OTT Movie: మరో ఓటీటీలోకి అడుగుపెట్టిన పాయల్ రాజ్‍పుత్ బోల్డ్ థ్రిల్లర్ మూవీ.. వివరాలివే-payal rajput bold mystery thriller movie mangalavaaram now streaming on jiocinema ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Movie: మరో ఓటీటీలోకి అడుగుపెట్టిన పాయల్ రాజ్‍పుత్ బోల్డ్ థ్రిల్లర్ మూవీ.. వివరాలివే

OTT Movie: మరో ఓటీటీలోకి అడుగుపెట్టిన పాయల్ రాజ్‍పుత్ బోల్డ్ థ్రిల్లర్ మూవీ.. వివరాలివే

Chatakonda Krishna Prakash HT Telugu
Oct 13, 2024 04:31 PM IST

OTT Mystery Thriller: మంగళవారం చిత్రం మరో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేసింది. పాయల్ రాజ్‍పుత్ ప్రధాన పాత్ర పోషించిన ఈ థ్రిల్లర్ మూవీ ఇంకో భాషలో అందుబాటులోకి వచ్చేసింది. ఆ వివరాలు ఇవే..

OTT Mystery Thriller: మరో ఓటీటీలోకి అడుగుపెట్టిన పాయల్ రాజ్‍పుత్ బోల్డ్ థ్రిల్లర్ మూవీ.. వివరాలివే
OTT Mystery Thriller: మరో ఓటీటీలోకి అడుగుపెట్టిన పాయల్ రాజ్‍పుత్ బోల్డ్ థ్రిల్లర్ మూవీ.. వివరాలివే

హీరోయిన్ పాయల్ రాజ్‍పుత్ లీడ్ రోల్ చేసిన మంగళవారం చిత్రం థియేటర్లలో మంచి హిట్ అయింది. ఈ బోల్డ్ మిస్టరీ థ్రిల్లర్ మూవీకి ఆర్ఎక్స్100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహించారు. గతేడాది సెప్టెంబర్‌లో ఈ తెలుగు చిత్రం విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయింది. ఈ మూవీ గతేడాది డిసెంబర్‌లోనే ఓటీటీలోకి ఐదు భాషల్లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. అయితే, ఇప్పుడు తాజాగా మరో భాషలో ఇంకో ఓటీటీలోకి మంగళవారం మూవీ అడుగుపెట్టింది.

స్ట్రీమింగ్ ఎక్కడ..

మంగళవారం సినిమా జియోసినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో హిందీ డబ్బింగ్‍లో నేడు (అక్టోబర్ 13) స్ట్రీమింగ్‍కు వచ్చింది. సుమారు 11 నెలల తర్వాత హిందీ వెర్షన్ అందుబాటులోకి వచ్చింది.

మంగళవారం సినిమా తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో గతేడాది డిసెంబర్ 26నే స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఓటీటీలోనూ భారీ వ్యూస్ దక్కించుకుంది. కొన్ని వారాలు టాప్‍లో ట్రెండ్ అయింది. థియేటర్ల తర్వాత ఓటీటీలోనూ సక్సెస్ సాధించింది. ఇప్పుడు, ఈ మూవీ హిందీ వెర్షన్ జియోసినిమా ఓటీటీలో అడుగుపెట్టింది.

మంగళవారం సినిమాతో పాయల్ - డైరెక్టర్ అజయ్ భూపతి కాంబో రిపీట్ అయింది. అంతకు ముందు ఈ ఇద్దరి కాంబో రూపొందిన ఆర్ఎక్స్100 సెన్సేషనల్ హిట్ అయింది. మంగళవారం కూడా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించింది.

మంగళవారం చిత్రంలో పాయల్ రాజ్‍పుత్‍తో పాటు అజ్మల్ అమీర్, నందిత శ్వేత, రవీంద్ర విజయ్, దివ్య పిళ్లై, అజయ్ ఘోష్, కృష్ణ చైతన్య కీలకపాత్రలు పోషించారు. పాయల్ ఈ మూవీలో బోల్డ్ క్యారెక్టర్ చేశారు. ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి.

కలెక్షన్లు

మంగళవారం చిత్రం సుమారు రూ.23కోట్ల కలెక్షన్లను దక్కించుకుంది. 2023 నవంబర్ 17వ తేదీన ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ అయింది. పోస్టర్ల నుంచి ట్రైలర్ వరకు ఈమూవీ నుంచి వచ్చిన కంటెంట్ అంచనాలను బాగా పెంచింది. అందుకు తగ్గట్టే మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో అనుకున్న రేంజ్‍లో కలెక్షన్లను దక్కించుకుంది.

మంగళవారం చిత్రాన్ని ముద్రా మీడియా వర్క్స్, ఎ క్రియేటివ్ వర్క్ బ్యానర్లపై స్వాతి రెడ్డి గణుపాటి, సురేశ్ వర్మ, అజయ్ భూపతి నిర్మించారు. ఈ మూవీకి అజ్నిష్ లోకనాథ్ సంగీతం అందించారు. ఈ చిత్రానికి బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ బలంగా నిలిచింది. బీజీఎంలు బాగా పాపులర్ అయ్యాయి.

మంగళవారం స్టోరీలైన్

మహాలక్ష్మిపురం గ్రామంలో మంగళవారం మూవీ స్టోరీ సాగుతుంది. ఆ ఊరిలో ప్రతీ మంగళవారం మరణాలు సంభవిస్తుంటాయి. అక్రమ సంబంధాల విషయం గోడపై ఎవరో రాస్తున్నందుకే అందుకు సంబంధించిన వారు ఆత్మహత్య చేసుకుంటున్నారని గ్రామస్తులు నమ్ముతారు. కానీ ఎస్‍ఐ మాయ (నందిత శ్వేత) అవి హత్యలేనని గట్టిగా చెబుతారు. ఈ చావులకు కారణమేంటి? అవి హత్యలా.. ఆత్మహత్యలా? ఇందులో శైలు (పాయల్ రాజ్‍పుత్) పాత్ర ఏంటి? గోడలపై అక్రమ సంబంధాల గురించి రాస్తున్నదెవరు? అనే విషయాలను చుట్టూ ఈ మూవీ సాగుతుంది. మంగళవారం చిత్రంలో నరేషన్ కూడా ఆకట్టుకుంటుంది. మూవీ గ్రిప్పింగ్‍గా సాగుతుంది.

Whats_app_banner