Mr Bachchan Collections: కోట్ల నుంచి ల‌క్ష‌ల్లోకి -రెండో రోజు దారుణంగా ప‌డిపోయిన ర‌వితేజ మిస్ట‌ర్‌ బ‌చ్చ‌న్ క‌లెక్ష‌న్స్-mr bachchan collections ravi teja harish shankar movie collection massive drop on second day ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mr Bachchan Collections: కోట్ల నుంచి ల‌క్ష‌ల్లోకి -రెండో రోజు దారుణంగా ప‌డిపోయిన ర‌వితేజ మిస్ట‌ర్‌ బ‌చ్చ‌న్ క‌లెక్ష‌న్స్

Mr Bachchan Collections: కోట్ల నుంచి ల‌క్ష‌ల్లోకి -రెండో రోజు దారుణంగా ప‌డిపోయిన ర‌వితేజ మిస్ట‌ర్‌ బ‌చ్చ‌న్ క‌లెక్ష‌న్స్

Nelki Naresh Kumar HT Telugu
Aug 17, 2024 11:59 AM IST

Mr Bachchan Collections: ర‌వితేజ మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ క‌లెక్ష‌న్స్ రెండో రోజు దారుణంగా ప‌డిపోయాయి. తొలిరోజు నాలుగు కోట్ల యాభై ఆరు ల‌క్ష‌ల వ‌ర‌కు వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ మూవీ రెండో రోజు కేవ‌లం ఎన‌భై ల‌క్ష‌లు మాత్ర‌మే క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకొని నిరాశ‌ప‌రిచింది.

మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ క‌లెక్ష‌న్స్
మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ క‌లెక్ష‌న్స్

Mr Bachchan Collections: ర‌వితేజ‌ మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ మూవీ క‌లెక్ష‌న్స్ రెండో రోజు దారుణంగా ప‌డిపోయింది. తొలిరోజు వ‌ర‌ల్డ్ వైడ్‌గా నాలుగు కోట్ల యాభై ఆరు ల‌క్ష‌ల వ‌ర‌కు వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన ఈ మూవీ రెండో రోజు కేవ‌లం ఎన‌భై ల‌క్ష‌లు మాత్ర‌మే క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకొని డిస‌పాయింట్ చేసింది. మిస్ట‌ర్ బ‌చ్చ‌న్‌ క‌లెక్ష‌న్స్ రెండో రోజుకే కోట్ల నుంచి ల‌క్ష‌ల్లోకి ప‌డిపోవ‌డం టాలీవుడ్ వ‌ర్గాల‌ను విస్మ‌య‌పప‌రుస్తోంది. ర‌వితేజ కెరీర్‌లో మ‌రో డిజాస్ట‌ర్ ఖాయ‌మ‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతోన్నారు.

ఇర‌వై ఐదు శాతం రిక‌వ‌రీ...

శుక్ర‌వారం నాటి క‌లెక్ష‌న్స్ చూస్తుంటే పెట్టిన పెట్టుబ‌డిలో ఇర‌వై నుంచి ఇర‌వై శాతం కూడా ఈ మూవీ రిక‌వ‌రీ చేస్తుందా? లేదా? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో నైజాంలో అత్య‌ధికంగా 36 ల‌క్ష‌ల వ‌ర‌కు మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. గుంటూరు, కృష్ణ, నెల్లూరుతో పాటు ఏపీలోని ప‌లు ఏరియాల్లో ప‌ది ల‌క్ష‌లు కూడా ర‌వితేజ మూవీ క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకోలేక‌పోయింది.

ఇర‌వై ఐదు కోట్లు రావాలి...

మొత్తంగా రెండు రోజుల్లో మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ సినిమా ఆరు కోట్ల ప‌ధ్నాలుగు ల‌క్ష‌ల క‌లెక్ష‌న్స్ సొంతం చేసుకున్న‌ది. దాదాపు 32 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ఈ మూవీ రిలీజైంది. ర‌వితేజ సినిమా లాభాల్లోకి అడుగుపెట్టాలంటే మ‌రో ఇర‌వై ఐదు కోట్ల‌కుపైనే క‌లెక్ష‌న్స్ రావాల్సివుంది. రెండు రోజు క‌లెక్ష‌న్స్ చూస్తుంటే బ్రేక్ ఈవెన్ కావ‌డం అసాధ్యంగానే క‌నిపిస్తోంది.

హ‌రీష్ శంక‌ర్‌పై ట్రోల్స్‌...

మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ మూవీకి ఫ‌స్ట్ డే నుంచే దారుణంగా నెగెటివ్ టాక్ వ‌స్తోంది. మూడు ఫైట్లు ఆరు పాట‌లు లాంటి రొటీన్ కాన్సెప్ట్‌తో సినిమా సాగ‌డం, క‌థ అన్న‌దే లేకుండా ఫ‌స్ట్ హాఫ్‌లో డైరెక్ట‌ర్ టైమ్‌పాస్ చేయ‌డంపై విమ‌ర్శ‌లొచ్చాయి. ముఖ్యంగా ర‌వితేజ‌, భాగ్య‌శ్రీ బోర్సే ల‌వ్‌ట్రాక్‌, వారిద్ద‌రిని కెమిస్ట్రీని స్క్రీన్‌పై చూపించిన తీరుపై హ‌రీష్ శంక‌ర్‌ను నెటిజ‌న్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

బాలీవుడ్ రీమేక్‌...

బాలీవుడ్ మూవీ రైడ్ రీమేక్‌గా మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ తెర‌కెక్కింది. హిందీ మూవీ సీరియ‌స్‌గా సాగుతుంది. ఆ కాన్సెప్ట్‌ను కామెడీ పేరుతో హ‌రీష్ శంక‌ర్ పూర్తిగా చెడ‌గొట్టాడ‌ని నెటిజ‌న్లు, మూవీ ల‌వ‌ర్స్ కామెంట్స్ చేస్తోన్నారు. ర‌వితేజ గ‌త సినిమాలు టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు, ఈగ‌ల్ సినిమాల‌కు కూడా డిజాస్ట‌ర్స్‌గా నిలిచాయి. ఆ జాబితాలోకి మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ కూడా చేయ‌డం కాయ‌మ‌ని అంటున్నారు.

మిక్కీ జే మేయ‌ర్ మ్యూజిక్‌...

మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ మూవీతో భాగ్య‌శ్రీ బోర్సే హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. జ‌గ‌ప‌తిబాబు విల‌న్‌గా న‌టించాడు. మిక్కీ జే మేయ‌ర్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ప‌తాకంపై టీజీ విశ్వ‌ప్ర‌సాద్ ప్రొడ్యూస్ చేశాడు.

మిస్ట‌ర్ బ‌చ్చ‌న్‌కు పోటీగా ఈ ఇండిపెండెన్స్ డేకు రామ్ పోతినేని పూరి జ‌గ‌న్నాథ్ డ‌బుల్ ఇస్మార్ట్‌, ఎన్టీఆర్ బావ మ‌రిది నార్నే నితిన్ ఆయ్ సినిమాలు రిలీజ‌య్యాయి. విక్ర‌మ్ డ‌బ్బింగ్ మూవీ తంగ‌లాన్ ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. డ‌బుల్ ఇస్మార్ట్ కూడా నెగెటివ్ టాక్‌ను సొంతం చేసుకున్న‌ది.