Recent OTT Releases: ఈనెల 16 రోజుల్లో ఓటీటీల్లోకి వచ్చిన 10 ముఖ్యమైన సినిమాలు ఇవే-ott top 10 releases in april first two weeks om bheem bush premalu to amar singh chamkila dune part two ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Recent Ott Releases: ఈనెల 16 రోజుల్లో ఓటీటీల్లోకి వచ్చిన 10 ముఖ్యమైన సినిమాలు ఇవే

Recent OTT Releases: ఈనెల 16 రోజుల్లో ఓటీటీల్లోకి వచ్చిన 10 ముఖ్యమైన సినిమాలు ఇవే

Chatakonda Krishna Prakash HT Telugu
Apr 16, 2024 02:31 PM IST

OTT Top 10 Recent Releases: ఈనెల ఇప్పటి వరకు ఓటీటీల్లోకి చాలా పాపులర్ సినిమాలు వచ్చాయి. థియేటర్లలో రిలీజైన కొన్ని బ్లాక్ బస్టర్లతో పాటు మరికొన్ని నేరుగా ఓటీటీల్లోకే వచ్చాయి. ఈ నెల 16 రోజుల్లో వచ్చిన సినిమాల్లో టాప్-10 ఏవో ఇక్కడ చూడండి.

OTT Top 10 Recent Releases: ఈనెల 16 రోజుల్లో ఓటీటీల్లోకి వచ్చిన 10 ముఖ్యమైన సినిమాలు ఇవే
OTT Top 10 Recent Releases: ఈనెల 16 రోజుల్లో ఓటీటీల్లోకి వచ్చిన 10 ముఖ్యమైన సినిమాలు ఇవే

OTT Recent Releases: ఏప్రిల్ నెలలో ఓటీటీ ప్రేక్షకులకు పండుగలా ఉంది. ఈనెల తొలి రెండు వారాల్లోనే చాలా సినిమాలు స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టాయి. థియేటర్లలో బ్లాక్ బస్టర్ అయిన కొన్ని చిత్రాలు ఓటీటీల్లోకి అందుబాటులోకి వచ్చాయి. నేరుగా ఓటీటీలోకి వచ్చిన సినిమాలు కూడా ఉన్నాయి. అలా.. ఈ ఏప్రిల్ నెలలో తొలి 16 రోజుల్లో ఓటీటీల్లో స్ట్రీమింగ్‍కు వచ్చిన టాప్-10 సినిమాలు ఏవో ఇక్కడ చూడండి.

ప్రేమలు

మలయాళ సూపర్ హిట్ సినిమా ప్రేమలు చిత్రం ఈనెలలోనే ఓటీటీల్లోకి వచ్చింది. ఈ మూవీ తెలుగు వెర్షన్ ఆహా ఓటీటీలోకి ఏప్రిల్ 12న స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. మలయాళం, తమిళం, కన్నడ వెర్షన్లు డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. గిరీశ్ ఏడీ దర్శకత్వం వహించిన ఈ లవ్ కామెడీ ప్రేమలు మూవీలో నస్లెన్ కే గఫూర్, మమితా బైజూ హీరోహీరోయిన్లుగా నటించారు.

అమర్ సింగ్ చమ్కీలా

అమర్ సింగ్ చమ్కీలా చిత్రం నేరుగా నె‍ట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఏప్రిల్ 12న స్ట్రీమింగ్‍కు వచ్చింది. పంజాబీ సింగర్ అమర్ సింగ్ చమ్కీలా జీవితం ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు దర్శకుడు ఇంతియాజ్ అలీ. ఈ చిత్రంలో దిల్జీజ్ దోసంజ్, పరిణితీ చోప్రా ప్రధాన పాత్రలు పోషించారు.

తంత్ర

తెలుగు హారర్ మూవీ తంత్ర చిత్రం ఏప్రిల్ 5వ తేదీన ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. థియేటర్లలో రిలీజైన 20 రోజులకే ఓటీటీలోకి వచ్చింది. ఈ హారర్ చిత్రానికి శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వం వహించగా.. ధనుష్ రాఘవమూడి, అనన్య నాగళ్ల మెయిన్ రోల్స్ చేశారు.

