OTT Anthology: ఓటీటీలోకి రాబోతున్న మరో ఇంట్రెస్టింగ్ ఆంథాలజీ.. ఆరు స్టోరీలతో.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
OTT Anthology: ఓటీటీలోకి ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ ఆంథాలజీ రాబోతోంది. ఆరు డిఫరెంట్ స్టోరీలతో రాబోతున్న ఈ సిరీస్ సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా గురువారం (అక్టోబర్ 3) ట్రైలర్ రిలీజ్ చేశారు.
OTT Anthology: ఓటీటీల్లో ఆంథాలజీకి ఓ ప్రత్యేక స్థానం ఉంది. అటు సినిమా కాకుండా, ఇటు వెబ్ సిరీస్ కాకుండా.. భిన్నమైన కథల సమాహారమే ఈ ఆంథాలజీ. ఇప్పటికే పలు ఆంథాలజీలు ఓటీటీల్లో ఉండగా.. ఇప్పుడు మరొకటి సోనీలివ్ లోకి వస్తోంది. దీనిపేరు జిందగీనామా (Zindagiनामा). బాలీవుడ్ కు చెందిన ప్రముఖ నటీనటులు నటించిన ఈ సిరీస్ ట్రైలర్ తాజాగా రిలీజైంది.
జిందగీనామా ఓటీటీ స్ట్రీమింగ్
మన జీవితాల్లో ప్రతి ఒక్కరం పరిస్థితులను బట్టి ఎన్నో సంఘర్షణలను ఎదుర్కొంటూ ఉంటాం. వాటిని చాలా మంది తమలో తామే దాచుకుంటారు. అయితే ఈ సంఘర్షణలే ఆ మనుషులను రాటుదేలుస్తుంటాయి. అలాంటి వివిధ సంఘర్షణలను కథలుగా మలిచి ఈ జిందగీనామా ఆంథాలజీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
ఈ ఆంథాలజీ అక్టోబర్ 10 నుంచి సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. భన్వర్, స్వాగతం, వన్ ప్లస్ వన్, కేజ్డ్, పప్పెట్ షో, పర్పుల్ దునియా అంటూ ఆరు భిన్నమైన కథలను దీని ద్వారా మేకర్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తుల వివిధ భావోద్వేగాల చుట్టూ ఇది తిరగనున్నట్లు తాజాగా రిలీజైన ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.
ప్రముఖ నటీనటులతో..
ఈ జిందగీనామా ఆంథాలజీలో బాలీవుడ్ కు చెందిన ప్రముఖ నటీనటులు ఉన్నారు. ఒకప్పుడు కొత్త బంగారులోకం మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన శ్వేత బసు ప్రసాద్ తోపాటు ప్రియా బాపట్, ప్రజక్త కోలీ, యశస్విని, శ్రేయస్ తల్పడే, అంజలి పాటిల్, సుమీత్ వ్యాస్, శివానీ రఘువంశీలాంటి వాళ్లు ఇందులో నటించారు.
ఈ ఆంథాలజీలోని ఆరు స్టోరీలను ఆరుగురు డైరెక్టర్లు ఆదిత్య సర్పోట్దర్, సుకృతి త్యాగి, మితాక్షర కుమార్, డానీ మామిక్, రాఖీ శాండిల్య, సహాన్ లాంటి వాళ్లు డైరెక్ట్ చేశారు. వీళ్లలో డైరెక్టర్ ఆదిత్య ఈ మధ్యే ముంజ్యా అనే సూపర్ డూపర్ హిట్ హారర్ కామెడీ మూవీని డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే.
ఈ ఆంథాలజీలో అతడు భన్వర్ అనే స్టోరీకి దర్శకత్వం వహించాడు. ఇప్పటికే ఎన్నో ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ చేస్తున్న సోనీలివ్ ఓటీటీ అక్టోబర్ 10 నుంచి ఈ జిందగీనామా అనే ఆంథాలజీని స్ట్రీమింగ్ చేయనుంది.