Salaar Trailer Views: యూట్యూబ్‍లో సలార్ సునామీ.. అప్పుడే 100 మిలియన్ మార్క్.. తెలుగు కంటే హిందీలో అత్యధికంగా..
Salaar Trailer Views: సలార్ మూవీ ట్రైలర్‌కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే అన్ని భాషల ట్రైలర్లకు కలిపి 100 మిలియన్ వ్యూస్ దాటాయి. ఆ వివరాలివే..
Salaar Trailer Views: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సలార్ మూవీ ట్రైలర్ నిన్న (డిసెంబర్ 1) వచ్చింది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ట్రైలర్ రిలీజ్ అయింది. యాక్షన్, ఎమోషన్‍తో సలార్ ట్రైలర్ అదిరిపోయింది. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటూ.. మూవీపై అంచనాలను మరింత పెంచేసింది. ఈ క్రమంలో యూట్యూబ్‍లో వ్యూస్ విషయంలో సలార్ ట్రైలర్ ముఖ్యమైన మార్క్ దాటింది.
సలార్ పార్ట్-1: సీజ్‍ఫైర్ మూవీ ట్రైలర్‌కు అన్ని భాషల్లో కలిపి ఇప్పటి వరకు 100 మిలియన్ల (10కోట్లు)కు పైగా వ్యూస్ దాటాయి. ఈ వంద మిలియన్ వ్యూస్ మార్కును 24 గంటలు గడవకముందే ట్రైలర్ దక్కించుకుంది. సలార్ ట్రైలర్ డిసెంబర్ 1వ తేదీ సాయంత్రం 7:19 గంటలకు రాగా.. ఒక రోజు కూడా పూర్తికాక ముందు అన్ని భాషల్లో కలిపి ఈ ట్రైలర్ 100 మిలియన్ మార్కును దాటింది. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించిన హొంబాలే ఫిల్మ్స్ ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేసింది.
సలార్ ట్రైలర్‌కు తెలుగు కంటే హిందీలోనే ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి. నేటి (డిసెంబర్ 2) మధ్యాహ్నం సమయానికి సలార్ తెలుగు ట్రైలర్‌కు 29 మిలియన్ల వ్యూస్ వస్తే.. హిందీ ట్రైలర్‌కు సుమారు 49 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ జోరు కొనసాగే అవకాశం ఉంది. తమిళం, కన్నడ, మలయాళంలోనూ సలార్ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది.
సలార్: పార్ట్-1 సీజ్‍ఫైర్ మూవీ డిసెంబర్ 22వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ మూవీలో ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ స్నేహితులుగా ఉండనున్నారని ట్రైలర్లో తెలిసిపోయింది. ప్రభాస్ యాక్షన్ సీన్లు ట్రైలర్లో హైలైట్‍గా నిలిచాయి. ప్రభాస్ ఈ చిత్రంలో దేవ పాత్ర చేయగా.. వరదరాజ మన్నార్ క్యారెక్టర్ చేశారు పృథ్వీరాజ్. ఖాన్సార్ సిటీ కోసం కొన్ని గ్రూప్‍ల మధ్య జరిగే పోరాటాలే ఈ చిత్రం ప్రధాన కథగా ఉంది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మార్క్ ఈ ట్రైలర్‌లో స్పష్టంగా కనిపించింది.
సలార్ మూవీలో శృతి హాసన్ హీరోయిన్‍గా నటించగా.. ట్రైలర్‌లో ఒకచోట మాత్రమే ఆమె కనిపించారు. జగపతి బాబు, బాబి సింహా, టిన్నూ ఆనంద్, ఈశ్వరి ఆనంద్, శ్రియా రెడ్డి, రామచంద్ర రాజు కీలకపాత్రలు పోషించారు. హొంబాలే ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మించగా.. రవి బస్రూర్ సంగీతం అందించారు.
సంబంధిత కథనం
టాపిక్