేసిన విషయం. వ్యక్తులకు కెరీర్లు లేకపోవచ్చు. కానీ వారికి భాగస్వాములు ఉంటారు." అని రకుల్ స్పష్టం చేసింది.

జక్కీ భగ్నానీతో తను ఆరోగ్యకరమైన సరిహద్దులను ఏర్పరచుకున్నానని రకుల్ తెలిపింది. "జక్కీతో నా హద్దులు ఆరోగ్యకరంగా ఉంటాయి. ఇది భద్రతా భవాన్ని కలిగిస్తుంది. మీ భాగస్వామికి మీరు గౌరవం ఇవ్వాలి. నేను, జక్కీ ఇదే అభిప్రాయాన్ని కలిగి ఉన్నాం. మేము పని గురించి చర్చించకుండా మా మార్గాల్లో చాలా బిజీగా ఉన్నాం. నేను చర్చించుకోవాలనుకునే కొన్ని విషయానికొస్తే.. నేను సంబంధం లేకుండా ఒకరికొకరుం గౌరవభావాన్ని కలిగి ఉంటాం. ఇది భద్రతా భావాన్ని ఏర్పరస్తుంది" అని రకుల్ తెలిపింది.

గత ఏడాది కాలంగా రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్‌లో ఫుల్ బిజీగా ఉంది. ఎటాక్ , రన్‌వే 34, కట్ పుట్లీ లాంటి చిత్రాల్లో కనిపించింది. ఈ శుక్రవారం నాడు ఆమె నటించిన డాక్టర్ జీ విడుదల కానుంది. అనుభూతి కశ్యప్ సినిమాలోనూ ఈ ముద్దుగుమ్మ నటిస్తోంది. ఆయుష్మాన్ ఖురానా, షెఫాలీ షా ఇందులో కీలక పాత్రలు పోషించారు. సిద్ధార్థ్ మల్హోత్రా, అజయ్ దేవగణ్‌తో కలిసి థ్యాంక్ గాడ్‌లో నటించింది. కమల్ హాసన్‌తో కలిసి ఇండియన్‌2లోనూ కనిపించనుంది.

Whats_app_banner

సంబంధిత కథనం