Sukumar Vivek Agnihotri Movie: కార్తికేయ - 2 ప్రొడ్యూసర్‌తో సుకుమార్ పాన్ ఇండియన్ సినిమా
Sukumar Vivek Agnihotri Movie: కార్తికేయ -2 ప్రొడ్యూసర్‌తో ఓ పాన్ ఇండియన్ సినిమాను చేయబోతున్నాడు దర్శకుడు సుకుమార్. ఈ సినిమాలో కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి భాగం కాబోతున్నాడు. శుక్రవారం ఈ సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.
Sukumar Vivek Agnihotri Movie: పుష్ప సినిమాతో దర్శకుడిగా పాన్ ఇండియన్ స్థాయిలో పెద్ద విజయాన్ని అందుకున్నాడు దర్శకుడు సుకుమార్. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమా బాలీవుడ్‌లో వంద కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. వరల్డ్ వైడ్‌గా 400 కోట్ల కలెక్షన్స్ రాబట్టి సుకుమార్ తో పాటు అల్లు అర్జున్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. తాజాగా సుకుమార్ మరో పాన్ ఇండియన్ సినిమా చేయబోతున్నాడు.
ఈ సినిమాను కార్తికేయ -2 ప్రొడ్యూసర్ అభిషేక్ అగర్వాల్ నిర్మించబోతున్నారు. కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి ఈ ప్రాజెక్ట్‌లో భాగం కాబోతున్నాడు. దర్శకుడు సుకుమార్, వివేక్ అగ్నిహోత్రిలతో కలిసి దిగిన ఫొటోలను అభిషేక్ అగర్వాల్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇండియన్ సినిమా ముఖచిత్రాన్ని మార్చేలా భారీ బడ్జెట్‌తో ఈ పాన్ ఇండియన్ సినిమాను రూపొందించబోతున్నట్లు పేర్కొన్నాడు.
ఈ పాన్ ఇండియన్ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాల్ని త్వరలోనే వెల్లడించబోతున్నట్లు పేర్కొన్నాడు. ఈ సినిమాకు సుకుమార్, వివేక్ అగ్నిహోత్రి కలిసి దర్శకత్వం వహిస్తారా ? లేదంటే సుకుమార్ ప్రొడ్యూసర్‌గా మాత్రమే ఉంటాడా అన్నది రివీల్ చేయలేదు. కాగా ప్రస్తుతం పుష్ప ది రూల్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులతో సుకుమార్ బిజీగా ఉన్నాడు.
ఈ వారంలోనే పుష్ప -2 షూటింగ్ మొదలుకానుంది.పుష్ప సినిమాకు కొనసాగింపుగా రూపొందుతోన్న ఈ సినిమాపై టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. సెకండ్ పార్ట్‌లో పుష్పరాజ్ వ్యక్తిగత జీవితంలో పాటు ఎర్రచందనం సిండికేట్ నాయకుడిగా అతడికి ఎదురైన సంఘటనలను సుకుమార్ ఆవిష్కరించబోతున్నట్లు సమాచార. ఈ సీక్వెల్‌లో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది.