Tollywood: విశ్వక్ సేన్ వర్సెస్ ఆనంద్ దేవరకొండ -ఈ వారం టాలీవుడ్ బాక్సాఫీస్ బ‌రిలో నిలిచిన సినిమాలు ఇవే-gangs of godavari to gam ganesha tollywood releases this week in theaters ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Tollywood: విశ్వక్ సేన్ వర్సెస్ ఆనంద్ దేవరకొండ -ఈ వారం టాలీవుడ్ బాక్సాఫీస్ బ‌రిలో నిలిచిన సినిమాలు ఇవే

Tollywood: విశ్వక్ సేన్ వర్సెస్ ఆనంద్ దేవరకొండ -ఈ వారం టాలీవుడ్ బాక్సాఫీస్ బ‌రిలో నిలిచిన సినిమాలు ఇవే

May 29, 2024, 02:16 PM IST Nelki Naresh Kumar
May 29, 2024, 02:16 PM , IST

ఈ వారం టాలీవుడ్ బాక్సాఫీస్ బ‌రిలో మూడు సినిమాలు నిలిచాయి. తొలుత ఆరుకుపైగా సినిమాలు బ‌రిలో నిల‌వ‌గా..మూడు సినిమాలు పోటీ నుంచి త‌ప్పుకొన్నాయి. ఈ వారం రిలీజ్ అవుతోన్న ఆ సినిమాలు ఏవంటే?

విశ్వ‌క్‌సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి మూవీ ఈ శుక్ర‌వార‌మే థియేట‌ర్ల‌లోకి రాబోతోంది. గోదావ‌రి జిల్లాల బ్యాక్‌డ్రాప్‌లో యాక్ష‌న్ రివేంజ్ డ్రామాగా తెర‌కెక్కుతోన్న ఈ మూవీకి కృష్ణ చైత‌న్య ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు. నేహా శెట్టి హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ మూవీలో అంజ‌లి ఓ కీల‌క పాత్ర పోషిస్తోంది. ఈ వారం రిలీజ్ అవుతోన్న సినిమాల్లో గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రిపైనే ఎక్కువ‌గా ఎక్స్‌పెక్టేష‌న్స్ నెల‌కొన్నాయి. 

(1 / 4)

బేబీ స‌క్సెస్ త‌ర్వాత గం గం గ‌ణేశా మూవీతో హీరోగా తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు ఆనంద్ దేవ‌ర‌కొండ‌. ఈ క్రైమ్ కామెడీ మూవీలో ఆనంద్ దేవ‌ర‌కొండ‌కు జోడీగా ప్ర‌గ‌తి శ్రీవాస్త‌వ‌, న‌య‌న్ సారిక హీరోయిన్లుగా క‌నిపించ‌బోతున్నాడు. ఉద‌య్‌శెట్టి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు. గం గం గ‌ణేశా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ర‌ష్మిక చీఫ్ గెస్ట్‌గా రావ‌డంతో ఈ సినిమాపై బ‌జ్ ఏర్ప‌డింది.  ఈ సినిమా రిజ‌ల్ట్ ఏమిట‌న్న‌ది మే 31న తేల‌నుంది. 

(2 / 4)

ఈ వారం త‌మిళ డ‌బ్బింగ్ మూవీ హిట్ లిస్ట్ కూడా థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌బోతున్న‌ది. విజ‌య్ క‌నిష్క హీరోగా న‌టిస్తోన్న ఈ సినిమాలో స‌ముద్ర‌ఖ‌ని, శ‌ర‌త్‌కుమార్ కీల‌క పాత్ర‌లు పోషించారు. కే కార్తికేయ‌న్ ద‌ర్శ‌కుడు. 

(3 / 4)

మే 31న కార్తికేయ భ‌జేవాయువేగం, కాజ‌ల్ స‌త్య‌భామ‌, సుధీర్‌బాబు హ‌రోంహ‌రం కూడా రిలీజ్ చేయాల‌ని అనుకున్నారు. రిలీజ్ డేట్స్ ప్ర‌క‌టించారు. కానీ అనివార్య కార‌ణాల వ‌ల్ల జూన్‌కు ఈ సినిమాలు వాయిదాప‌డ్డాయి. 

(4 / 4)

టీ20 వరల్డ్ కప్ 2024

ఇతర గ్యాలరీలు