Prashant Verma: ఆగిపోయిన ప్ర‌శాంత్ వ‌ర్మ బాలీవుడ్ డెబ్యూ మూవీ- రాక్ష‌స్ బైబై చెప్పిన ర‌ణ్‌వీర్‌ - కార‌ణం ఇదే!-ranveer singh prashant verma rakshas movie shelved official statement issued ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Prashant Verma: ఆగిపోయిన ప్ర‌శాంత్ వ‌ర్మ బాలీవుడ్ డెబ్యూ మూవీ- రాక్ష‌స్ బైబై చెప్పిన ర‌ణ్‌వీర్‌ - కార‌ణం ఇదే!

Prashant Verma: ఆగిపోయిన ప్ర‌శాంత్ వ‌ర్మ బాలీవుడ్ డెబ్యూ మూవీ- రాక్ష‌స్ బైబై చెప్పిన ర‌ణ్‌వీర్‌ - కార‌ణం ఇదే!

Nelki Naresh Kumar HT Telugu
May 30, 2024 01:18 PM IST

Prashant Verma: బాలీవుడ్ హీరో ర‌ణ‌వీర్‌సింగ్‌, డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ కాంబోలో రానున్న రాక్ష‌స్ మూవీ అనౌన్స్‌మెంట్‌కు ముందే ఆగిపోయింది. రాక్ష‌స్ సినిమాను ప‌క్క‌న‌పెట్టిన‌ట్లు ర‌ణ‌వీర్‌సింగ్‌తో పాటు ప్ర‌శాంత్ వ‌ర్మ అఫీషియ‌ల్‌గా వెల్ల‌డించారు.

ర‌ణ‌వీర్‌సింగ్‌, డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ
ర‌ణ‌వీర్‌సింగ్‌, డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ

Prashant Verma: హ‌నుమాన్‌తో పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ అందుకున్నాడు టాలీవుడ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వర్మ‌. న‌ల‌భై కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ తెలుగు మూవీ 330 కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టి స‌త్తాచాటింది. హ‌నుమాన్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌తో ప్ర‌శాంత్ వ‌ర్మ‌కు బాలీవుడ్ నుంచి ఆఫ‌ర్లు క్యూ క‌ట్టాయి.

రాక్ష‌స్ మూవీ...

బాలీవుడ్ స్టార్ హీరో ర‌ణ‌వీర్‌సింగ్‌తో ఓ సినిమా చేసే అవ‌కాశాన్ని ద‌క్కించుకున్నాడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌. ర‌ణ్‌వీర్‌సింగ్‌, ప్ర‌శాంత్ వ‌ర్మ మూవీకి రాక్ష‌స్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. మైథ‌లాజిక‌ల్ ట‌చ్‌తో యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ మూవీ తెర‌కెక్క‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో మైత్రీ మూవీ మేక‌ర్స్ రాక్ష‌స్ సినిమాను సినిమాను నిర్మించ‌డానికి ముందుకొచ్చింది. త్వ‌ర‌లోనే ఈ సినిమాను అఫీషియ‌ల్‌గా అనౌన్స్‌చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.

అనౌన్స్‌మెంట్‌కు ముందే ప్యాక‌ప్‌...

కానీ అనౌన్స్‌మెంట్‌కు ముందే రాక్ష‌స్‌ సినిమా ఆగిపోయింది. రాక్ష‌స్ మూవీ చేయ‌డం లేద‌ని ర‌ణ్‌వీర్‌సింగ్‌తో పాటు ప్ర‌శాంత్ వ‌ర్మ అఫీషియ‌ల్‌గా వెల్ల‌డించారు. ఈ మేర‌కు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ గురువారం ఓ ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల‌చేసింది.

భ‌విష్య‌త్తులో క‌లిసి చేస్తాం...

ఈ స్టేట్‌మెంట్‌లో ప్ర‌శాంత్ వ‌ర్మ అద్భుత‌మైన ప్ర‌తిభాసామ‌ర్థ్యాలు ఉన్న ద‌ర్శ‌కుడు. మేమిద్ద‌రం క‌లిసి ఓ మంచి సినిమా చేయాల‌ని అనుకున్నాం. కానీ స‌రైన క‌థ కుద‌ర‌లేదు. మ‌మ్మ‌ల్ని ఎగ్జైట్ చేసే క‌థ దొరికితే భ‌వ్యిష‌త్తులో మా ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో ఓ సినిమా త‌ప్ప‌కుండా ఉంటుంది అని ర‌ణ్‌వీర్ సింగ్ పేర్కొన్నాడు. ర‌ణ‌వీర్‌సింగ్‌ టాలెంట్‌, ఎన‌ర్జీ అసామాన్యం. ర‌ణ్‌వీర్ లాంటి అరుదైన‌ న‌టుడితో భ‌విష్య‌త్తులో త‌ప్ప‌కుండా సినిమా చేస్తాన‌ని ప్ర‌శాంత్ వ‌ర్మ కూడా ఈ స్టేట్‌మెంట్‌లో తెలిపాడు.

