NNS March 28th Episode: అరుంధ‌తి న‌గ‌లు కొట్టేసిన మ‌నోహ‌రి - మిస్స‌మ్మ డౌట్‌- భాగీ పెళ్లికి ముహూర్తం ఫిక్స్‌-nindu noorella saavasam march 28th episode manohari steals to arundhati jewellery ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Nindu Noorella Saavasam March 28th Episode Manohari Steals To Arundhati Jewellery

NNS March 28th Episode: అరుంధ‌తి న‌గ‌లు కొట్టేసిన మ‌నోహ‌రి - మిస్స‌మ్మ డౌట్‌- భాగీ పెళ్లికి ముహూర్తం ఫిక్స్‌

Nelki Naresh Kumar HT Telugu
Mar 28, 2024 02:06 PM IST

NNS March 28th Episode: నీల స‌హాయంతో అరుంధ‌తి న‌గ‌ల‌ను కొట్టేస్తుంది మ‌నోహ‌రి. ఆ న‌గ‌ల‌కు డూప్లికేట్‌వి చేయించాల‌ని అనుకుంటుంది. మ‌నోహ‌రి, నీల‌ను న‌గ‌ల షాప్‌లో చూసి అమ‌ర్ షాక‌వుతాడు. ఆ త‌ర్వాత నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియ‌ల్‌లో ఏం జ‌రిగిందంటే?

నిండు నూరేళ్ల సావాసం సీరియ‌ల్‌
నిండు నూరేళ్ల సావాసం సీరియ‌ల్‌

NNS March 28th Episode: బుల్లెట్​ బండి నడపడం తన కోరిక అని అమ‌ర్‌ను అడుగుతుంది మిస్సమ్మ. ఆమెకు డ్రైవింగ్​ నేర్పిస్తాడు అమర్​. ఇద్దరూ కలిసి బండిపై ఇంటికి బయలుదేరతారు. తన భర్తతో మిస్సమ్మ చనువుగా ఉండటం చూసి తట్టుకోలేకపోతుంది అరుంధతి.

మ‌నోహ‌రి ప్లాన్‌...

మనోహరి ప్లాన్​లో భాగంగా అరుంధతి నగలు తీసుకుని బయటకు వెళ్తున్న నీలను రాథోడ్‌ అపడంతో భయపడుతుంది. ఏంటి బ్యాగులో అని అడుగుతాడు రాథోడ్‌. పాడయిపోయిన కూరగాయలు బయట పేదవాళ్లకు ఇద్దామని తీసుకెళ్తున్నానని చెప్తుంది నీల. అయితే డౌటుగానే రాథోడ్‌ లోపలికి వెళ్లిపోతాడు.

నీల బ్యాగుతో వెళ్లడం చూసిన ఆరుంధతి దగ్గరకు వెళ్లి ఏంటి అని అడుగుతుంది. వినడబనట్లు నీల నడుచుకుంటూ వెళ్తూ.. కిందపడిపోతుంది. దీంతో బ్యాగులో ఉన్న నగలు కిందపడతాయి. నగలు చూసిన అరుంధతి షాక్‌ అవుతుంది. నీల అటూ ఇటూ చూస్తూ ఎవరూ చూడలేదని బ్యాగు సర్ధుకుని వెళ్లిపోతుంది.

మిస్సమ్మ డౌట్…

రాథోడ్‌ మిస్సమ్మ దగ్గరకు వెళ్లి.. ఆ నీల, మనోహరి అమ్మగారు కలిసి ఏదో కుట్ర‌లు చేస్తున్నారమ్మా అంటాడు. ఏమంటున్నావు రాథోడ్‌ నాకేం అర్థం అవ్వటం లేదు అంటుంది మిస్సమ్మ. పనిమనిషి నీల బ్యాగు తీసుకుని బయటకు వెళ్లింది. ఎవరైనా చూస్తారేమోనన్న కంగారు ఎవరికైనా దొరికిపోతామేమో అన్న కంగారు ముఖంలో కొట్టొచ్చినట్టు కనిపించాయి అని చెబుతాడు రాథోడ్​.

మరి ఈ ఇంటికి కాబోయే పెద్దమనిషి ఎక్కడుంది.? అని అడుగుతుందిమిస్సమ్మ. ఆవిడ కూడా ఎక్కడికో వెళ్తుంది మిస్సమ్మ.. అంటాడు రాథోడ్​. అయితే పక్కాగా ఈ పెద్దమనిషి ఎదో చేయబోతుంది. దానికి సంబంధించిందే పనిమనిషికి ఇచ్చి పంపించింది. ఇప్పుడు మనం మనోహరిని ఫాలో చేస్తే ఇద్దరు చేసే గూడుపుఠాణి కనిపెట్టొచ్చు. పదండి వెళ్దాం.. అంటూ ఇద్దరూ బయటకు వెళ్తారు.

బ‌య‌టప‌డిన దొంగ‌త‌నం...

