OTT Telugu: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సైకలాజికల్ సస్సెన్స్ థ్రిల్లర్ మూవీ.. ఎన్నో ట్విస్టులు.. ఎక్కడ చూడాలంటే?
Telugu Suspense Thriller Viraaji OTT Streaming Now: ఓటీటీలోకి తెలుగు సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ విరాజీ వచ్చేసింది. వరుణ్ సందేశ్ నటించిన ఈ సినిమా ఎన్నో ట్విస్టులతో ఉండనుంది. ఆద్యంత్ హర్ష దర్శకత్వం వహించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ విరాజీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో చూద్దాం.
Viraaji OTT Released: ఓటీటీల్లోకి వచ్చే సినిమాలపై దేశవ్యాప్తంగా ఆడియెన్స్ అందరికీ స్పెషల్ ఫోకస్ ఉంటుంది. థియేటర్లలో సినిమాలు చూడటం తగ్గించేసిన జనాలు ఎక్కువగా డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్‌పై మూవీస్ వీక్షించేందుకు ఇష్టపడుతున్న విషయం తెలిసిందే. అందుకే ఎప్పటికప్పుడు ఓటీటీ రిలీజ్ అయ్యే సినిమాల కోసం ఈగర్‌గా ఎదురుచూస్తుంటారు.
ఓటీటీలోకి తెలుగు మూవీ
ఈ మూవీ లవర్స్, ఆడియెన్స్ కోసమే అన్నట్లు ఏదో ఒక ఓటీటీలో ఏదో ఒక కొత్త సినిమా, లేదా న్యూ వెబ్ సిరీస్ దర్శనం ఇస్తూనే ఉంటాయి. ఇక ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చే తెలుగు సినిమాలపై ఏపీ, తెలంగాణ ప్రేక్షకుల్లో మంచి క్యూరియాసిటీ ఉంటుంది. ఎప్పుడు ఏ తెలుగు మూవీ వస్తుందా అని కాచుకుని కూర్చుంటారు. వారికోసం తాజాగా ఓ తెలుగు సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.
సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్
ఇవాళ (ఆగస్ట్ 22) ఓటీటీలోకి తెలుగు సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన విరాజీ మూవీ వచ్చేసింది. క్లాసిక్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన హ్యాపీడేస్ మూవీతో హీరోగా పరిచయమైన వరుణ్ సందేశ్ చాలా గ్యాప్ తర్వాత వరుసగా సినిమాలు చేస్తున్నాడు. అలా ఇటీవల వరుణ్ సందేష్ నటించిన థ్రిల్లర్ సినిమానే విరాజీ.
కంటెంట్ బాగుందని
విరాజీ సినిమాకు ఆద్యంత్ హర్ష దర్శకత్వ వహించగా.. మూవీని మహా మూవీస్, ఎమ్ 3 మీడియా పతాకంపై మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మించారు. ఆగస్ట్ 2న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చింది. కంటెంట్ బాగుందనే ప్రశంసలు వచ్చాయి. అయితే, బాక్సాఫీస్ వద్ద మాత్రం కమర్షియల్‌గా సక్సెస్ అందుకోలేకపోయింది ఈ మూవీ.
వరుణ్ సందేశ్ డిఫరెంట్ లుక్
విరాజీ సినిమాలో వరుణ్ సందేశ్ లుక్ డిఫరెంట్‌గా ఉంది. రెండు డిఫరెంట్ కలర్స్‌లో వెరైటీ హెయిర్ స్టైల్, ముక్కు పుడక, టాటూస్‌తో కొత్త మేకోవర్‌లో వరుణ్ సందేశ్ కనిపించాడు. అయితే, ఈ లుక్‌పై మొదట్లో ట్రోలింగ్ వచ్చింది. కానీ, ఆ లుక్ ఎందుకనేది సినిమా చూస్తేనే తెలుస్తుందని, తర్వాత ఆడియెన్స్ కూడా ఆ లుక్ ఫాలో అవుతారని వరుణ్ సందేశ్ చాలా ధీమాగా చెప్పాడు.
అర్థరాత్రి నుంచే ఓటీటీ స్ట్రీమింగ్
ఇదిలా ఉంటే, థియేటర్‌లో పర్వాలేదనిపించుకున్న విరాజీ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ తెలుగు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఆహాలో గురువారం నాడు విరాజీ ఓటీటీ రిలీజ్ అయింది. ఆగస్ట్ 22 అర్థరాత్రి నుంచే ఆహా ఓటీటీలో తెలుగులో విరాజీ ప్రసారం అవుతుంది. ఈ విషయాన్ని ఆహా టీమ్ కూడా సోషల్ మీడియా ద్వారా తెలిపింది.
20 రోజుల్లోనే డిజిటల్ ప్రీమియర్
థియేటర్లలో విడుదలైన కేవలం 20 రోజుల్లోనే విరాజీ ఓటీటీలోకి రావడం విశేషంగా మారింది. కాబట్టి, థియేటర్లలో మిస్ అయినవాళ్లు ఈ చిత్రాన్ని ఎంచక్కా ఓటీటీలో చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. కాగా హ్యాపీడేస్‌తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న వరుణ్ సందేశ్ కొత్త బంగారు లోకం, కుర్రాడు సినిమాలతో హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత వరుణ్ సందేశ్‌కు చెప్పుకోదగ్గ హిట్ పడలేదు.