Prabhas on Prashanth Neel: నేను చూసిన బెస్ట్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్: ప్రభాస్-prabhas on prashanth neel says he is the best director in his 21 years career ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Prabhas On Prashanth Neel: నేను చూసిన బెస్ట్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్: ప్రభాస్

Prabhas on Prashanth Neel: నేను చూసిన బెస్ట్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్: ప్రభాస్

Hari Prasad S HT Telugu

Prabhas on Prashanth Neel: సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పై ప్రశంసలు కురిపించాడు రెబల్ స్టార్ ప్రభాస్. తన 21 ఏళ్ల కెరీర్లో తాను చూసిన బెస్ట్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అని అతడు అనడం విశేషం.

ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ (Twitter)

Prabhas on Prashanth Neel: ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ మూవీ సలార్ రిలీజ్ ఎంతగానో ఆసక్తి రేపుతోంది. అయితే ఈ సినిమా రిలీజ్ కు ముందు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పై ప్రభాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. తాను చూసిన బెస్ట్ డైరెక్టర్ ప్రశాంత్ అని అనడంతోపాటు మూవీలో తన పాత్ర గురించి కూడా వెల్లడించాడు.

హోంబలె ఫిల్మ్స్ తెరకెక్కించిన సలార్ మూవీ డిసెంబర్ 22న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ మూవీపై ప్రభాస్ స్పందిస్తూ.. "సలార్ లో పాత్ర మధ్య లోతైన భావోద్వేగాలను చూస్తారు. నన్ను ఇలాంటి పాత్రలో తొలిసారి మీరు చూడబోతున్నారు" అని అన్నాడు. ఇక డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో కలిసి పని చేసిన అనుభవాన్ని కూడా పంచుకున్నాడు.

"నా 21 ఏళ్ల కెరీర్లో ఇతడే బెస్ట్ డైరెక్టర్. షూటింగ్ కోసం అతడు ఎప్పుడు కాల్ చేస్తాడా అని ఎదురు చూశాను. సెట్ లోకి వెళ్లి నటించడం కంటే కూడా ప్రశాంత్ తో కాస్త సమయం గడపాలని నేను భావించాను. మూవీ గురించి చెప్పగానే నా మనసులో వచ్చిన తొలి ఆలోచన ఇదే. గత 21 ఏళ్లలో నేనెప్పుడూ ఇలాంటి అనుభూతి చెందలేదు. 6 నెలలు నేను ఆ బాధ అనుభవించాను. షూటింగ్ మొదలైన నెల రోజుల్లోనే మేము క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాము" అని ప్రభాస్ చెప్పాడు.

ఇక ఈ మూవీలో తన పాత్రపై ప్రశాంత్ తో కలిసి చేసిన వర్క్‌షాప్స్ కూడా అతడు స్పందించాడు. "ప్రశాంత్, నేను కలిసి పని చేస్తున్నప్పుడు నాకు అనిపించింది నేను చెప్పాను. నేనేం చేయాలో అతడు చెప్పాడు. సినిమా కోసం కాస్త బాడీ లాంగ్వేజ్ అవసరమని నేను అన్నాను. అతనికి కూడా కొన్ని నచ్చాయి. ప్రతి ముఖ్యమైన సెషన్ కు ముందు మేము మాట్లాడుకునే వాళ్లం. రిలాక్స్ అయ్యే సమయంలో, సరదాగా మాట్లాడుకుంటున్న సమయంలో నా పాత్ర గురించి వర్క్‌షాప్స్ నిర్వహించేవాళ్లం" అని ప్రభాస్ అన్నాడు.

సలార్ పార్ట్ 1: సీజ్‌ఫైర్ మూవీ డిసెంబర్ 22న రిలీజ్ కాబోతోంది. 2 గంటల 55 నిమిషాల నిడివితో ఉన్న ఈ సినిమాకు ఎ సర్టిఫికెట్ వచ్చింది. హింస కాస్త ఎక్కువగా ఉండటంతో మూవీకి సెన్సార్ బోర్డు ఎ సర్టిఫికెట్ ఇచ్చింది.