OTT Telugu releases this week: ఓటీటీల్లోకి ఈ వారం రాబోతున్న టాప్ తెలుగు మూవీస్ ఇవే-ott telugu releases this week bootcut balaraju eagle ambajipeta marraige band in aha etv win zee5 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Telugu Releases This Week: ఓటీటీల్లోకి ఈ వారం రాబోతున్న టాప్ తెలుగు మూవీస్ ఇవే

OTT Telugu releases this week: ఓటీటీల్లోకి ఈ వారం రాబోతున్న టాప్ తెలుగు మూవీస్ ఇవే

Hari Prasad S HT Telugu
Feb 27, 2024 08:11 AM IST

OTT Telugu releases this week: ఈవారం ఓటీటీల్లోకి నాలుగు టాప్ తెలుగు సినిమాలు రాబోతున్నాయి. అందులో హనుమాన్, ఈగల్, అంబాజీపేట మ్యారేజీ బ్యాండులాంటి సినిమాలు ఉన్నాయి.

ఓటీటీల్లోకి ఈ వారం రాబోతున్న టాప్ తెలుగు సినిమాల్లో ఒకటి అంబాజీపేట మ్యారేజీ బ్యాండు
ఓటీటీల్లోకి ఈ వారం రాబోతున్న టాప్ తెలుగు సినిమాల్లో ఒకటి అంబాజీపేట మ్యారేజీ బ్యాండు

OTT Telugu releases this week: ఈ వారం తెలుగు ఓటీటీ ప్రేక్షకులకు పండగే. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న కొన్ని టాప్ మూవీస్ డిజిటల్ ప్రీమియర్స్ కు సిద్ధమయ్యాయి. వీటిలో హనుమాన్, ఈగల్, అంబాజీపేట మ్యారేజీ బ్యాండు, బూట్‌కట్ బాలరాజులాంటి సినిమాలు ఉన్నాయి. ఏ మూవీ ఎప్పటి నుంచి ఎందులో స్ట్రీమింగ్ కానుందో ఒకసారి చూద్దాం.

అంబాజీపేట మ్యారేజీ బ్యాండు - ఆహా ఓటీటీ (మార్చి 1)

సుహాస్ నటించిన సూపర్ హిట్ మూవీ అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు ఈ శుక్రవారం (మార్చి 1) నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఫిబ్రవరి 2న థియేటర్లలో రిలీజై సంచలన విజయం సాధించిన ఈ సినిమా.. నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను సోమవారమే (ఫిబ్రవరి 26) ఆహా రిలీజ్ చేసింది. మార్చి 1 నుంచి ఆహాలో మల్లిగాడి డప్పుల మోత అంటూ అంబాజీపేట మ్యారేజీ బ్యాండు డిజిటల్ ప్రీమియర్ డేట్ అనౌన్స్ చేసింది.

బూట్‌కట్ బాలరాజు - ఆహా ఓటీటీ (ఫిబ్రవరి 26)

బిగ్ బాస్ సోహెల్ నటించిన బూట్‌కట్ బాలరాజు మూవీ సోమవారం (ఫిబ్రవరి 26) నుంచే ఆహా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా కూడా ఫిబ్రవరి 2నే రిలీజైనా ప్రేక్షకులు ఎవరూ ఆదరించలేదు. తొలి రోజు తొలి షోకి కూడా ప్రేక్షకుల ఆదరణ కరువవడంతో సోహెల్ కంటతడి కూడా పెట్టుకున్నాడు. ఇప్పుడీ సినిమాకు కనీసం ఓటీటీలో అయినా మంచి రెస్పాన్స్ వస్తుందేమో చూడాలి.

ఈగల్ - ఈటీవీ విన్ ఓటీటీ (మార్చి 2)

మాస్ మహారాజా రవితేజ నటించిన ఈగల్ మూవీ ఫిబ్రవరి 9న థియేటర్లలో రిలీజైంది. ఇప్పుడు నెల కూడా కాకుండానే మార్చి 2 నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానుంది. కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చింది. రవితేజ నటనకు మంచి మార్కులే పడినా.. స్టోరీ ఎందుకో ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు. మంచి యాక్షన్, థ్రిల్లర్ ఎంజాయ్ చేసే వారికి ఈగల్ మూవీ నచ్చే అవకాశం ఉంది.

హనుమాన్ - జీ5 (మార్చి 2)

సంక్రాంతికి రిలీజై ప్రపంచవ్యాప్తంగా రికార్డు కలెక్షన్లు సాధించిన హనుమాన్ మూవీ ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికీ ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కానీ.. ఈ హనుమాన్ కూడా మార్చి 2 నుంచి జీ5 ఓటీటీలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. హనుమాన్ జనవరి 12న రిలీజై రూ.300 కోట్లకుపైగా వసూలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే సంక్రాంతి సినిమాలన్నీ ఓటీటీల్లోకి వచ్చేయగా.. హనుమాన్ మాత్రమే చాలా ఆలస్యమైంది.

ఈ వారం ఓటీటీల్లోకి రాబోతున్న ఈ నాలుగు తెలుగు సినిమాలూ మంచి క్రేజ్ ఉన్నవే. ముఖ్యంగా అంబాజీపేట మ్యారేజీ బ్యాండు, ఈగల్, హనుమాన్ లాంటి సినిమాల కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ లెక్కన ఈ వీకెండ్ తెలుగు ప్రేక్షకులకు పండగే అని చెప్పాలి.

Whats_app_banner