Suchitra Dhanush: హీరో ధనుష్ గే.. రాత్రి 3 గంటలకు నా భర్తతో ఏం పని.. సింగర్ సుచిత్ర కామెంట్స్-singer suchitra sensational comments on dhanush aishwarya rajinikanth her ex husband karthik ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Suchitra Dhanush: హీరో ధనుష్ గే.. రాత్రి 3 గంటలకు నా భర్తతో ఏం పని.. సింగర్ సుచిత్ర కామెంట్స్

Suchitra Dhanush: హీరో ధనుష్ గే.. రాత్రి 3 గంటలకు నా భర్తతో ఏం పని.. సింగర్ సుచిత్ర కామెంట్స్

Sanjiv Kumar HT Telugu
May 15, 2024 02:25 PM IST

Singer Suchitra Dhanush Gay: సింగర్ సుచిత్ర మరోసారి తన సుచీలీక్స్ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. స్టార్ హీరో ధనుష్ గే అన్న అర్థంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేసింది. తన మాజీ భర్త కార్తీక్‌తో రాత్రి 3 గంటలకు ఒకే గదిలో ఏం పని అని ప్రశ్నించింది.

హీరో ధనుష్ గే.. రాత్రి 3 గంటలకు నా భర్తతో ఏం పని.. సింగర్ సుచిత్ర కామెంట్స్
హీరో ధనుష్ గే.. రాత్రి 3 గంటలకు నా భర్తతో ఏం పని.. సింగర్ సుచిత్ర కామెంట్స్

Singer Suchitra Dhanush Gay: సింగర్ సుచిత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2016లో సుచిలీక్స్ పేరుతో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఎందరో టాప్ సెలబ్రిటీల వ్యక్తిగత రహస్యాలు బయటపెట్టింది. ఇప్పుడు మరోసారి సుచీ లీక్స్ మొదలుపెట్టింది సింగర్ సుచిత్ర. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) ఒక గే అన్న అర్థంలో షాకింగ్ కామెంట్స్ చేసింది.

yearly horoscope entry point

ఒకరినొకరు మోసం చేసుకుంటూ

ఇటీవల ఓ యూట్యూబ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ (Aishwarya Rajinikanth) గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టింది సుచిత్ర. "వాళ్లు పెళ్లయినప్పటి నుంచి ఒకరిని మరొకరు మోసం చేసుకుంటూనే ఉన్నారు. పెళ్లయిన విషయాన్నే మర్చిపోయి మిగతా వాళ్లతో డేటింగ్ చేశారు. భర్త మోసం చేశాడని ఆరోపించిన ఐశ్వర్య ఏమైనా పద్ధతిగా ఉందా. తను కూడా ఇతరులతో డేటింగ్ చేసి మోసం చేయలేదా" అని సుచిత్ర అన్నారు.

ధనుష్ నయం

"ఐశ్వర్య కంటే ధనుషే నయం. అయినా ఐశ్వర్య తన పిల్లలను ఎప్పుడూ పెద్దగా పట్టించుకోలేదు. అందుకే వారి కుమారులు యాత్ర, లింగ వారి అమ్మమ్మ-తాతయ్యల వద్ద పెరిగితే బాగుంటుంది" అని సుచిత్ర తెలిపింది. అలాగే తన భర్త కార్తీక్‌తో (Karthik Kumar) డివోర్స్ గురించి తెలిపింది.

11 ఏళ్లకు గే అని తెలిసింది

"కార్తీక్‌తో పెళ్లయిన 11 సంవత్సరాలకు అతడు గే అని నాకు తెలిసింది. ఆ విషయం బయటకు చెప్పే ధైర్యం అతనికి లేదు. ఆ మరుసటి ఏడాదే విడాకులు తీసుకున్నాను. బాగా తాగి నా భర్త, ధనుష్ ఒకే గదిలో ఉండేవారు. రాత్రిపూట గదిలో నా భర్తతో ధనుష్‌కు ఏం పని. అతనేమైనా గేనా. వీళ్లకో బ్యాచ్ ఉంటుంది. దాంట్లో నా భర్త, ధనుష్, ఆండ్రియా, ఫొటోగ్రాఫర్ రాము ఉన్నారు" అని సుచిత్ర చెప్పుకొచ్చింది.

మగ స్నేహితులతో

"పెళ్లయిన మొదటి సంవత్సరం కార్తీక్ కుమార్‌కి నాకు పిల్లలు కాకపోవడంతో డాక్టర్ దగ్గరకు వెళ్లాం. అప్పుడే డాక్టర్ అతను స్వలింగ సంపర్కుడా అని అడిగాడు. ఆ తర్వాత అతను మగ స్నేహితులతో ఎక్కువగా తిరుగుతూ ఉండడం గమనించాను. తరచూ ముంబైకి వెళ్తుంటాడు" అని తన భర్త కార్తీక్ గురించి సుచిత్ర తెలిపింది.

మానసిక ఆరోగ్యం బాలేదని

ఇదిలా ఉంటే, సుచిత్ర మానసిక స్థితి సరిగా లేదని, అందుకే పిచ్చి వాగుడు వాగుతుందని ఆమె మాజీ భర్త కార్తీక్ సోషల్ మీడియాలో ఓ వీడియా ద్వారా స్పందించాడు. అది కాస్తా వైరల్ అయింది. దాంతో అంతా అతను చెప్పేది నిజమా అని ఆలోచించసాగారు. ఇదివరకు కూడా ఓ ఇంటర్వ్యూలో కార్తీక్ తన భార్య సుచిత్ర మానసిక ఆరోగ్యం బాలేదని తెలిపాడు.

డ్రగ్స్ తీసుకోనందుకే

కార్తీక్ ఇంటర్వ్యూలో చెప్పిన విషయంపై కూడా సుచిత్ర స్పందించింది. తన మానసిక పరిస్థితి బాగోలేదని తన భర్త కావాలనే దుష్ప్రచారం చేశాడని, ఎప్పుడైతే తాను డ్రగ్స్ వాడేందుకు ఒప్పుకోలేదో అప్పుడే తనను ధనుష్, కార్తీక్ టార్గెట్ చేశారని షాకింగ్ కామెంట్స్ చేసింది గాయనీ సుచిత్ర.

Whats_app_banner