Shashi Madhanam Web Series: స్ట్రీమింగ్‌కు సిద్ధ‌మైన తెలుగు రొమాంటిక్‌ వెబ్‌సిరీస్ శ‌శిమ‌థ‌నం - రిలీజ్ ఎప్పుడంటే?-pavan sidhu soniya singh sashimadhanam telugu web series streaming on etv win ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Shashi Madhanam Web Series: స్ట్రీమింగ్‌కు సిద్ధ‌మైన తెలుగు రొమాంటిక్‌ వెబ్‌సిరీస్ శ‌శిమ‌థ‌నం - రిలీజ్ ఎప్పుడంటే?

Shashi Madhanam Web Series: స్ట్రీమింగ్‌కు సిద్ధ‌మైన తెలుగు రొమాంటిక్‌ వెబ్‌సిరీస్ శ‌శిమ‌థ‌నం - రిలీజ్ ఎప్పుడంటే?

Nelki Naresh Kumar HT Telugu
Apr 10, 2024 12:32 PM IST

Shashi Madhanam Web Series: షార్ట్ ఫిలిమ్స్‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు చేరువైన‌ ప‌వ‌న్ సిద్ధు, సోనియా సింగ్ శ‌శిమ‌థ‌నం పేరుతో ఓ వెబ్‌సిరీస్ చేస్తున్నారు. ఈ రొమాంటిక్ డ్రామా సిరీస్ ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది.

శ‌శిమ‌థ‌నం వెబ్‌సిరీస్
శ‌శిమ‌థ‌నం వెబ్‌సిరీస్

రొమాంటిక్ ల‌వ్ డ్రామా క‌థాంశంతో రూపొందిన తెలుగు వెబ్ సిరీస్ శ‌శిమ‌థ‌నం స్ట్రీమింగ్‌కు సిద్ధ‌మైంది. ఈటీవీ విన్ ద్వారా ఈ వెబ్‌సిరీస్ ఓటీటీ ఆడియెన్స్ ముందుకు రాబోతోఉంది. శ‌శిమ‌థ‌నం వెబ్‌సిరీస్ ఫ‌స్ట్ లుక్‌ను ఈటీవీ విన్ ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసింది. శ‌శిమ‌థ‌నం సిరీస్‌లో ప‌వ‌న్ సిద్ధు, సోనియా సింగ్ జంట‌గా న‌టిస్తున్నారు.

ఫ‌స్ట్ లుక్‌...

ఈ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌లో సిద్ధు జోవియ‌ల్‌గా క‌నిపిస్తోన్నండ‌గా , సోనియా కోపంగా ద‌ర్శ‌న‌మిచ్చింది. వారిద్ద‌రి చుట్టూ పాచిక‌లు, ప్లేకార్డ్స్‌, బాల్స్‌తో పాటు ఓ పాత కాలం రేడియా క‌నిపిస్తోంది. ఈ సిరీస్‌లో శ‌శి క్యారెక్ట‌ర్‌లో సోనియా సింగ్‌, మ‌ధ‌న్ పాత్ర‌లో ప‌వ‌న్ సిద్ధు క‌నిపించ‌బోతున్నారు. ఓ జంట మ‌ధ్య అపోహ‌లు, అల‌క‌ల‌తో ద‌ర్శ‌కుడు వినోద్ గాలి ఈ సిరీస్‌ను తెర‌కెక్కిస్తోన్నారు. ఈ స‌మ్మ‌ర్‌లోనే శ‌శిమ‌థ‌నం వెబ్‌సిరీస్ రిలీజ్ కాబోతున్న‌ట్లు ఈటీవీ విన్ ఓటీటీ తెలిపింది. సంజీత్ ఎర్ర‌మిల్లి మ్యూజిక్ అందిస్తోన్న ఈ సిరీస్‌కు రెహాన్ షేక్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు.

ప్రేమ‌లో ప‌వ‌న్‌, సోనియా...

ప‌వ‌న్ సిద్ధు, సోనియా సింగ్ ప్రేమ‌లో ఉన్న‌ట్లు చాలా కాలంగా పుకార్లు షికారు చేస్తున్నారు. ప‌వ‌న్‌ను తాను ప్రేమిస్తోన్న‌ట్లు సోష‌ల్ మీడియా ద్వారా ప‌లుమార్లు హింట్ ఇచ్చింది సోనియా సింగ్‌. ప‌వ‌న్ సిద్ధు, సోనియా సింగ్ క‌లిసి టింగ్లీష్ గ‌ర్ల్‌ఫ్రెండ్‌, డెస్టినీ డేట్‌, యూఆర్‌మై ఫేవ‌రేట్ మిస్టేక్‌, వీకెండ్ పెళ్లిచూపుల‌తో పాటు ప‌లు షార్ట్ ఫిలిమ్స్ చేశారు.ఈ షార్ట్ ఫిలిమ్స్‌తో త‌మ కెమిస్ట్రీలో అభిమానుల‌ను ఆక‌ట్టుకున్నారు ఈ జంట‌. ప‌వ‌న్ సిద్ధు, సోనియా సింగ్ లీడ్ రోల్స్‌లో న‌టించిన‌ స్టేయిర్‌కేస్ ల‌వ్‌స్టోరీ షార్ట్‌ఫిలిమ్ యూట్యూబ్‌లో మిలియ‌న్‌కుపైగా వ్యూస్‌ను సొంతం చేసుకున్న‌ది

డ‌బుల్ మీనింగ్ డైలాగ్స్‌...

. షార్ట్ ఫిలిమ్స్‌తో పాటు ఓయ్ ప‌ద్మావ‌తి, పెళ్లైనా కొత్త‌లో, రౌడీబేబీ సిరీస్‌లు చేసింది సోనియా సింగ్‌. ఈ సిరీస్‌లు, షార్ట్ ఫిలిమ్స్‌లో రొమాన్స్ మేళ‌వించి డ‌బుల్ మీనింగ్‌తో సోనియా సింగ్ చెప్పిన డైలాగ్స్ పాపుల‌ర‌య్యాయి.

విరూపాక్ష‌...

య‌మ‌లీల సీరియ‌ల్‌తో సోనియా సింగ్ యాక్టింగ్ కెరీర్ ఆరంభ‌మైంది. గ‌త ఏడాది బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచిన సాయిధ‌ర‌మ్‌తేజ్ విరూపాక్ష‌లో సోనియా సింగ్ ఓ కీల‌క పాత్ర పోషించింది. తొలి అడుగులోనే ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖుల దృష్టిని ఆక‌ర్షించింది. ప్ర‌స్తుతం తెలుగులో ఓ నాలుగు చిన్న సినిమాల్లో సోనియా సింగ్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

సామ‌జ‌వ‌ర‌గ‌మ‌నా...

ప‌వ‌న్ సిద్ధు కూడా షార్ట్‌ఫిలిమ్స్‌తో పాటు సామ‌జ‌వ‌ర‌గ‌మ‌నా పేరుతో ఓ వెబ్‌సిరీస్ చేశాడు. ఆహా ఓటీటీలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. రాజుగారి కిడ్నాప్‌, అయ్యేరామా సినిమాల్లో హీరోగా న‌టించాడు.

టాపిక్