ఒక దగ్గర నిలబడ్డ నీల భయపడుతూ మనోహరి కోసం ఎదురుచూస్తుంది. ఇంతలో అరుంధతి నీల దగ్గరకు వచ్చి నగలు ఎందుకు దొంగతనంగా ఇక్కడికి తీసుకొచ్చావు అంటూ అడుగుతుంది. నీలకు వినబడకపోవడంతో అలాగే చూస్తుండిపోతుంది. దీంతో కోపంగా అరుంధతి గట్టిగా అరిచేసరికి నీల అదిరిపడుతుంది.

ఎవరు నా చెవిలో అరిచింది ఎవరు? కొంపదీసి అరుంధతి అమ్మగారు ఆవిడ నగలు తీసుకెళ్తున్నానని నావెంట వచ్చిందా? అని భయపడుతుంది నీల. వచ్చానే.. వచ్చాను కాబట్టే నీ అసలు రంగు బయటపడింది అంటుంది అరుంధతి.

అరుంధ‌తి షాక్‌...

అమ్మా మీరే కనుక ఇక్కడ ఉంటే ఈ నగలు నాకు ఇచ్చి ఇక్కడకు తీసుకురమ్మని చెప్పింది మనోహరి అమ్మగారేనమ్మా.. అనడంతో అరుంధతి షాక్‌ అవుతుంది. మీకు దండం పెడతానమ్మా ఇందులో నా తప్పేం లేదమ్మా అంటూ అక్కడి నుంచి మరోచోటికి వెళ్తుంది.

మరోవైపు రాథోడ్‌, మిస్సమ్మ కారులో మనోహరిని ఫాలో అవుతుంటారు. ఇంతలో వాళ్లకు వేరే వెహికిల్‌ అడ్డురావడంతో మనోహరి తప్పించుకుని వెళ్లిపోతుంది. మనోహరి ఎటు వెళ్లిందోనని ఆలోచిస్తూ.. ఎటైతే అటేనని రైట్‌ వెళ్దాం అని మిస్సమ్మ చెప్పడంతో రాథోడ్‌ రైట్‌ సైడ్‌ వెళ్లిపోతారు.

నీలా కంగారు…

నీల నగల దుకాణం మెట్ల మీద కూర్చుని భయపడుతుంటే వెనక నుంచి మనోహరి వచ్చి భుజం మీద చెయ్యి వెయ్యగానే మరింత భయంగా అరుస్తుంది. అరుంధతి వచ్చినట్లుంది అని చెప్పగానే అదేం లేదు అంటూ షాపు లోపలికి వెళ్లి తను తీసుకొచ్చిన నగలకు డూప్లికేట్‌ నగలు చేయాలని చెప్తుంది మనోహరి.

ఇంతలో అక్కడికి అమర్‌ వస్తాడు. మనోహరి కారు ఇక్కడుందేంటి అంటూ షాప్‌ లోపలికి వెళ్తాడు అమర్​. మనోహరి... అంటూ పిలవగానే షాక్‌ అవుతుంది. ఇక్కడేం చేస్తున్నావు మనోహరి. ఏమైంది నన్ను చూసి ఎందుకు కంగారుపడుతున్నావు. ఈ షాపులో నీకేంటి పని అని అడుగుతాడు అమర్​. మా ఆయనకు అడ్డగా దొరికిపోయావు మను అని సంబరపడుతుంది అరుంధతి.

ప్లాన్ ఛేంజ్‌...

అమర్‌ నీకోసమే వచ్చాను. నీకోసమే చైన్‌ చేయిద్దామని వచ్చాను అని మనోహరి అనగానే నాకెందుకు చైన్‌ అంటూ.. నీ సెంటిమెంట్‌ను నేను కాదనలేను అని చెప్తాడు అమర్​. మిస్సమ్మ, రాథోడ్‌ షాపు ముందర అమర్‌, మనోహరి కారు చూసి అక్కడే ఆగిపోతారు. బయటకు వచ్చిన అమర్‌ను మిస్సమ్మ మీరిక్కడ అని అడగ్గానే మనోహరి కారు ఇక్కడ కనిపించగానే ఆగాను అని చెప్తాడు. దీంతో అందరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు.

మిస్స‌మ్మ జాత‌కం...

రామ్మూర్తి పంతులును పిలిపించి మిస్సమ్మ జాతకం చెప్పమంటాడు. జాతకం చూసి మంచి సంబంధం ఉంటే చెప్పండి అనగానే పంతులు మూడు రోజుల్లో ఈ అమ్మాయి పెళ్లి పెట్టుకుని ఇప్పుడు సంబంధాలు చూడమంటున్నారు అంటూ ప్రశ్నిస్తాడు పంతులు. దాంతో మంగళ, రామ్మూర్తి షాకవుతారు.

పంతులు చెప్పినట్లే భాగీ పెళ్లి జరుగుతుందా? మనోహరి ప్లాన్​ బయటపెట్టేందుకు మిస్సమ్మ ఏం చేయబోతుంది? అన్న‌ది తెలియాలంటే మార్చి 28న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్​ చూడాల్సిందే!

IPL_Entry_Point