ఓం భీమ్ బుష్

శ్రీవిష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రలు పోషించిన హారర్ కామెడీ చిత్రం ‘ఓం భీమ్ బుష్’ ఏప్రిల్ 12వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో అడుగుపెట్టింది. శ్రీహర్ష కొనుగంటి డైరెక్ట్ చేసిన ఈ చిత్రం థియేటర్లలో మంచి విజయం సాధించింది. ప్రైమ్ వీడియో ఓటీటీలోనూ ఓం భీమ్ బుష్ ప్రస్తుతం ట్రెండింగ్‍లో ఉంది.

శర్మ అండ్ అంబానీ

శర్మ అండ్ అంబానీ మూవీ ఏప్రిల్ 11వ తేదీన ఈటీవీ విన్ ఓటీటీలో నేరుగా స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ క్రైమ్ కామెడీ చిత్రాన్ని డైరెక్టర్ కార్తీక్ సాయి తెరకెక్కించగా.. భరత్ తిప్పిరెడ్డి, ధన్య బాలకృష్ణ, కేశర్ కర్రీ మెయిన్ రోల్స్ చేశారు.

గామి

యంగ్ హీరో విశ్వక్‍సేన్ ప్రధాన పాత్ర పోషించిన గామి సినిమా ఏప్రిల్ 12న జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో అడుగుపెట్టింది. తెలుగు సహా తమిళం, కన్నడలోనూ అందుబాటులోకి ఉంది. విద్యాధర్ కాగిత డైరెక్ట్ చేసిన ఈ అడ్వెంచర్ థ్రిలర్ మూవీ ఆ ఓటీటీలో నేషనల్ వైడ్‍లో ట్రెండ్ అవుతోంది. థియేటర్లలో మంచి హిట్ అయిన గామి ఓటీటీలోనూ ఆదరణ దక్కించుకుంటోంది.

లంబసింగి

బిగ్‍బాస్ ఫేమ్ దివీ, భరత్‍రాజ్ హీరోహీరోయిన్లుగా నటించిన లవ్ మూవీ లంబసింగి ఏప్రిల్ 2వ తేదీన డిస్నీ ప్లస్ హాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. థియేటర్లలో రిజైన మూడు వారాలకే ఓటీటీలో అడుగుపెట్టింది. ఈ చిత్రానికి నవీన్ గాంధీ దర్శకత్వం వహించారు.

అదృశ్యం

అదృశ్యం చిత్రం ఏప్రిల్ 4వ తేదీన ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ‘ఇని ఉత్తరం’ అనే మలయాళ చిత్రానికి తెలుగు వెర్షన్ ఇది. ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రానికి సుధీశ్ రామచంద్రన్ దర్శకత్వం వహించగా.. అపర్ణ బాలమురళి, హరీశ్ ఉత్తమన్ ప్రధాన పాత్రలు పోషించారు.

చారి 111

స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ హీరోగా నటించిన స్పై కామెడీ థ్రిల్లర్ మూవీ చారి 111 ఏప్రిల్ 5న అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. టీజీ కీర్తికుమార్ డైరెక్షన్‍‍లో తెరకెక్కిన ఈ మూవీ థియేటర్లలో పెద్దగా ఆడలేదు.

డ్యూన్ పార్ట్-2

హాలీవుడ్ బ్లాక్ బస్టర్ ఎపిక్ సైన్స్ ఫిక్షన్ ‘డ్యూన్ పార్ట్-2’ చిత్రం ఏప్రిల్ 16వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో, బుక్ మై షో ఓటీటీల్లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. అయితే, రెండు ఓటీటీల్లోనూ ప్రస్తుతం రెంటల్ విధానంలో అందుబాటులోకి వచ్చింది. డెనిస్ విల్లేనువే దర్శకత్వం వహించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లను రాబట్టింది. ఈ చిత్రంలో తిమోతీ చాల్మెట్, జెంబియా, రెబాకా ఫెర్గ్యూసన్ ప్రధాన పాత్రలు పోషించారు.

IPL_Entry_Point