Allu Arjun - Sreeleela: అల్లు అర్జున్‌కు జోడీగా శ్రీలీల - త్రివిక్రమ్ డైరెక్టర్
Allu Arjun - Sreeleela: టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీల మరో బంపరాఫర్‌ను దక్కించుకున్నది. స్టార్ హీరో అల్లు అర్జున్‌కు జోడీగా నటించింది. కానీ సినిమాలో కాదు...
Allu Arjun - Sreeleela: అదృష్టం అంటే శ్రీలీలదే అంటున్నారు టాలీవుడ్ వర్గాలు. ఈ అమ్మడు ఇప్పటివరకు తెలుగులో ఒకే ఒక సినిమా చేసింది. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందిన పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈసినిమా యావరేజ్‌గా నిలిచినా తన అందచందాలు, గ్లామర్ తళుకులతో అభిమానులను ఆకట్టుకున్నది శ్రీలీల.
ఈ ముద్దుగుమ్మకు తెలుగులో అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం రవితేజ ధమాకా, నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు, నితిన్ 32, వైష్ణవ్‌తేజ్ కొత్త సినిమాలోనూ హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా అల్లు అర్జున్ సరసన కనిపించబోతున్నది అయితే సినిమాలో కాదు. ఓ యాడ్ ఫిల్మ్‌లో అల్లు అర్జున్‌తో కలిసి శ్రీలీల నటించింది.
ఈ యాడ్ ఫిల్మ్‌కు త్రివిక్రమ్ దర్శకత్వం వహించినట్లు తెలిసింది. రవి కె చంద్రన్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసినట్లు సమాచారం. ఈ యాడ్ ఫిల్మ్ షూటింగ్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో శని, ఆదివారాలలో జరిగినట్లు చెబుతున్నారు. తివిక్రమ్, అల్లు అర్జున్, రవి కె చంద్రన్‌లతో శ్రీలీల తిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. ఇందులో అల్లు అర్జున్ స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్నారు.
త్వరలోనే పుష్ప -2 షూటింగ్ మొదలుపెట్టబోతున్నారు అల్లు అర్జున్. ఈ సీక్వెల్‌కు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది.