Thriler OTT: సినిమా మొత్తం ఒకే మినీ బోట్‌లో - ఓటీటీలోకి దేవ‌ర విల‌న్ మ‌ల‌యాళం మర్డర్ మిస్టరీ మూవీ-shine tom chacko malayalam murder mystery thriller movie adithattu to stream on amazon prime ott on this date ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Thriler Ott: సినిమా మొత్తం ఒకే మినీ బోట్‌లో - ఓటీటీలోకి దేవ‌ర విల‌న్ మ‌ల‌యాళం మర్డర్ మిస్టరీ మూవీ

Thriler OTT: సినిమా మొత్తం ఒకే మినీ బోట్‌లో - ఓటీటీలోకి దేవ‌ర విల‌న్ మ‌ల‌యాళం మర్డర్ మిస్టరీ మూవీ

Nelki Naresh Kumar HT Telugu
Oct 27, 2024 05:37 PM IST

Thriler OTT: దేవ‌ర్ విల‌న్ షైన్ టామ్ చాకో ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించి ఎక్స్‌పీరిమెంట‌ల్ మ‌ల‌యాళం మూవీ ఆధిథ‌ట్టు థియేట‌ర్ల‌లో రిలీజైన రెండేళ్ల త‌ర్వాత ఓటీటీలో రిలీజ్ అవుతోంది. ఈ మ‌ల‌యాళం స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ మూవీ న‌వంబ‌ర్ ఫ‌స్ట్ వీక్ నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది.

థ్రిల్లర్ ఓటీటీ
థ్రిల్లర్ ఓటీటీ

Thriler OTT: దేవ‌ర ఫేమ్ షైన్ టామ్ చాకో ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన మ‌ల‌యాళం మూవీ ఆదిథ‌ట్టు థియేట‌ర్ల‌లో రిలీజైన రెండేళ్ల త‌ర్వాత ఓటీటీలోకి వ‌స్తోంది. యాక్ష‌న్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో ప్ర‌యోగాత్మ‌కంగా తెర‌కెక్కిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో న‌వంబ‌ర్ ఫ‌స్ట్‌వీక్ నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. న‌వంబ‌ర్ 8న మ‌ల‌యాళంతో పాటు తెలుగు, త‌మిళం, క‌న్న‌డ భాష‌ల్లో ఈ మూవీ రిలీజ్ కానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఒకే బోట్‌లో..

ఆదిథ‌ట్టు మూవీలో షైన్ టామ్ చాకోతో పాటు స‌న్నీవేన్‌, అలెగ్గాండ‌ర్ ప్ర‌శాంత్‌, జ‌య‌ప‌ళ‌న్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. ఈ సినిమా క‌థ మొత్తం కేవ‌లం ఏడు పాత్ర‌ల నేప‌థ్యంలో ఒకే మినీ బోట్‌లో సాగుతుంది.

అనేక అవార్డులు...

2022లో థియేట‌ర్ల‌లో రిలీజైన ఆదిథ‌ట్టు మూవీ బెస్ట్ ఎక్స్‌పీరిమెంట‌ల్ మూవీగా ప్ర‌శంస‌ల‌తో పాటు అవార్డుల‌ను అందుకున్న‌ది. కేర‌ళ స్టేట్ ఫిల్మ్స్ అవార్డులో సెకండ్ బెస్ట్ మూవీగా నిలిచింది. ఈ థ్రిల్ల‌ర్ మూవీ నిడివి గంట‌న్న‌ర మాత్ర‌మే కావ‌డం గ‌మ‌నార్హం. కోటి రూపాయ‌ల లోపేబ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ మూవీ ఐదు కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకున్న‌ట్లు స‌మాచారం.

హంత‌కుడు ఎవ‌రు?

ఆంబ్రోస్ (షైన్ టామ్ చాకో), మార్కోస్ (స‌న్నీవేన్‌) మ‌త్స్య‌కారులు. స‌ముద్రంపై చేప‌ల వేట‌కు వెళ్తూ జీవ‌నం సాగిస్తుంటారు. మ‌రో ఐదుగురు స్నేహితుల‌తో క‌లిసి ఆంబ్రోస్‌, మార్కోస్ చేప‌ట వేట‌కు స‌ముద్రంపైకి వెళ‌తారు. అనుకోకుండా ఆ బోట్‌లోని ఓ వ్య‌క్తి చ‌నిపోతాడు. త‌మ‌లోనే ఒక‌రు ఆ వ్య‌క్తిని చంపార‌ని ఒక‌రిపై మ‌రొక‌రు అనుమాన‌ప‌డ‌తాడు.

ఆ అనుమానాలు ఎలాంటి గొడ‌వ‌ల‌కు దారితీశాయి? ఆ బోట్ జ‌ర్నీ ఎలా సాగింది? అస‌లైన హంత‌కుడు ఎవ‌రు అన్న‌దే ఆదిథ‌ట్టు మూవీ క‌థ‌. ఆదిథ‌ట్టు మూవీకి జిజో ఆంటోనీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ప‌లు నేష‌న‌ల్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్స్‌లో ఆదిథ‌ట్టు మూవీ స్క్రీనింగ్ అయ్యింది.

ప‌ది సినిమాలు...

మ‌ల‌యాళంలో విల‌న్‌గా, క్యారెక్ట‌ర్‌గా ఆర్టిస్ట్ ప‌లు సినిమాలు చేస్తోన్నాడు షైన్ టామ్ చాకో. ఈ ఏడాది ప‌ది నెల‌ల గ్యాప్‌లోనే షైన్ టామ్ చాకో ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ప‌ది మ‌ల‌యాళ సినిమాలు ప్రేక్ష‌క‌లు ముందుకొచ్చాయి. న‌డిగ‌ర్‌, వివేక‌నంద‌న్ విరాలాను, థాంక‌మ‌ని, లిటిల్ హార్ట్స్‌తో పాటు మిగిలిన సినిమాల్లో విభిన్న‌మైన క్యారెక్ట‌ర్స్‌చేశాడు.

దేవ‌ర‌లో నెగెటివ్ క్యారెక్ట‌ర్‌...

నాని ద‌స‌రా మూవీతో విల‌న్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు షైన్ టామ్ చాకో. ఇటీవ‌ల రిలీజైన ఎన్టీఆర్ దేవ‌ర మూవీలో కోరా అనే నెగెటివ్ షేడ్స్ క్యారెక్ట‌ర్‌లో షైన్ టామ్ చాకో క‌నిపించాడు.

Whats_app_banner