ర‌ణ్‌వీర్‌సింగ్‌, ప్ర‌శాంత్ వ‌ర్మ ఇద్ద‌రి మ్యూచ‌వల్ అండ‌ర్‌స్టాండింగ్‌తోనే ఈ ప్రాజెక్ట్‌ను ప‌క్క‌న‌పెడుతోన్న‌ట్లు మైత్రీ మూవీ మేక‌ర్స్ తెలిపింది. రాక్ష‌స్‌ను తెర‌కెక్కించేందుకు ఇది రైట్ టైమ్ కాద‌ని వెల్ల‌డించింది. మైత్రీ మూవీ మేక‌ర్స్ రిలీజ్ చేసిన ఈ స్టేట్‌మెంట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

క్రియేటివ్ డిఫ‌రెన్స్ కార‌ణ‌మా...

ర‌ణ‌వీర్‌సింగ్‌, డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ మ‌ధ్య నెల‌కొన్న క్రియేటివ్ డిఫ‌రెన్సెస్‌తోనే ఈ మూవీ ఆగిపోయిన‌ట్లు స‌మాచారం. రాక్ష‌స్ కోసం ప్ర‌శాంత్ వ‌ర్మ సిద్ధం చేసిన క‌థ ర‌ణ‌వీర్‌సింగ్‌కు న‌చ్చ‌లేద‌ని అంటున్నారు. క‌థ విష‌యంలో అసంతృప్తితోనే ర‌ణ‌వీర్‌సింగ్ ఈ మూవీ నుంచి త‌ప్పుకున్న‌ట్లు చెబుతోన్నారు. ర‌ణ‌వీర్ రిజెక్ష‌న్‌పై ప్ర‌శాంత్ వ‌ర్మ కూడా హ‌ర్ట్ అయిన‌ట్లు టాలీవుడ్ వ‌ర్గాల్లో వ‌ర్తాలు వినిపిస్తున్నాయి.

జై హ‌నుమాన్‌...

ప్ర‌స్తుతం హ‌నుమాన్‌కు సీక్వెల్‌గా జై హ‌నుమాన్ అనే సినిమాను తెర‌కెక్కిస్తోన్నాడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌. ఈ సీక్వెల్‌కు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతోన్నాయి. హ‌నుమాన్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌తో ఈ సీక్వెల్‌పై భారీగా అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఇందులో టైటిల్ పాత్ర‌లో ఓ స్టార్ హీరో న‌టించ‌నున్న‌ట్లు స‌మాచారం. హ‌నుమాన్ హీరో తేజా స‌జ్జా కూడా ఈ సీక్వెల్‌లో గెస్ట్ రోల్‌లో క‌నిపిస్తాడ‌ని అంటున్నారు. మార్వెల్ త‌ర‌హాలో హ‌నుమాన్ మూవీని ఫ్రాంచైజ్‌లా తెర‌కెక్కించాల‌నే ఆలోచ‌న‌లో ప్ర‌శాంత్ వ‌ర్మ ఉన్నాడ‌ని అంటున్నారు.

డీవీవీ దానయ్య తనయుడితో…

జై హ‌నుమాన్‌తో పాటు డీవీవీ దాన‌య్య త‌న‌యుడు హీరోగా ఎంట్రీ ఇస్తోన్న మూవీకి ప్ర‌శాంత్ వ‌ర్మ క‌థ‌ను అందించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఈ సినిమాకు తొలుత ప్ర‌శాంత్ వ‌ర్మనే ద‌ర్శ‌కుడిగా అనౌన్స్‌చేశారు. కానీ ప్ర‌శాంత్ వ‌ర్మ బిజీ కావ‌డంతో ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌ల‌ను మ‌రో డైరెక్ట‌ర్‌కు అప్ప‌గించిన‌ట్లు వార్త‌లొస్తున్నాయి.

టీ20 వరల్డ్ కప్ 2024

టాపిక్