Pushpa in Russia: తగ్గేదేలే అంటూ రష్యాలోనూ పుష్ప టీమ్‌ ప్రమోషన్‌.. ఫొటోలు వైరల్-pushpa in russia as the team promoting the film with taggede le gesture ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pushpa In Russia: తగ్గేదేలే అంటూ రష్యాలోనూ పుష్ప టీమ్‌ ప్రమోషన్‌.. ఫొటోలు వైరల్

Pushpa in Russia: తగ్గేదేలే అంటూ రష్యాలోనూ పుష్ప టీమ్‌ ప్రమోషన్‌.. ఫొటోలు వైరల్

HT Telugu Desk HT Telugu
Nov 30, 2022 09:43 PM IST

Pushpa in Russia: తగ్గేదేలే అంటూ రష్యాలోనూ పుష్ప టీమ్‌ మూవీని ప్రమోట్‌ చేస్తోంది. ఈ సినిమా డిసెంబర్‌ 8న రష్యాలో రిలీజ్‌ కానుండగా.. బుధవారం (నవంబర్‌ 30) ఈ మూవీ టీమ్‌ రష్యాలో ల్యాండై అక్కడి మీడియాతో మాట్లాడింది.

రష్యాలో తగ్గేదే లే అంటున్న పుష్ప టీమ్
రష్యాలో తగ్గేదే లే అంటున్న పుష్ప టీమ్

Pushpa in Russia: పైన ఉన్న ఫొటో చూశారు కదా. రష్యాలోనూ తగ్గేదే లే అన్నట్లుగా పుష్ప టీమ్‌ ఫొటోలకు పోజులిచ్చింది. ఈ మూవీ హీరో, హీరోయినట్లు అల్లు అర్జున్‌, రష్మిక మందన్నాతోపాటు డైరెక్టర్‌ సుకుమార్, మ్యూజిక్‌ డైరెక్టర్‌ దేవిశ్రీ ప్రసాద్‌ ఇలా మూవీలోని తగ్గేదే లే మేనరిజంతో అదరగొట్టారు. ఇండియాలో గతేడాది డిసెంబర్‌లో రిలీజైన ఈ సినిమా సుమారు ఏడాది తర్వాత రష్యాలో ల్యాండవుతోంది.

డిసెంబర్‌ 1, 3 తేదీల్లో రష్యాలోని మాస్కో, సెయింట్ పీటర్స్‌బర్గ్‌లలో ప్రీమియర్‌ షోలు ఉన్నాయి. దీనికోసం టీమంతా మంగళవారమే రష్యా చేరుకుంది. ఆ తర్వాత అక్కడి మీడియాతో మాట్లాడారు. సినిమా డిసెంబర్‌ 8న రష్యాలోని 24 నగరాల్లో రిలీజ్‌ కానుంది. ఆలోపే తమ మూవీని ప్రమోట్‌ చేయడం కోసం పుష్ప టీమ్‌ మాస్కో చేరుకుంది.

బుధవారం రష్యన్‌ మీడియాతో కూడా టీమ్‌ మాట్లాడింది. ఈ సందర్భంగా వాళ్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ప్రెస్‌మీట్‌ ముగిసిన తర్వాత చివర్లో ఇలా ఫొటోలు దిగారు. ఆ ఫొటోను అల్లు అర్జున్‌ తన ట్విటర్‌లో షేర్‌ చేసుకున్నాడు. రష్యాలో పుష్ప క్యాప్షన్‌తో ఈ ఫొటోను పోస్ట్‌ చేశాడు. డిసెంబర్‌ 1, 3 తేదీల్లో వేసే ప్రీమియర్‌ షోలకు ఈ టీమంతా హాజరు కానుంది.

సుకుమార్‌ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా పాన్‌ ఇండియా లెవల్లో సక్సెస్‌ సాధించింది. రూ.400 కోట్లకుపైగా వసూలు చేసింది. ఎర్రచందనం స్మగ్లింగ్‌ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ సినిమాలో అల్లు అర్జున్‌.. పుష్ప అనే ఓ కూలీ పాత్రలో కనిపించాడు. ఆ కూలీయే తర్వాతి కాలంలో ఎలా ఎదిగాడన్నదే ఈ మూవీ స్టోరీ. ఇప్పుడు సీక్వెల్‌ షూటింగ్‌ కూడా ప్రారంభం కాబోతోంది.

Whats_app_banner