Malayalam OTT: ఈ ఏడాది ఓటీటీలోకి వచ్చిన 20కిపైగా మలయాళ సినిమాలు.. మీరెన్ని చూశారు?-ott malayalam movies 2024 top 20 ott releases in malayalam on this year ott movies premalu ott netflix aha ott zee5 ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Malayalam Ott: ఈ ఏడాది ఓటీటీలోకి వచ్చిన 20కిపైగా మలయాళ సినిమాలు.. మీరెన్ని చూశారు?

Malayalam OTT: ఈ ఏడాది ఓటీటీలోకి వచ్చిన 20కిపైగా మలయాళ సినిమాలు.. మీరెన్ని చూశారు?

Sanjiv Kumar HT Telugu

OTT Malayalam Movies This Year: ఓటీటీలోకి ఈ సంవత్సరం 20కిపైగా మలయాళ సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో చాలా వరకు బ్లాక్ బస్టర్ సినిమాలతోపాటు క్రైమ్, సీరియల్ కిల్లర్ ఇన్వెస్టిగేషన్ జోనర్ మూవీస్ ఉన్నాయి. మరి వీటిలో మీరెన్ని చూశారో ఓ లుక్కేసి తెలుసుకోండి.

ఈ ఏడాది ఓటీటీలోకి వచ్చిన 20కిపైగా మలయాళ సినిమాలు.. మీరెన్ని చూశారు?

OTT Malayalam Movies 2024: 2024 సంవత్సరం మలయాళం సినిమాకి చాలా ముఖ్యమైనది అని చెప్పొచ్చు. ఈ ఏడాది థియేటర్లలో చాలా వరకు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచాయి. అలాగే అవి ఓటీటీలోకి విడుదలై మరింత రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, సోనీలివ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వంటి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో ఈ ఏడాది స్ట్రీమింగ్‌కు వచ్చిన 20కిపైగా మలయాళ సినిమాలు ఏంటో చూద్దాం.

ఆవేశం ఓటీటీ

మలయాళ వర్సటైల్ యాక్టర్, పుష్ప విలన్ ఫహాద్ ఫాజిల్ రీసెంట్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ఆవేశం. గ్యాంగ్‌స్టర్ యాక్షన్ కామెడీ చిత్రంగా వచ్చిన ఈ సినిమా మే 9 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో మలయాళ భాషలో స్ట్రీమింగ్ అవుతోంది.

మంజుమ్మల్ బాయ్స్ ఓటీటీ

ఈ ఏడాది మలయాళ చిత్ర పరిశ్రమలో అతిపెద్ద బ్లాక్ బస్టర్ హిట్‌లో నిలిచిన సర్వైవల్ థ్రిల్లర్ మంజుమ్మల్ బాయ్స్. 2006లోని గుణ కేవ్స్ సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో మే 5 నుంచి మలయాళంతోపాటు తెలుగు ఇతర దక్షిణాది భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

అంచక్కల్లక్కొక్కన్ (Anchakkallakokkan OTT)

కేరళ-కర్ణాటక సరిహద్దుకు సమీపంలోని ఒక విచిత్రమైన గ్రామానికి చెందిన భయస్థుడైన పోలీస్ కానిస్టేబుల్ కథాంశంతో తెరకెక్కిన సినిమా అంచక్కల్లక్కొక్కన్. ఈ సినిమా ఏప్రిల్ 19 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

ప్రేమలు ఓటీటీ

మలయాళ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిన సినిమా ప్రేమలు. దీన్ని రాజమౌళి కుమారుడు కార్తికేయ తెలుగులో విడుదల చేశారు. ఈ భారీ లవ్ రొమాంటిక్ కామెడీ సినిమా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో మలయాళం, తమిళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే ఆహా ఓటీటీలో తెలుగు భాషలో ప్రసారం అవుతోంది. ఈ రెండు ఓటీటీల్లో ప్రేమలు ఏప్రిల్ 12 నుంచి డిజిటల్ ప్రీమియర్ అవుతోంది.

వరయన్ ఓటీటీ

కలిప్పకర అనే గ్రామం చుట్టూ తిరిగే కథాంశంతో తెరకెక్కింది వరయన్. ఈ సినిమా ఏప్రిల్ 5 నుంచి మనోరమ మ్యాక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

అబ్రహం ఓజ్లర్ ఓటీటీ

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, ప్రముఖ నటుడు జయరాం ముఖ్య పాత్రల్లో నటిస్తూ మెడికల్ క్రైమ్ థ్రిల్లర్‌గా వచ్చిన సినిమా అబ్రహం ఓజ్లర్. మలయాళంలో మంచి హిట్‌గా నిలిచిన అబ్రహం ఓజ్లర్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఓటీటీలో మార్చి 20 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.

భ్రమయుగం ఓటీటీ

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి డిఫరెంట్ రోల్‌లో కనిపించిన సినిమా భ్రమయుగం. హారర్ థ్రిల్లర్ జోనర్‌లో వచ్చిన ఈ సినిమాకు మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఓటీటీలో కూడా అదరగొడుతోంది. ప్రముఖ ఓటీటీ సోనీ లివ్‌లో మార్చి 15 నుంచి డిజిటల్ ప్రీమియర్ అవుతోందీ ఈ సినిమా.

ఇవే కాకుండా మరిన్ని ఓటీటీ మలయాళ సినిమాలు

రహెల్ మకన్ కోరా - సైనా ప్లే ఓటీటీ- మార్చి 26, 2024

తుండు- నెట్‌‌ఫ్లిక్స్ ఓటీటీ- మార్చి 15

ఆట్టమ్- అమెజాన్ ప్రైమ్ ఓటీటీ- మార్చి 12

అన్వేషిప్పిన్ కండేతుమ్- నెట్‌ఫ్లిక్స్- మార్చి 8

మలాయి కొట్టాయి వాలిబన్- డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ - ఫిబ్రవరి 23

పోచర్ వెబ్ సిరీస్- అమెజాన్ ప్రైమ్ వీడియో- ఫిబ్రవరి 23

క్వీన్ ఎలిజబెత్- జీ5 ఓటీటీ- ఫిబ్రవరి 15

జై మహేంద్రన్- సోనీ లివ్ ఓటీటీ- ఫిబ్రవరి

మహారాణి మూవీ- హెచ్ఆర్ఆర్ ఓటీటీ- ఫిబ్రవరి

నెరు - డిస్నీ ప్లస్ హాట్‌స్టార్- జనవరి 23

పిలిప్స్ - మనోరమ మ్యాక్స్ ఓటీటీ- జనవరి 19

ఆంటోనీ- అమెజాన్ ప్రైమ్ అండ్ ఆహా ఓటీటీ- జనవరి 12

రజ్నీ- అమెజాన్ ప్రైమ్ ఓటీటీ- జనవరి 12

కాదల్ ది కోర్- అమెజాన్ ప్రైమ్ ఓటీటీ- జనవరి 5