OTT Romantic Movie: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు లవ్ రొమాంటిక్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..-prabuthwa junior kalashala movie streaming now in aha ott platform ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Romantic Movie: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు లవ్ రొమాంటిక్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

OTT Romantic Movie: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు లవ్ రొమాంటిక్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

Chatakonda Krishna Prakash HT Telugu
Aug 26, 2024 08:14 PM IST

Prabuthwa Junior Kalashala OTT Streaming: ప్రభుత్వ జూనియర్ కళాశాల సినిమా ఓటీటీలో అడుగుపెట్టేసింది. ఈ లోబడ్జెట్‍తో వచ్చిన ఈ చిత్రానికి థియేటర్లలో మిక్స్డ్ టాక్ వచ్చింది. ఈ మూవీ ఇప్పుడు ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. ఆ వివరాలివే..

OTT Romantic Movie: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు లవ్ రొమాంటిక్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
OTT Romantic Movie: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు లవ్ రొమాంటిక్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

ప్రణవ్ ప్రీతమ్, షాజ్ఞశ్రీ వేణున్ హీరోహీరోయిన్లుగా నటించిన ప్రభుత్వ జూనియర్ కళాశాల సినిమా జూన్ 21వ తేదీన థియేటర్లలో రిలీజైంది. తక్కువ బడ్జెట్‍తో ఈ లవ్ రొమాంటిక్ డ్రామా మూవీ తెరకెక్కింది. శ్రీనాథ్ పులకూరం ఈ మూవీకి దర్శకత్వం వహించారు. టీనేజ్ లవ్ స్టోరీతో కూడిన ఈ మూవీ ట్రైలర్ బజ్ తెచ్చుకుంది. అయితే, థియేటర్లలో ప్రభుత్వ జూనియర్ కళాశాల చిత్రం పెద్దగా ఆడలేదు. ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.

స్ట్రీమింగ్ వివరాలివే

ప్రభుత్వ జూనియర్ కళాశాల సినిమా ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది. థియేటర్లలో రిలీజైన సుమారు రెండు నెలల తర్వాత ఈ మూవీ ఆహాలోకి అడుగుపెట్టింది. థియేటర్లలో మిక్స్డ్ టాక్ దక్కించుకున్న ఈ మూవీ.. ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.

ప్రభుత్వ జూనియర్ కళాశాల చిత్రంలో ప్రణవ్, షాజ్ఞశ్రీతో పాటు ముణిచంద్ర, మండపేట మల్లిక, బాంబే పద్మ కీలకపాత్రలు పోషించారు. లవ్ స్టోరీ, కామెడీ, ఎమోషన్‍తో ఈ చిత్రాన్ని దర్శకుడు శ్రీనాథ్ తెరకెక్కించారు. యధార్థ ఘటన ఆధారంగా రూపొందించినట్టు మేకర్స్ తెలిపారు. అయితే, ఈ మూవీ నరేషన్ విషయంలో నెగెటివ్ టాక్ వచ్చింది. దీంతో ఈ చిత్రం థియేటర్లలో అనుకున్న విధంగా కలెక్షన్లను దక్కించుకోలేకపోయింది.

ప్రభుత్వ జూనియర్ కళాశాల చిత్రాన్ని భువన్ రెడ్డి కొవ్వూరి నిర్మించారు. కార్తీక్ రొడ్రిగ్జ్ సంగీతం అందించిన ఈ చిత్రానికి నిఖిల్ సురేంద్రన్ సినిమాటోగ్రఫీ చేశారు.

ప్రభుత్వ జూనియర్ కళాశాల స్టోరీ

చిత్తూరు జిల్లాలోని పుంగనూరు అనే ఊర్లో 2004 బ్యాక్‍డ్రాప్‍లో ప్రభుత్వ జూనియర్ కళాశాల మూవీ స్టోరీ సాగుతుంది. వాసు (ప్రణవ్ ప్రీతమ్) ఇంటర్మీడియట్ తొలి సంవత్సరం చదువుతుంటాడు. అదే కాలేజీలో చదివే కమారి (షాజ్ఞ శ్రీ వేణుణ్)తో వాసు ప్రేమలో పడతాడు. కొన్నాళ్లకు కుమారి కూడా వాసును లవ్ చేస్తుంది. అయితే, వారి మధ్య కొంతకాలానికే విభేదాలు వస్తాయి. గొడవలు పడతారు. ఈ క్రమంలో కుమారికి సంబంధించిన కొన్ని అనూహ్యమైన నిజాలు తెలుస్తాయి. దీంతో వాసు ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? కుమారి గురించి వాసుకు తెలిసిన విషయాలు ఏంటి? అతడు ఎందుకు చనిపోవాలనుకున్నాడు? వీరి ప్రేమ సక్సెస్ అయిందా? అనే అంశాలు ప్రభుత్వ జూనియర్ కళాశాల మూవీలో ప్రధాన అంశాలుగా ఉంటాయి.

ఆహాలో విరాజి మూవీ

విరాజి సినిమా ఆహా ఓటీటీలో గత వారం స్ట్రీమింగ్‍కు వచ్చింది. వరుణ్ సందేశ్ హీరోగా నటించిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా ఆగస్టు 2న థియేటర్లలో రిలీజ్ అయింది. ఆద్యంత్ హర్ష దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. మొత్తంగా విరాజి మూవీ థియేటర్లలో రిలీజైన 20 రోజులకే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. ఈ చిత్రంలో వరుణ్ సందేశ్‍తో పాటు రఘు కారుమంచి, ప్రమోదిని, బలగం జయరాం, వైవా రాఘవ, రవితేజ నాన్నిమల కీలకపాత్రలు పోషించారు. మహేంద్ర నాథ్ కొండల డైరెక్ట్ చేసిన విరాజి మూవీకి ఎబినేజర్ పౌల్ మ్యూజిక్ ఇచ్చారు.