Sundeep Kishan: అదొక అవార్డ్‌లా ఫీల్ అయ్యా, న్యూయార్క్ వెళ్లిన కూడా నేర్చుకోలేం.. హీరో సందీప్ కిషన్ కామెంట్స్
Sundeep Kishan Comments On Dhanush Raayan: ఇవాళ అంటే జూలై 26న స్టార్ హీరో ధనుష్ హీరోగా చేస్తూ దర్శకత్వం వహించిన రాయన్ సినిమా విడుదలై మంచి టాక్ తెచ్చుకుంటోంది. అయితే రాయన్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సందీప్ కిషన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Sundeep Kishan About Dhanush Raayan: తమిళ స్టార్ హీరో ధనుష్ తన కెరీర్‌లో 50వ సినిమాగా రాయన్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. జూలై 26న అంటే శుక్రవారం విడుదలైన ఈ సినిమాకు మంచి టాక్ వస్తోంది. ధనుష్ హీరోగా స్వీయ దర్శకత్వంలో వచ్చిన రాయన్‌లో సందీప్ కిషన్ కీలక పాత్ర పోషించాడు. అతనితోపాటు ప్రకాష్ రాజ్, ఆర్జే సూర్య, అపర్ణ బాలమురళి తదితురుల పలు కీ రోల్స్ చేశారు.
రాయన్ సినిమాను తెలుగులో ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా విడుదలకు ముందు హైదరాబాద్‌లో రాయన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అతిథులుగా హాజరు అయ్యారు. ఈ ఈవెంట్‌లో సందీప్ కిషన్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
"ముందుగా ఊరు పేరు భైరవకోన సినిమాని పెద్ద హిట్ చేసిన ఆడియన్స్ అందరికీ థాంక్ యూ. 14 ఏళ్లుగా నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్న మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. ధనుష్ అన్న రాయన్ సినిమాలో నన్ను యాక్ట్ చేయమని అడిగినప్పుడే అదొక అవార్డ్‌లానే ఫీల్ అయ్యా. ధనుష్ అన్న నాకు ఒక బ్రదర్ అండ్ గురువు లాంటి వారు" అని సందీప్ కిషన్ చెప్పాడు.
"ధనుష్ అన్న తన యాభైవ సినిమాలో తన కోసం రాసుకున్న క్యారెక్టర్‌లో నన్ను యాక్ట్ చేయమని ఆయన డైరెక్ట్ చేశారు. ఇంతకంటే నాకు గొప్ప అవార్డ్ ఉండదు. ఈ సినిమా చూసి ఒక తెలుగు హీరో తమిళ్‌లో ఇంత మంచి క్యారెక్టర్ చేయగలిగాడని ఆడియన్స్ అంతా చాలా గర్వంగా ఫీలౌతారు. కెప్టన్ మిల్లర్ ఫినిష్ అయ్యాక రాయన్ షూట్‌కి వెళ్లాం. ఈ షూటింగ్ మరచిపోని అనుభూతిని ఇచ్చింది" అని సందీప్ కిషన్ తెలిపాడు.
"చాలా కష్టమైన క్యారెక్టర్ అని ధనుష్ ముందే చెప్పారు. నా హెయిర్ స్టైల్ కూడా ఆయనే సెట్ చేశారు. ఆయన ఓ సీన్‌ను సింగిల్ టేక్‌లో పూర్తి చేశారు. కానీ, నేను 11 సెకన్ల లెంత్ ఉన్న సీన్‌కి 16 టేక్స్ తీసుకున్నా. తర్వాత, మిగిలిన వారంతా కూడా రీ టేక్స్ తీసుకోవడంతో నా భయం పోయింది (నవ్వుతూ). నన్ను తన పక్కన కూర్చుని ధనుష్ అన్న కొత్త విషయాలు నేర్పించారు" అని హీరో సందీప్ కిషన్ చెప్పుకొచ్చారు.
"జీవితంలో ఇలాంటి అవకాశం మరోసారి రాదేమో. న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీకి వెళ్లినా ఇలాంటి యాక్టింగ్ కోర్స్ నేర్చుకోలేం. ఒక నటుడికి ఇది చాలా గొప్ప అవకాశం. ఈ అవకాశం ఇచ్చిన ధనుష్ అన్నకి థాంక్ యూ. ప్రకాష్ రాజ్ గారితో కలసి నటించడం కూడా గొప్ప అనుభూతి. రెహమాన్ గారు నాకో పాటిచ్చారు" అని సందీప్ కిషన్ అన్నాడు.
"సన్ పిక్చర్స్‌కి థాంక్స్. టీం అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు. రాయన్ అద్భుతమైన సినిమా. ధనుష్ గారు యాక్టర్‌గా నేషనల్ అవార్డ్ గెలుచుకున్నారు. ఈ సినిమాతో డైరెక్టర్‌గా నేషనల్ అవార్డ్ గెలవాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది" అని హీరో సందీప్ కిషన్ తన స్పీచ్ ముగించాడు.