Mangalavaram OTT: అప్పుడే ఓటీటీలోకి మంగళవారం మూవీ.. మైండ్ బ్లాక్ ధరకు డిజిటల్ రైట్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?-payal rajput mangalavaram movie ott streaming likely to release in aha ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mangalavaram Ott: అప్పుడే ఓటీటీలోకి మంగళవారం మూవీ.. మైండ్ బ్లాక్ ధరకు డిజిటల్ రైట్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Mangalavaram OTT: అప్పుడే ఓటీటీలోకి మంగళవారం మూవీ.. మైండ్ బ్లాక్ ధరకు డిజిటల్ రైట్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Sanjiv Kumar HT Telugu
Nov 17, 2023 10:36 AM IST

Payal Rajput Mangalavaram OTT Release: హాట్ బ్యూటి పాయల్ రాజ్‌పుత్ నటించిన మరో బోల్డ్ మూవీ మంగళవారం. నేడు రిలీజ్ అయిన అజయ్ భూపతి తెరకెక్కించిన మంగళవారం మూవీ ఓటీటీ విడుదల తేది, స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ ఆసక్తిగా మారాయి.

ఓటీటీలోకి పాయల్ రాజ్‌పుత్ మంగళవారం మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీలోకి పాయల్ రాజ్‌పుత్ మంగళవారం మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Mangalavaram OTT Streaming: బోల్డ్ బ్యూటి పాయల్ రాజ్‌పుత్ మరోసారి తన హాట్‌నెస్‌తో అలరించేందుకు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా మంగళవారం. 'ఆర్ఎక్స్ 100', 'మహాసముద్రం' చిత్రాల తర్వాత అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఈ మూవీలో పాయల్ రాజ్‌పుత్‌తోపాటు 'రంగం' ఫేమ్ అజ్మల్ అమీర్, నందిత శ్వేత, దివ్య పిళ్లై, రవీంద్ర విజయ్, అజయ్ ఘోష్, శ్రీ తేజ్, శ్రవణ్ రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషించారు.

అంచనాలు పెంచేలా

మంగళవారం చిత్రానికి అజయ్ భూపతి 'A' క్రియేటివ్ వర్క్స్ నిర్మాణ సంస్థ భాగస్వామి కాగా ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ నిర్మించారు. ట్రైలర్, పోస్టర్లతో అంచనాలు పెరిగిన మంగళవారం మూవీ ఇవాళ అంటే నవంబర్ 17న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.

ఆకట్టుకునేలా బోల్డ్ సీన్స్

మంగళవారం సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది. మిక్స్ డ్ జోనర్‌లో తెరకెక్కిన మంగళవారం సినిమాలో హారర్, సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలు ఉన్నాయని రివ్యూలు చెబుతున్నాయి. ముఖ్యంగా యూత్‌కు మంగళవారం మూవీ నచ్చేలా ఉందని అంటున్నారు. బోల్డ్ సీన్స్ ఆకట్టునేలా ఉన్నాయట. ఇదిలా ఉంటే శుక్రవారం విడుదలైన మంగళవారం మూవీ ఓటీటీ స్ట్రీమింగ్, డీల్ ఆసక్తిగా మారాయి.

ఆహాలో అప్పుడే స్ట్రీమింగ్

మంగళవారం సినిమాను ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహా సొంతం చేసుకుందని సమాచారం. అందుకోసం మైండ్ బ్లాక్ అయ్యే విధంగా ధర వెచ్చించినట్లు టాక్ వస్తోంది. ఇక మంగళవారం సినిమాను ఓటీటీలోకి థియేట్రికల్ రిలీజ్ తర్వాత 40 రోజులకు, లేదా డిసెంబర్ రెండో వారంలో తీసుకురానున్నారని సమాచారం. ఒకవేళ కలెక్షన్స్ బట్టి మంగళవారం ఓటీటీ రిలీజ్ డేట్‌లో మార్పులు జరిగే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

Whats_app_banner