Oh Bhama Ayyo Rama: కొత్త దర్శకులకు దొరికిన వరం.. హీరోపై డైరెక్టర్ ప్రశంసలు-oh bhama ayyo rama director ram godala praises suhas in pooja ceremony ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Oh Bhama Ayyo Rama Director Ram Godala Praises Suhas In Pooja Ceremony

Oh Bhama Ayyo Rama: కొత్త దర్శకులకు దొరికిన వరం.. హీరోపై డైరెక్టర్ ప్రశంసలు

Sanjiv Kumar HT Telugu
Mar 31, 2024 01:59 PM IST

Suhas Oh Bhama Ayyo Rama Director: హీరో సుహాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఓ భామ అయ్యో రామ. తాజాగా ఈ మూవీ పూజా కార్యక్రమాలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో హీరో సుహాస్‌పై సినిమా డైరెక్టర్ రామ్ గోదాల ప్రశంసలు కురిపించడమే కాకుండా ఆసక్తికర కామెంట్స్ చేశారు.

కొత్త దర్శకులకు దొరికిన వరం.. హీరోపై డైరెక్టర్ ప్రశంసలు
కొత్త దర్శకులకు దొరికిన వరం.. హీరోపై డైరెక్టర్ ప్రశంసలు

Suhas Oh Bhama Ayyo Rama: వైవిధ్య‌మైన సినిమాలతో న‌టుడిగా, హీరోగా త‌న‌కంటూ ఒక ప్ర‌త్యేక మార్క్‌ను క్రియేట్ చేసుకున్న క‌థానాయ‌కుడు సుహాస్. ఆయ‌న హీరోగా న‌టిస్తున్న మ‌రో వైవిధ్య‌మైన ప్రేమ‌క‌థా చిత్రం ఓ భామ అయ్యో రామ. మాళ‌విక మ‌నోజ్ హీరోయిన్‌‌గా చేస్తున్న ఈ మూవీ షూటింగ్ చిత్రీక‌ర‌ణ పూజా కార్య‌క్ర‌మాలు శ‌నివారం (మార్చి 30) హైద‌రాబాద్‌లోని ఫిలింన‌గ‌ర్ దైవ‌ స‌న్నిధానంలో ప్రారంభ‌మ‌య్యాయి.

వీఆర్ట్స్అండ్ చిత్ర‌ల‌హ‌రి టాకీస్ ప‌తాకంపై హ‌రీష్ న‌ల్లా, ప్ర‌దీప్ తాళ్లపు రెడ్డి ఈ ఓ భామ అయ్యో రామ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రామ్ గోదాల ద‌ర్శ‌కత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి రామ్ గోదాల దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఇక హీరో, హీరోయిన్‌పై చిత్రీక‌రించిన ముహుర్త‌పు స‌న్నివేశానికి ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు క్లాప్ నిచ్చారు. ద‌ర్శకుడు వ‌శిష్ట కెమెరా స్విచ్చాన్ చేశారు. మ‌రో ద‌ర్శ‌కుడు శైలేష్ కొలను బౌండెడ్ స్కిప్ట్‌ను డైరెక్టర్‌కు అంద‌జేశారు.

అనంతరం ఓ భామ అయ్యో రామ టైటిల్ పోస్ట‌ర్‌ను ద‌ర్శ‌కులు విజయ్ క‌న‌క‌మేడ‌ల‌, కిషోర్ తిరుమ‌ల‌, నిర్మాత‌ సుద‌ర్శ‌న్ రెడ్డి ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన ప్రేస్ మీట్‌లో హీరో సుహాస్, డైరెక్టర్ రామ్ గోదాల, సినిమాలు ముఖ్య పాత్ర పోషిస్తున్న నువ్వు నేను ఫేమ్ అనితా హస్సానందని తదితరులు పాల్గొన్నారు.

"ద‌ర్శ‌కుడు మారుతి గారి ద‌గ్గ‌ర డైరెక్ష‌న్ డిపార్ట్‌మెంట్‌లో ప‌నిచేస్తున్న‌ప్ప‌టి నుంచి నాకు ద‌ర్శ‌కుడితో ప‌రిచ‌యం ఉంది. మంచి క‌థ‌తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. నా అభిమాన న‌టుల‌తో న‌టించే అవ‌కాశం నాకు ఈ సినిమాతో దొరికింది. ఎప్పుడెప్పుడు ఈ చిత్రం షూటింగ్‌కు వెళ‌దామా అని ఎదురుచూస్తున్నాను" అని హీరో సుహాస్ తెలిపాడు. "నా సెకండ్ ఇన్నింగ్స్‌కు ఫ‌ర్‌ఫెక్ట్‌గా కుదిరిన చిత్ర‌మిది. న‌న్ను ఎంత‌గానో ఆక‌ర్షించిన క‌థ ఇది" అని హీరోయిన్ అనితా హస్సానందని పేర్కొన్నారు.

"ఇదొక బ్యూటిఫుల్ లవ్‌ స్టోరీ, సుహాస్ కొత్త‌గా ద‌ర్శ‌క‌త్వం చేసే వాళ్ల‌కు దొరికిన వ‌రం. ఎంతో కంఫ‌ర్ట‌బుల్ ఆర్టిస్ట్‌. చాలా వైవిధ్య‌మైన క‌థ‌ల‌తో, సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్నాడు. అలాంటి సుహాస్ ఈ సినిమా చేయ‌డం సంతోషంగా ఉంది. నిర్మాతలు ఎక్క‌డా రాజీప‌డ‌కుండా మంచి టెక్నిషియ‌న్స్‌ను ఇచ్చారు. ర‌థ‌న్ సంగీతం ఈ చిత్రానికి అద‌న‌పు బలంగా ఉంటుంది" అని ఓ భామ అయ్యో రామ డైరెక్టర్ రామ్ గోదాల చెప్పారు.

నిర్మాత‌లు మాట్లాడుతూ "ద‌ర్శ‌కుడు రాసుకున్న క‌థ‌కు త‌గిన విధంగా మంచి ఆర్టిస్టులు, టెక్నిషియ‌న్స్ కుదిరారు. అంతా ఫ్రెండ్లి వాతావ‌ర‌ణంలో ఈసినిమా చేస్తున్నాం. సినిమా ప్రారంభం నుంచే మంచి పాజిటివ్ వైబ్ క‌నిపిస్తుంది" అని చెప్పుకొచ్చారు. కాగా ఈ స‌మావేశంలో ప్ర‌ముఖ హాస్య‌న‌టుడు అలీ, సినిమాటోగ్రాఫ‌ర్ మ‌ణికంద‌న్‌, సంగీత దర్శ‌కుడు ర‌థ‌న్‌, ఆర్ట్ ద‌ర్శ‌కుడు బ్ర‌హ్మా క‌డ‌లి, కో ప్రొడ్యూస‌ర్ ఆనంద్ గ‌డ‌గోని త‌దిత‌రులు పాల్గొన్నారు.

ఇదిలా ఉంటే, ఓ భామ అయ్యో రామ సినిమాలో హీరో సుహాస్, హీరోయిన్ మాళవిక మనోజ్, అనితా హస్సానందనితోపాటు అలీ కూడా ఓ కీ రోల్ ప్లే చేస్తున్నాడు. కాగా ఇటీవల సుహాస్ హీరోగా అంబాజీపేట మ్యారేజి బ్యాండుతో మంచి హిట్ కొట్టాడు. ఇప్పుడు ఆ సినిమా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

IPL_Entry_Point