Appudo Ippudo Eppudo Twitter Review: అప్పుడో ఇప్పుడో ఎప్పుడో ట్విట్టర్ రివ్యూ - నిఖిల్ మూవీకి డిజాస్టర్ టాక్
Appudo Ippudo Eppudo Twitter Review: నిఖిల్, రుక్మిణి వసంత్ హీరోహీరోయిన్లుగా నటించిన అప్పుడో ఇప్పుడో ఎప్పుడో శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీకి సుధీర్ వర్మ దర్శకత్వం వహించాడు.
Appudo Ippudo Eppudo Twitter Review: నిఖిల్ హీరోగా నటించిన అప్పుడో ఇప్పుడో ఎప్పుడో మూవీ పెద్దగా ప్రమోషన్స్ లేకుండా సైలెంట్‌గా శుక్రవారం థియేటర్లలో రిలీజైంది. ఈ మూవీతో సప్తసాగరాలు దాటి ఫేమ్ రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. స్వామి రారా ఫేమ్ సుధీర్ వర్మ దర్శకత్వం వహించాడు. యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ ఓవర్‌సీస్ ప్రీమియర్స్ టాక్ ఎలా ఉందంటే?
క్రైమ్ కామెడీ...
కెరీర్‌లో ఎక్కువగా క్రైమ్ కామెడీ సినిమాలే చేశాడు డైరెక్టర్ సుధీర్ వర్మ. తన ఫేవరేట్ జానర్‌లోనే అప్పుడో ఇప్పుడో ఎప్పుడో మూవీని చేశాడని నెటిజన్లు అంటున్నారు. క్రైమ్ కామెడీ ఎలిమెంట్స్‌తో పాటు లవ్‌స్టోరీని మిక్స్ చేస్తూ ఈ సినిమాను తెరకెక్కించాడని నెటిజన్లు చెబుతోన్నారు. సినిమా సెటప్, యాక్టింగ్‌తో పాటు లొకేషన్స్, కామెడీ బాగున్నా స్టోరీ మాత్రం ఔట్‌డేటెడ్‌గా అనిపిస్తుందని అంటున్నారు.
బోరింగ్ స్క్రీన్‌ప్లే...
స్క్రీన్‌ప్లే బోరింగ్‌గా సాగుతుందని, సందర్భం లేకుండా వచ్చే పాటలు విసిగిస్తాయని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. లవ్‌స్టోరీ కూడా సోసోగానే సాగుతుందని, గతంలో వచ్చిన పలు పాత సినిమాల్ని గుర్తుచేస్తుందని అంటున్నారు. ఆడియెన్స్‌ను ఎంగేజ్ చేసేలా సినిమాను తెరకెక్కించడంలో దర్శకుడు సుధీర్ వర్మ ఫెయిలయ్యాడని ఓ నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు.
నిఖిల్ యాక్టింగ్...
కొత్త సినిమాలా కాకుండా చాలా ఏళ్ల క్రితం తీసిన సినిమాను ఇప్పుడు చూస్తున్న ఫీలింగ్ కలుగుతుందని అంటున్నారు. హీరో నిఖిల్ యాక్టింగ్ మాత్రం బాగుందని చెబుతోన్నారు. యాక్టర్‌గా వంద శాతం ఔట్‌పుట్ ఇచ్చాడని పేర్కొంటున్నారు. నిఖిల్, రుక్మిణి వసంత్ కాంబోలో వచ్చే సీన్స్ మెప్పిస్తాయని ట్వీట్స్ చేస్తున్నారు.
వైవా హర్ష, సుదర్శన్ పంచ్‌లు కొన్ని చోట్ల నవ్విస్తాయని అంటున్నారు. సినిమా కథ మొత్తం లండన్ నేపథ్యంలోనే సాగుతుందని, కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లు, విజువల్స్ మాత్రం ఆకట్టుకుంటున్నాయని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. సినిమాను థియేటర్లతో పాటు ఓటీటీలోనూ చూడటం కష్టమేనని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.
మూడో సినిమా...
అప్పుడో ఇప్పుడో ఎప్పుడో మూవీకి కార్తిక్ మ్యూజిక్ అందించగా...సన్నీ ఎమ్ఆర్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సమకూర్చాడు. సీనియర్ ప్రొడ్యూసర్ బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. గతంలో నిఖిల్ సుధీర్ వర్మ కాంబోలో స్వామి రారా, కేశవ సినిమాలొచ్చాయి. నిఖిల్ హీరోగా నటించిన కిరిక్ పార్టీ మూవీకి సుధీర్ వర్మ స్క్రీన్‌ప్లే అందించాడు.