Raayan Day 1 Collection: మొదటి రోజే 12 కోట్లకుపైగా కొల్లగొట్టిన ధనుష్ మూవీ.. మరి రాయన్ తెలుగు కలెక్షన్స్ ఎంతంటే?
Raayan Day 1 Worldwide Box Office Collection: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తొలిసారిగా దర్శకత్వం వహించిన రాయన్ సినిమా జూలై 27న విడుదలై మంచి టాక్ తెచ్చుకుంటోంది. ఈ నేపత్యంలో రాయన్ సినిమాకు తొలి రోజు బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతొచ్చాయనే వివరాల్లోకి వెళితే..
Raayan Day 1 Box Office Collection: తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ రాయన్. రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి ధనుష్ స్వీయ దర్శకత్వం వహించాడు. ధనుష్ కెరీర్‌లో 50వ సినిమాగా వచ్చిన రాయన్ జూలై 27న థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. దీంతో రాయన్‌కు ఫస్ట్ డే కలెక్షన్స్ బాగానే వచ్చినట్లు తెలుస్తోంది.
తెలుగు వెర్షన్ నుంచి
ట్రేడ్ గణాంకాల ప్రకారం రాయన్ మూవీ శుక్రవారం అయిన తొలి రోజు ఒక్క ఇండియాలోనే రూ. 12.5 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ వసూళ్లలో తెలుగు వెర్షన్ నుంచి రూ. 1.5 కోట్లు రాగా తమిళ వెర్షన్‌కు రూ. 11 కోట్లు వచ్చాయి. అయితే హిందీ బెల్ట్ నుంచి మాత్రం ఎలాంటి కలెక్షన్స్ రాలేదని ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి.
రెండో రోజు కలెక్షన్స్ అంచనా
అలాగే సినిమా విడుదలైన రోజున తమిళంలో రాయన్ సినిమాకు 58.65 శాతంగా ఆక్యుపెన్సీ నమోదు అయింది. ఇక రెండో రోజున అంటే శనివారం నాడు రాయన్ సినిమాకు రూ. 28 లక్షల ఇండియా నెట్ కలెక్షన్స్ వస్తాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. అయితే, ఇది కేవలం ఇప్పటి వరకు అన్ని షోలకు బుక్ అయిన టికెట్స్ ప్రకారంగా చెప్పిన సమాచారం. కానీ, ఆఫ్‌లైన్‌లో మరింతగా ప్రేక్షకులు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి రెండో రోజు వసూళ్లు నైట్ షో సమయం వరకు చెప్పలేం.
2 రోజుల్లో వచ్చేది
అయితే, ప్రస్తుతం వచ్చిన బుకింగ్స్ ప్రకారం చూసుకుంటే.. రాయన్ సినిమా ఇండియాలో రూ. 12.78 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేస్తుందని అంచనా వేశారు. ఇదిలా ఉంటే రాయన్ సినిమాను సన్ పిక్చర్స్ పతాకంపై కోలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరైన కళానిధి మారన్ నిర్మించారు. ఈ సినిమాతో హీరో ధనుష్ డైరెక్టర్ అవతారం ఎత్తాడు. తన 50వ సినిమాను చాలా స్పెషల్‌గా చేసుకునేందుకే ధనుష్ సొంతంగా డైరెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.
రాయన్ నటీనటులు
కాగా రాయన్ సినిమాలో టాలీవుడ్ హీరో సందీప్ కిషన్, ఎస్‌జే సూర్య, ప్రకాష్ రాజ్, సెల్వరాఘవన్, కాళిదాస్ జయరామ్, దుసరా విజయన్, అపర్ణ బాలమురళి, వరలక్ష్మి శరత్ కుమార్, శరవణన్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. ఇక ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.