OTT Horror Comedy: ఓటీటీలోకి ఫ్రీగా అందుబాటులోకి వచ్చేస్తున్న బ్లాక్‌బస్టర్ హారర్ కామెడీ మూవీ
OTT Horror Comedy: బ్లాక్‌బస్టర్ హారర్ కామెడీ మూవీ ఓటీటీలోకి ఫ్రీగా అందుబాటులోకి వచ్చేస్తోంది. హిందీ సినిమా చరిత్రలో అత్యధిక డొమెస్టిక్ బాక్సాఫీస్ వసూళ్లు సాధించిన ఈ సినిమాను వచ్చే వారం నుంచి ఫ్రీగా చూసే అవకాశం దక్కనుంది.
OTT Horror Comedy: హారర్ కామెడీ జానర్ కు ఈ మధ్య కాలంలో ఎంత క్రేజ్ ఉంటుందో మనం చూస్తూనే ఉన్నాం. ఇదే జానర్ లో వచ్చి ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ మూవీగా నిలిచింది స్త్రీ2. ఈ సినిమా ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చినా.. ప్రస్తుతానికి రెంట్ చెల్లించే చూసే వీలుంది. అయితే ఇక ఈ సినిమా ఫ్రీగా సబ్‌స్క్రైబర్లందరికీ అందుబాటులోకి రానుంది.
స్త్రీ2 ఓటీటీ స్ట్రీమింగ్
స్త్రీ2 మూవీ ఆగస్ట్ 15న థియేటర్లలో రిలీజై ఎంతటి సంచలన విజయం సాధించిందో మనం చూశాం. కేవలం ఇండియాలోనే రూ.600 కోట్లకుపైగా నెట్ వసూళ్లు సాధించి.. అత్యధిక డొమెస్టిక్ కలెక్షన్లు రాబట్టిన హిందీ మూవీగా చరిత్ర సృష్టించింది. అలాంటి హారర్ కామెడీ మూవీని అక్టోబర్ 10 నుంచి ప్రైమ్ వీడియోలో ఫ్రీగా చూసే అవకాశం దక్కనుంది.
నిజానికి గత వారమే ఈ సినిమా ఓటీటీలోకి అడుగుపెట్టింది. అయితే ఏకంగా రూ.349 చెల్లిస్తేనే ఈ మూవీ చూసే అవకాశం కల్పించారు. ఎర్లీ యాక్సెస్ పేరుతో ఈ మధ్య ఓటీటీల్లోనూ చాలా సినిమాలు రెంట్ విధానంలో వస్తున్నాయి. కొన్ని రోజుల తర్వాత సబ్‌స్క్రైబర్లకు ఫ్రీగా అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అలా స్త్రీ కూడా వచ్చే గురువారం (అక్టోబర్ 10) నుంచి ఫ్రీగా స్ట్రీమింగ్ కానుంది.
స్త్రీ2 బాక్సాఫీస్ వసూళ్లు
స్త్రీ2 మూవీ 2018లో వచ్చిన స్త్రీ మూవీకి సీక్వెల్. అప్పట్లో ఎలాంటి అంచనాలు లేకుండా ఓ చిన్న సినిమాగా రిలీజై ఈ హారర్ కామెడీ పెద్ద విజయమే సాధించింది. అయితే ఇప్పుడీ సీక్వెల్ మాత్రం అంతకుమించిన రికార్డు కలెక్షన్లతో అందరినీ ఆశ్చర్య పరిచింది. ఓటీటీలోకి వచ్చినా కూడా థియేటర్లలో ఇప్పటికీ మంచి వసూళ్లు సాధిస్తూనే ఉంది.
48 రోజుల తర్వాత ఇండియాలో 617.56 కోట్ల కలెక్షన్లు, ప్రపంచవ్యాప్తంగా రూ.867.72 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా చూస్తే అత్యధిక వసూళ్లు సాధించిన బాలీవుడ్ సినిమాల్లో ఏడో స్థానంలో ఉంది. అయితే ఇండియాలో మాత్రం అత్యధిక వసూళ్ల హిందీ మూవీ రికార్డు స్త్రీ2దే కావడం విశేషం.
స్త్రీ2 సినిమాలో శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావ్, పంకజ్ త్రిపాఠీ లాంటి వాళ్లు నటించారు. అంతేకాదు అక్షయ్ కుమార్, వరుణ్ ధావన్ లాంటి నటులు కూడా అతిథి పాత్రల్లో కనిపించారు. ఈ ఏడాదే బాలీవుడ్ లో వచ్చిన మరో హారర్ కామెడీ మూవీ ముంజ్యా కూడా బాక్సాఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే.