OTT Release: ఓటీటీలో ఈ వారం చూడాల్సిన 5 సినిమాలు.. హింసాత్మకత నుంచి రొమాన్స్ వరకు.. వీకెండ్‌కు బెస్ట్ ఆప్షన్!
OTT Release This Week: ఈవారంలో ఎన్నో సినిమాలు, వెబ్ సిరీసులు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. వాటిలో ఏవి చూడాలనే కన్ఫ్యూజన్ ఆడియెన్స్‌కు ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ వీకెండ్‌కు చూడాల్సిన బెటర్ సినిమాలను సజ్జెస్ట్ చేస్తున్నాం. వాటిలో వయలెంట్ యాక్షన్ మూవీ నుంచి, రొమాంటిక్, క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ వరకు ఉన్నాయి.
Must Watch OTT Movies This Weekend: ఈ వారం ఓటీటీలో విడుదల కానున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లలో వీకెండ్‌కు చూసి ఆనందించే జాబితాను మీ ముందుకు తీసుకొస్తున్నాం. థ్రిల్లర్ నుంచి కామెడీ, యాక్షన్ వరకు ప్రతి ఒక్కరికీ ఏదో ఒక జోనర్ ఇష్టం ఉంటుంది. అలాంటి జోనర్స్‌లో ఓటీటీ ప్లాట్ ఫామ్స్‌లో రిలీజైన సినిమాలు, వెబ్ సిరీసులు ఏంటో ఓ లుక్కేద్దాం.
1) కాల్ మీ బే
లైగర్ బ్యూటి అనన్య పాండే ఓటీటీ ఎంట్రీ ఇచ్చిన వెబ్ సిరీస్ కాల్ మీ బే. కొలిన్ డి'కున్హా దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇవాళ్టి (సెప్టెంబర్ 6) నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వెబ్ సిరీస్‌లో బిలియనీర్ ఫ్యాషనిస్ట్ బే (అనన్య) తన కుటుంబం తిరస్కరించిన తరువాత గడిపే జీవితంపై కథ సాగుతుంది.
బే విలాసవంతమైన జీవనశైలిని కలిగి ఉంటుంది. కానీ, ఆమె కుటుంబం ఆమెను వదిలేయడంతో ఆమె లగ్జరీ లైఫ్‌స్టైల్ ప్రపంచం అంతా అకస్మాత్తుగా కూలిపోతుంది. దాంతో ముంబైలో తనను తాను కాపాడుకోవాల్సి వస్తోంది. ముంబైలో ట్రావెలింగ్ నుంచి ఒక జర్నలిస్ట్ డిమాండ్ చేసే లైఫ్ వరకు తాను పడే కష్టాలను వాస్తవికతకు అనుగుణంగా చూపించారు. కరణ్ జోహార్ ధర్మ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది.
2) తానావ్ 2
కబీర్ ఫారూఖీ అలియాస్ మానవ్ విజ్ ఈ థ్రిల్లింగ్ సిరీస్ సీజన్ 2 లో స్పెషల్ టాస్క్ ఫోర్స్‌తో తిరిగి వచ్చాడు. ధైర్యసాహసాలు, మోసం, దురాశ, ప్రేమ, ప్రతీకారం వంటి అంశాలను మేళవించి యాక్షన్ ప్యాక్డ్ కథనంలో ఈ వెబ్ సిరీస్ రూపుదిద్దుకుంది. ఈసారి కక్ష సాధించేందుకు పరితపించే అల్ దమిష్క్ కశ్మీర్‌కు చేరుకోవడంతో కబీర్, స్పెషల్ టాస్క్ గ్రూప్ (ఎస్టీజీ)కు కొత్త ముప్పు ఎదురవుతుంది.
ఇజ్రాయెల్‌కు చెందిన ఫౌడా సినిమాకు ఈ తానావ్ సిరీస్ అఫీషియల్ రీమేక్. శుక్రవారం (సెప్టెంబర్ 6) నుంచి సోనీ లివ్ ఓటీటీలో తానావ్ 2 స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వెబ్ సిరీసుకు సుధీర్ మిశ్రా, ఇ నివాస్ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్‌లో గౌరవ్ అరోరా, అర్బాజ్ ఖాన్, సత్యదీప్ మిశ్రా, రజత్ కపూర్, శశాంక్ అరోరా, కబీర్ బేడీ, సాహిబా బాలి, ఏక్తా కౌల్, సోనీ రజ్దాన్, సుఖ్మణి సదానా తదితరులు నటించారు.
3) ది పర్ఫెక్ట్ కపుల్
ది గ్రిప్పింగ్ న్యూ నెట్‌ఫ్లిక్స్ సిరీస్ ది పర్ఫెక్ట్ కపుల్ ప్రశంసలు పొందిన రచయిత ఎలిన్ హిల్డర్‌బ్రాండ్ రాసిన ఆరు-ఎపిసోడ్‌ల నవల ఆధారంగా తెరకెక్కించారు. బీచ్‌లో ఓ మృతదేహం లభ్యం కావడంతో అక్కడే జరిగే వివాహం గందరగోళంగా మారుతుంది. సంతోషకరమైన సందర్భాన్ని హత్య దర్యాప్తుగా మారుస్తుంది.
క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ది పర్ఫెక్ట్ కపుల్ వెబ్ సిరీస్‌లో నికోల్ కిడ్మన్, లీవ్ ష్రైబర్, ఈవ్ హ్యూసన్, ఇషాన్ ఖట్టర్ కీ రోల్ ప్లే చేశారు. బిల్లీ హౌల్, జాక్ రేనోర్, మేఘన్ ఫాహి, సామ్ నివోలా, మైఖేల్ బీచ్, డోనా లిన్ చాంప్లిన్, మియా ఐజాక్, ఇసబెల్లా అడ్జానీ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. సుసానే బియర్ దర్శకత్వం వహించిన ది పర్ఫెక్ట్ కపుల్ గురువారం (సెప్టెంబర్ 5) నెట్‌ఫ్లిక్స్‌లో ప్రపంచవ్యాప్తంగా ఓటీటీ రిలీజ్ అయింది.
4) కిల్
రాఘవ్ జుయాల్, లక్ష్య ప్రధాన పాత్రల్లో నటించిన ది మోస్ట్ వయోలెంట్ యాక్షన్ థ్రిల్లర్ కిల్ మూవీ శుక్రవారం (సెప్టెంబర్ 6) నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. నిఖిల్ నగేష్ భట్ దర్శకత్వం వహించిన కిల్ జూలై 5న థియేటర్లలో విడుదలై మంచి హిట్ అందుకుంది.
ధర్మ ప్రొడక్షన్స్, సిఖ్యా ఎంటర్టైన్మెంట్ పతాకాలపై హిరూ యశ్ జోహార్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా, గునీత్ మోంగా కపూర్, అచిన్ జైన్ నిర్మించిన కిల్ మూవీ 2023లో టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (టీఐఎఫ్ఎఫ్)లో ప్రదర్శించారు. భారతదేశంలో ఇప్పటివరకు నిర్మించని అత్యంత హింసాత్మక చిత్రం కిల్ అని మేకర్స్ అభివర్ణించారు.
5) విస్ఫోట్
ఫర్దీన్ ఖాన్, రితేష్ దేశ్ ముఖ్ నటించిన చిత్రం విస్ఫోట్ సెప్టెంబర్ 6న జియో సినిమా ఓటీటీలో విడుదలైంది. కూకీ గులాటి దర్శకత్వం వహించిన విస్ఫోట్ చిత్రాన్ని అనురాధ గుప్తా, సంజయ్ రాజ్ ప్రకాశ్ గుప్తా నిర్మించారు. ఇందులో క్రిస్టిల్ డిసౌజా కూడా నటించారు. విస్ఫోట్ మూవీ 2012లో వచ్చిన రాక్, పేపర్, సిజర్స్ అనే అంతర్జాతీయ చిత్రానికి అధికారిక రీమేక్. ఈ క్రైమ్ థ్రిల్లర్ ప్రాజెక్ట్ 2021లో సెట్స్‌పైకి వెళ్లింది.