MM Keeravani at Oscars 2023: ఆస్కార్ వేదికపై కీరవాణీ లైవ్ ప్రదర్శన..!
MM Keeravani at Oscars 2023: 95వ అకాడమీ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమంలో ఎంఎం కీరవాణీ లైవ్ ప్రదర్శన చేసే అవకాశం కనిపిస్తోంది. గతంలో ఏఆర్ రెహమాన్ కూడా అక్కడ లైవ్ ప్రదర్శన చేయడంతో కీరవాణీ కూడా పర్ఫార్మెన్స్ చేస్తారని సమాచారం.
MM Keeravani at Oscars 2023: ఆర్ఆర్ఆర్ చిత్రానికి సంగీతం అందజేయడంతో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణీ రేంజే ఎంతో మారిపోయింది. ఆయన 200 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించడం ఒక ఎత్తయితే.. ఆర్ఆర్ఆర్ సినిమా మరో ఎత్తు. ఎందుకంటే ఈ చిత్రంలోని నాటు నాటు పాట ఆస్కార్ నామినేషన్‌లో పోటీపడుతోంది. అంతేకాకుండా ఇప్పటికే పలు అంతర్జాతీయ పురస్కారాలను కైవసం చేసుకుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ నామినేషన్ అందుకోవడంతో యావత్ దేశవ్యాప్తంగా చిత్రబృందంపై అభినందనలు వెల్లువెత్తాయి.
తాజాగా ఫిల్మ్ వర్గాల సమాచారం ప్రకారం ప్రముఖ మ్యూజిక్ కంపోజర్ కీరవాణి, పాటల రచయిత చంద్రబోస్ 95వ అకాడమీ అవార్డుల ప్రదానోత్సవంలో ప్రదర్శన చేయనున్నారని తెలుస్తోంది. ఈ ప్రతిష్టాత్మక అవార్డుల కార్యక్రమంలో కీరవాణి వేదికపై లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వనున్నారట.
ఇలా ఆస్కార్ నామినేషన్ అందుకున్న వారు వేదికపై లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం ఇదే తొలి సారి కాదు. 2008లో స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రంలోని జై హో సాంగ్ కోసం ఏఆర్ రెహమాన్ కోసం లైవ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. దీంతో కీరవాణి కూడా లైవ్ ప్రదర్శన ఇస్తారని ఫిల్మ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఈ కార్యక్రమానికి ఆర్ఆర్ఆర్ దర్శకుడు రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చర్, కూడా హాజరుకానున్నారని తెలుస్తోంది.
ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్‌చరణ్ సరసన సీత పాత్రలో ఆలియా భట్, తారక్ సరసన బ్రిటీష్ యాక్ట్రెస్ ఒలివియా మోరిస్ నటించారు. అజయ్ దేవగణ్ ప్రత్యేక పాత్రలో కనిపించారు. ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మించారు. రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయళ భాషల్లో ఈ సినిమా ఒకేసారి విడుదలైంది.
సంబంధిత కథనం