Prasanth Varma Mahakali: ఇండియాలో ఫస్ట్ ఫిమేల్ సూపర్ హీరో మూవీ చేయబోతున్న ప్రశాంత్ వర్మ - టైటిల్ ఇదే!
Mahakali: హానుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ తెలుగులో ఫస్ట్ టైమ్ ఫిమేల్ సూపర్ హీరో మూవీ చేయబోతున్నాడు. మహాకాళీ పేరుతో తెరకెక్కుతోన్న ఈ మూవీని గురువారం అనౌన్స్‌చేశారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో మూడో మూవీగా రాబోతున్న ఈ మూవీకి ప్రశాంత్ వర్మ కథను మాత్రమే అందిస్తోన్నాడు.
Prasanth Varma Mahakali: హనుమాన్ తర్వాత ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి ఓ లేడీ ఓరియెంటెడ్ సూపర్ హీరో మూవీ రాబోతోంది. ఈ సినిమాను గురువారం అఫీషియల్‌గా అనౌన్స్‌చేశారు. ఈ సూపర్ హీరో మూవీకి మహాకాళీ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. మహాకాళీ అనౌన్స్‌మెంట్ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
వెస్ట్ బెంగాల్ బ్యాక్‌డ్రాప్‌లో...
వీడియో చివరలో ఓ పెద్దపులికి తలకు ఆనించి చిన్నారి కనిపిస్తోంది. బ్యాక్‌గ్రౌండ్‌లో ఓ టెంపుల్, బ్రిడ్జ్ కనిపిస్తున్నాయి. వెస్ట్ బెంగాల్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీ తెరకెక్కుతోన్నట్లు సమాచారం. కాళీమాత శక్తిని, శౌర్యపరాక్రమాలను మోడ్రన్ టచ్‌లో ఈ మూవీలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. చెడుపై యుద్ధం చేయడానికి కాళీకాదేవి వస్తోంది అంటూ సినిమా గురించి ప్రశాంత్ వర్మ ట్వీట్ చేశాడు.
మార్టిన్ లూథర్ కింగ్ తర్వాత...
మహాకాళీ మూవీకి పూజ కొల్లూరు వహిస్తోంది. సంపూర్ణేష్‌బాబు హీరోగా నటించిన మార్టిన్ లూథర్ కింగ్ మూవీతో డైరెక్టర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది పూజ కొల్లూరు. డైరెక్టర్‌గా ఇది ఆమెకు సెకండ్ మూవీ. మహా కాళీ మూవీకి ప్రశాంత్ వర్మ కథ, స్క్రీన్‌ప్లేను సమకూర్చుతున్నారు. పాన్ ఇండియన్ లెవెల్‌లో రూపొందుతోన్న ఈ మూవీలో మహాకాళీ పాత్రలో ఓ స్టార్ హీరోయిన్ కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆమె ఎవరన్నది మాత్రం ప్రశాంత్ వర్మ రివీల్ చేయలేదు. త్వరలోనే హీరోయిన్‌గాపై క్లారిటీ రానున్నట్లు తెలుస్తోంది.
మూడో మూవీ...
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో రాబోతున్న మూడో సినిమా ఇది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో ఫస్ట్ మూవీగా హనుమాన్ రాగా...సెకండ్ మూవీగా మోక్షజ్ఞ తేజమూవీని అనౌన్స్‌చేశారు. నాలుగో సినిమాగా డీవీవీ దానయ్య తనయుడు హీరోగా నటిస్తోన్న అధీరా రాబోతుంది.
మోక్షజ్ఞ తేజ మూవీ...
హనుమాన్‌తో పాన్ ఇండియన్ లెవెల్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అందుకున్న ప్రశాంత్ వర్మ ప్రస్తుతం మోక్షజ్ఞ తేజ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారు. మోక్షజ్ఞ తేజ బర్త్ డే సందర్భంగా ఇటీవలే ఈ సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్‌చేశారు. మైథలాజికల్ అంశాలకు సూపర్ హీరో ఎలిమెంట్స్ మిక్స్ చేస్తూ ఈ మూవీ తెరకెక్కుతోంది. డిసెంబర్‌లో మోక్షజ్ఞ తేజ, ప్రశాంత్ వర్మ మూవీ లాంఛ్ కాబోతుంది. మహాకాళీతో పాటు అధీరా మూవీకి ప్రశాంత్ వర్మ కథ, స్క్రీన్‌ప్లేను మాత్రమే సమకూర్చుతున్నారు.