Mrunal Thakur: అలా జరగకుంటే నా పేరు మార్చుకుంటా.. సీతారామం హీరోయిన్ మృణాల్ ఠాకూర్-mrunal thakur comments in hi nanna movie pre release event ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mrunal Thakur: అలా జరగకుంటే నా పేరు మార్చుకుంటా.. సీతారామం హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: అలా జరగకుంటే నా పేరు మార్చుకుంటా.. సీతారామం హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Sanjiv Kumar HT Telugu
Nov 30, 2023 03:34 PM IST

Mrunal Thakur About Hi Nanna Movie: సీతారామం సినిమాతో తెలుగు విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న హిందీ భామ మృణాల్ ఠాకూర్. తాజాగా హాయ్ నాన్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌లో మృణాల్ ఠాకూర్ షాకింగ్ కామెంట్స్ చేసింది.

అలా జరగకుంటే నా పేరు మార్చుకుంటా.. సీతారామం హీరోయిన్ మృణాల్ ఠాకూర్
అలా జరగకుంటే నా పేరు మార్చుకుంటా.. సీతారామం హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Hi Nanna Pre Release Event: నేచురల్ స్టార్ నాని, సీతారామం బ్యూటి మృణాల్ ఠాకూర్ హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా హాయ్ నాన్న. వైరా ఎంటర్‌టైన్‌మెంట్ మొదటి ప్రొడక్షన్ వెంచర్‌ గా రూపొందిన ఈ చిత్రంతో శౌర్యువ్ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఇందులో బేబీ కియారా ఖన్నా కీలక పాత్ర పోషించగా.. శ్రుతి హాసన్ స్పెషల్ అప్పిరీయెన్స్ ఇచ్చింది. మోహన్ చెరుకూరి (CVM), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల భారీ ఎత్తున నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 7న విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో నవంబర్ 29న హాయ్ నాన్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను వైజాగ్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఆసక్తిర కామెంట్స్ చేసింది. "సీతారామంకు ఇక్కడి వచ్చాను. ఇప్పుడు హాయ్ నాన్న కోసం ఇక్కడికి రావడం ఆనందంగా ఉంది. సీత పాత్రని చాలా గొప్పగా ఆదరించారు. ఇప్పుడు హాయ్ నాన్నలో యష్ణకు కూడా అదే అభిమానం చూపిస్తున్నారు" అని మృణాల్ తెలిపింది.

"ఒక తెలుగు అమ్మాయిలా నన్ను ఆదరిస్తున్న మీ అందరిపట్ల ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటాను. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలకు ధన్యవాదాలు. హాయ్ నాన్న బ్యూటీఫుల్ జర్నీ. దర్శకుడు శౌర్యువ్ హాయ్ నాన్నని అద్భుతంగా మలిచారు. బేబీ కీయరా నటన మనసుని హత్తుకుంటుంది. నాని గారు వండర్ ఫుల్ కో స్టార్. ఈ పాత్ర చేస్తునప్పుడు చాలా విలువైన సూచనలు ఇచ్చారు. చాలా గొప్పగా సపోర్ట్ చేశారు" అని మృణాల్ ఠాకూర్ చెప్పుకొచ్చింది.

"ప్రియదర్శి, విరాజ్ ఇలా టీం అందరితో షూటింగ్ చాలా సరదాగా జరిగింది. హేషమ్ వహాబ్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. సమయమా, అమ్మాడి పాటలు నా ఫేవరేట్. ఇందులో తండ్రికూతురు అనుబంధం అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమా చూస్తున్నపుడు వారితో ప్రేమలో పడిపోతారు. అలా జరగకపొతే నా పేరు మార్చుకుంటా. డిసెంబర్ 7న తప్పకుండా అందరూ హాయ్ నాన్న చూడండి" అని మృణాల్ ఠాకూర్ ఆసక్తికర కామెంట్స్ చేసింది.

Whats_app_banner