Kannappa Heroine: మంచు విష్ణుకు దొరికేసిన హీరోయిన్.. కన్నప్పతో మోడల్ ఎంట్రీ.. ఇంతకీ ఆమె ఎవరంటే?-preity mukundhan telugu debut with manchu vishnu kannappa movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kannappa Heroine: మంచు విష్ణుకు దొరికేసిన హీరోయిన్.. కన్నప్పతో మోడల్ ఎంట్రీ.. ఇంతకీ ఆమె ఎవరంటే?

Kannappa Heroine: మంచు విష్ణుకు దొరికేసిన హీరోయిన్.. కన్నప్పతో మోడల్ ఎంట్రీ.. ఇంతకీ ఆమె ఎవరంటే?

Sanjiv Kumar HT Telugu
Dec 14, 2023 05:35 PM IST

Kannappa Movie Heroine Preity Mukundan: మంచు విష్ణు ప్రతిష్టాత్మక చిత్రం కన్నప్ప నుంచి బాలీవుడ్ బ్యూటి నుపుర్ సనన్ తప్పుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆమె స్థానంలో కన్నప్ప మూవీకి హీరోయిన్‌గా మోడల్ ప్రీతి ముకుందన్‌ను ఎంపిక చేశారు మేకర్స్.

మంచు విష్ణు కన్నప్ప మూవీలో హీరోయిన్‌గా ప్రీతి ముకుందన్.. తెలుగులోకి మోడల్ ఎంట్రీ
మంచు విష్ణు కన్నప్ప మూవీలో హీరోయిన్‌గా ప్రీతి ముకుందన్.. తెలుగులోకి మోడల్ ఎంట్రీ

Preity Mukundan Telugu Entry: మంచు ఫ్యామిలీ నుంచి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘కన్నప్ప’. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఈ కన్నప్ప మీద అంచనాలు భారీగానే ఏర్పడుతున్నాయి. ఇదివరకే కన్నప్ప ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకుంది. అయితే, కన్నప్ప సినిమా నుంచి డేట్స్ కుదరకపోవడంతో నుపుర్ సనన్ హీరోయిన్‌గా తప్పుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మేకర్స్ హీరోయిన్‌కు సంబంధించి ప్రకటన చేశారు.

కన్నప్ప చిత్రంలో మంచు విష్ణు సరసన మోడల్ ప్రీతి ముకుందన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మేరకు టీంలోకి ఆమెను స్వాగతించింది కన్నప్ప చిత్రయూనిట్. ప్రీతి నటించబోతున్న కీలక పాత్ర కోసం ఆడిషన్స్ నిర్వహించారు. ఎన్నో రకాల ఆడిషన్స్ తరువాత ప్రీతి ఈ పాత్రకు సరిగ్గా సరిపోతుందని చిత్రయూనిట్ భావించింది. విష్ణు మంచు, మోహన్‌లాల్, ప్రభాస్ వంటి వారు నటిస్తున్న ఈ కన్నప్ప మూవీతో ప్రీతి కెరీర్ లో మరో స్థాయికి వెళ్లనున్నారు.

ఇప్పటివరకు ఎన్నో యాడ్స్‌కు మోడల్‌గా చేసిన ప్రీతి ముకుందన్ భరతనాట్య కళాకారిణి. ఈ సినిమాతోనే తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది ప్రీతి ముకుందన్. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ప్రీతి.. తన భరతనాట్య కళతో పాత్రకు ప్రాణం పోయనుందని మేకర్స్ చెబుతున్నారు. ‘కన్నప్ప’లోని యాక్షన్ సీక్వెన్స్‌లతో పాటుగా ఆమె నృత్య నైపుణ్యం ప్రేక్షకులకు విజువల్ ట్రీట్‌గా ఉండనుందట. సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేలా కన్నప్పను తెరకెక్కిస్తున్నట్లు పేర్కొన్నారు.

‘ప్రీతీకి ఇది తొలి సినిమా మాత్రమే కాదు. కళ, సినిమా రంగాల గురించి మరింత ఎక్కువగా నేర్చుకునే ప్రపంచంలోకి వచ్చింది. ఆమె ఈ పాత్రకు సరిగ్గా సరిపోతుంది. ఆమెతో కలిసి పనిచేయడానికి టీం అంతా ఎదురుచూస్తోంది’ అని కన్నప్ప డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ తెలిపారు. ఇదిలా ఉంటే కన్నప్ప సినిమాలో ప్రభాస్, నయనతార శివపార్వతుల్లా, మోహన్ లాల్, శివరాజ్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే.

IPL_Entry_Point