Nayakudu OTT Release Date: పదిరోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తోన్న నాయకుడు - స్ట్రీమింగ్ డేట్ ఇదే
Nayakudu OTT Release Date: నాయకుడు మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయింది. ఉదయనిధి స్టాలిన్, ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందంటే...
Nayakudu OTT Release Date: ఉదయనిధి స్టాలిన్(Udhayanidhi Stalin) హీరోగా నటించిన లేటెస్ట్ కోలీవుడ్ హిట్ మూవీ మానన్నన్ ఓటీటీలోకి రాబోతోంది. జూలై 27 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో(Netflix) స్ట్రీమింగ్ కానుంది. తెలుగులో నాయకుడు పేరుతో ఈ సినిమా డబ్బింగ్ అయిన సంగతి తెలిసిందే. ఓటీటీలో తెలుగు వెర్షన్ కూడా జూలై 27నే రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్‌ను దాదాపు పదికోట్లకు నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం.
రాజకీయాల్లోని అసమానాతల్ని చర్చిస్తూ తెరకెక్కిన నాయకుడు సినిమాలో మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్(Fahadh Faasil) విలన్‌గా నటించాడు. సీనియర్ కమెడియన్ వడివేలు తన పంథాకు భిన్నంగా ఎమ్మెల్యేగా సీరియల్ రోల్‌లో కనిపించాడు. కీర్తిసురేష్ కథానాయికగా నటించింది.
తమిళంలో మామన్నన్ మూవీ యాభై కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. తెలుగులో జూలై 14న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఆడియెన్స్‌ను మెప్పించలేకపోయింది. తెలుగులో ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్, ఏషియన్ సినిమాస్ సంస్థలు రిలీజ్ చేశాయి. మామన్నన్ సినిమాకు మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించాడు. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించాడు.
నాయకుడు కథేమిటంటే?
తిమ్మరాజు(వడివేలు) వెనుకబడిన వర్గానికి చెందిన ఎమ్మెల్యే. అతడి కొడుకు రఘువీరా (ఉదయనిధి స్టాలిన్) మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్‌గా పనిచేస్తుంటాడు. పేదలకు ఉచిత విద్యను అందించడానికి లీలా (కీర్తిసురేష్) అనే అమ్మాయి ప్రారంభించాలని అనుకున్న ఓ ఇనిస్టిట్యూట్ విషయంలో తన పార్టీకే చెందిన లీడర్ రత్నవేలుతో (ఫహాద్ ఫాజిల్) తిమ్మరాజు, రఘువీరా పోరాటం చేయాల్సివస్తుంది. ఈ కులాల గొడవల కారణంగా ఈ తండ్రీకొడుకులు ఎలాంటి ఇబ్బందులు పడ్డారన్నదే నాయకుడు మూవీ కథ.
నాయకుడు మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయింది. ఉదయనిధి స్టాలిన్, ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందంటే...