Action Comedy OTT: ఓటీటీలోకి సన్నీలియోన్ కోలీవుడ్ యాక్షన్ కామెడీ మూవీ - తెలుగులోనూ స్ట్రీమింగ్
Action Comedy OTT: ప్రభుదేవా హీరోగా నటించిన తమిళ మూవీ పేట్టా రాప్ ఓటీటీలోకి వస్తోంది. ఈ వీక్‌లోనే అమెజాన్ ప్రైమ్‌లో పేట్టా రాప్ మూవీ రిలీజ్ కానుంది. వేదిక హీరోయిన్‌గా నటించిన ఈ యాక్షన్ కామెడీ మూవీలో సన్నీలియోన్ ఓ కీలక పాత్ర చేసింది.
Action Comedy OTT: ప్రభుదేవా హీరోగా నటించిన తమిళ్ మూవీ పేట్టా రాప్ థియేటర్లలో నెగెటివ్ టాక్‌ను సొంతం చేసుకున్నది. సెప్టెంబర్ నెలాఖరున థియేటర్లలో రిలీజైన ఈ యాక్షన్ కామెడీ మూవీలో వేదిక హీరోయిన్‌గా నటించగా...బాలీవుడ్ శృంగార తార సన్నీలియోన్ ఓ కీలక పాత్ర పోషించింది. పేట్టా రాప్ మూవీకి ఎస్‌జే సిను దర్శకత్వం వహించాడు.
అమెజాన్ ప్రైమ్‌లో...
పేట్టా రాప్ మూవీ థియేటర్లలో విడుదలైన నెలన్నర తర్వాత ఓటీటీలోకి వస్తోంది. ఈ యాక్షన్ కామెడీ మూవీ ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్నది. పేట్టా రాప్ మూవీ నవంబర్ 8న ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం. తమిళంతో పాటు తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు చెబుతోన్నారు.
ఔట్‌డేటెడ్ కాన్సెప్ట్...
టీజర్స్, ట్రైలర్స్‌తో అంచనాలు రేకెత్తించిన పేట్టా రాప్ మూవీ ఔట్ డేటెడ్ కాన్సెప్ట్ కారణంగా థియేటర్లలో డిజాస్టర్‌గా నిలిచింది. ప్రభుదేవా, వేదిక యాక్టింగ్, సాంగ్స్ ఆకట్టుకున్న కథతో పాటు డైరెక్టర్ టేకింగ్‌పై విమర్శలొచ్చాయి. ప్రభుదేవా సూపర్ హిట్ మూవీ ప్రేమికుడు మూవీలోని పేట్టా రాప్ పాట స్ఫూర్తితోనే ఈసినిమాకు టైటిల్‌ను ఫిక్స్‌చేశారు. పేట్టా రాప్ సినిమాకు ఇమాన్ మ్యూజిక్ అందించాడు.
పేట్టా రాప్ కథ ఇదే...
బాలసుబ్రహ్మణ్యం అలియాస్ బాల (ప్రభుదేవా) సినిమా యాక్టర్ కావాలని కలలు కంటాడు. వందకుపైగా ఆడిషన్స్ అటెండ్ అయినా అతడికి ఒక్క అవకాశం రాదు. స్నేహితులతో పాటు కుటుంబసభ్యులు సూటిపోటి మాటలు సహించలేక ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటాడు.
అనుకోకుండా జానకి (వేదిక) అనే సింగర్ ద్వారా అతడి జీవితం అనుకోని మలుపులు తిరుగుతుంది. బాల, జానకి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? తమ కలల్ని నెరవేర్చుకోవడానికి బాల, జానకి కలిసి ఏం చేశారు? ఈ జర్నీలో వారికి అండగా నిలిచింది ఎవరు అన్నదే పేట్టా రాప్ మూవీ కథ.
యాక్టర్‌గా బిజీ...
కొంతకాలంగా కొరియోగ్రఫీ, డైరెక్షన్‌కు దూరంగా ఉంటోన్న ప్రభుదేవా యాక్టర్‌గా బిజీ అయ్యాడు. ఈ ఏడాది దళపతి విజయ్ ది గోట్, శివరాజ్‌కుమార్ కన్నడ మూవీ కరటకదమనకలో కీలక పాత్రలు చేశాడు ప్రభుదేవా.
ప్రస్తుతం తమిళ, మలయాళ భాషల్లో ఆరు సినిమాలు చేస్తోన్నాడు. డైరెక్టర్‌గా తెలుగులో నువ్వోస్తానంటే నేనొద్దంటానా, పౌర్ణమి, శంకర్ దాదా జిందాబాద్‌తో పాటు మరికొన్ని సినిమాలు చేశాడు. హిందీలో డైరెక్టర్‌గా అక్షయ్ కుమార్‌తో రౌడీ రాథోడ్, సింగ్ ఈజ్ బ్లింగ్, సల్మాన్ ఖాన్‌తో దబాంగ్ 3, రాధే తో పాటు మరికొన్ని సినిమాలు చేశాడు ప్రభుదేవా.