Tantra OTT Official: ఓటీటీలోకి 20 రోజులకే వస్తున్న సూపర్ హిట్ హారర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే?-tantra movie ott streaming on aha ananya nagalla horror movie tantra ott release tantra digital premiere ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Tantra Movie Ott Streaming On Aha Ananya Nagalla Horror Movie Tantra Ott Release Tantra Digital Premiere

Tantra OTT Official: ఓటీటీలోకి 20 రోజులకే వస్తున్న సూపర్ హిట్ హారర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే?

Sanjiv Kumar HT Telugu
Mar 31, 2024 11:14 AM IST

Tantra OTT Streaming: ఓటీటీలోకి మరో సరికొత్త హారర్ మూవీ వచ్చేస్తోంది. ఇటీవలే థియేటర్లలో విడుదలైన హారర్ థ్రిల్లర్ మూవీ తంత్ర డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. దీనికి సంబంధించిన వివరాలను సదరు ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది.

ఓటీటీలోకి సరికొత్త హారర్ మూవీ.. ఎక్కడా చూడని క్షుద్రపూజలతో తంత్ర..  స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీలోకి సరికొత్త హారర్ మూవీ.. ఎక్కడా చూడని క్షుద్రపూజలతో తంత్ర.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Tantra OTT Release: ఈ మధ్య మళ్లీ హారర్ జోనర్ సినిమాలు ఎక్కువగా వచ్చేస్తున్నాయి. అయితే హారర్‌కు క్రైమ్, కామెడీ, ఫాంటసీ వంటి అంశాలను కూడా టచ్ చేస్తూ సరికొత్త కాన్సెప్టులతో సినిమాలను తెరకెక్కిస్తున్నారు దర్శకనిర్మాతలు. అయితే, ఇటీవలే పూర్తి హారర్ జోనర్ సినిమా థియేటర్లలో విడుదలై సందడి చేసింది. ఆ సినిమానే తంత్ర. క్షుద్రపూజల నేపథ్యంలో సుమారు 20 రోజుల క్రితం థియేటర్లలో రిలీజైన ఈ తంత్ర సినిమా అతి తక్కువ సమయంలోనే ఓటీటీలోకి వచ్చేస్తుంది.

పూర్తి హారర్ అంశాలతో తెరకెక్కిన తంత్ర సినిమా ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. దీనికి సంబంధించి తాజాగా ఆహా సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. తంత్ర సినిమాను ఆహా ఓటీటీలో ఏప్రిల్ 5 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు. "తంత్రం మంత్రం కుతంత్రం.. ఆహా అందిస్తోన్న మరో హారర్ చిత్రం.. తంత్ర ఏప్రిల్ 5 నుంచి డిజిటల్ ప్రీమియర్ కానుంది" అని ఎక్స్ (గతంలో ట్విటర్) వేదికగా రాసుకొచ్చింది ఆహా టీమ్.

ఇటీవలే భూతద్ధం భాస్కర్ నారాయణ వంటి మైథలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా, మా ఊరి పొలిమేర 2 వంటి హారర్ చిత్రాలను తీసుకొచ్చిన ఆహా ఇప్పుడు మరో హారర్ జోనర్ చిత్రం తంత్రను స్ట్రీమింగ్ చేయనుంది. అయితే, తంత్ర సినిమా ఇటీవలే మార్చి 15న థియేటర్లలో విడుదలైంది. సినిమాకు బాగానే రెస్పాన్స్ వచ్చింది. సినిమాలో పూర్తి స్థాయిలో హారర్ ఎలిమెంట్స్ ఉన్నాయని రివ్యూలు కూడా వచ్చాయి. సినిమాకు మంచి టాక్ వచ్చిన కలెక్షన్ల పరంగా అంతగా ప్రభావం చూపలేకపోయిందని తెలుస్తోంది.

అయితే, మంచి టాక్ వచ్చిన తంత్ర మూవీ నెల కాకముందే 20 రోజుల్లోపే ఓటీటీలోకి రావడం సినీ ప్రియులకు, ప్రేక్షకులకు గుడ్ న్యూస్ అని చెప్పాలి. థియేటర్లలో మిస్ అయినవాళ్లు ఈ తంత్ర సినిమాను ఎంచక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయొచ్చు.

ఇదిలా ఉంటే, తంత్ర సినిమాలో అనన్య నాగళ్ళ, ధనుష్ రఘుముద్రి, సలోని, టెంపర్ వంశీ, మీసాల లక్ష్మణ్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఫస్ట్ కాపీ మూవీస్, బి ద వే ఫిల్మ్స్ బ్యానర్లపై నరేష్ బాబు పి, రవిచైతన్య నిర్మాతలుగా వ్యవహరించిన ఈ సినిమాకు శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వం వహించారు.

తంత్ర సినిమా కథ విషయానికొస్తే.. రేఖ (అనన్య నాగళ్ల) పుట్టుక‌తోనే త‌ల్లి రాజ్య‌ల‌క్ష్మిని (స‌లోని) కోల్పోతుంది. నాన్నమ్మ సంరక్షణలో పెరుగుతుంది. . తేజూ (ధనుష్ రఘుముద్రి)ను ఇష్టపడుతుంది. తేజూ వేశ్య కొడుకు కావ‌డంతో వారి ప్రేమ‌కు అనేక‌ అడ్డంకులు ఎదుర‌వుతుంటాయి. క్షుద్ర శ‌క్తుల కార‌ణంగా జ‌న్మించ‌డంతో రేఖ చుట్టూ ఎప్పుడూ ద‌య్యాలు తిరుగుతుంటాయి. పౌర్ణ‌మి వ‌చ్చిందంటే రేఖ‌ను వెతుక్కుంటూ ఓ ర‌క్త పిశాచి వ‌స్తుంటుంది. అందుకు కార‌ణం ఏమిటి?

క్షుద్ర శ‌క్తుల బారి నుంచి రేఖ ఎలా బ‌య‌ట‌ప‌డింది? అసలు రేఖ నేపథ్యం ఏమిటి? రేఖ త‌ల్లి రాజ్య‌ల‌క్ష్మి ఎలా చ‌నిపోయింది? రేఖ‌ను బ‌లి ఇవ్వాల‌ని విగ‌తి (టెంప‌ర్ వంశీ) ఎందుకు అనుకుంటున్నాడు? అత‌డి బారి నుంచి రేఖ బ‌య‌ట‌ప‌డిందా? తేజాతో త‌న ప్రేమ‌ను గెలిపించుకుందా? లేదా? అన్న‌దే తంత్ర మూవీ క‌థ‌.

IPL_Entry_Point