Mixup OTT Release:మిక్స‌ప్ టీజ‌ర్ - మొత్తం డ‌బుల్ మీనింగ్ డైలాగ్స్‌,ఇంటిమేట్ సీన్స్ - ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే?-mixup ott release date akshara gowda bold movie streaming on aha ott from march 15th ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mixup Ott Release:మిక్స‌ప్ టీజ‌ర్ - మొత్తం డ‌బుల్ మీనింగ్ డైలాగ్స్‌,ఇంటిమేట్ సీన్స్ - ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే?

Mixup OTT Release:మిక్స‌ప్ టీజ‌ర్ - మొత్తం డ‌బుల్ మీనింగ్ డైలాగ్స్‌,ఇంటిమేట్ సీన్స్ - ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే?

Nelki Naresh Kumar HT Telugu
Feb 24, 2024 07:28 PM IST

Mixup OTT Release: తెలుగు బోల్డ్ మూవీ మిక్స‌ప్ టీజ‌ర్ శ‌నివారం రిలీజైంది. రొమాంటిక్ సీన్స్‌, డ‌బుల్ మీనింగ్ డైలాగ్స్‌తో ట్రైల‌ర్ ఇంట్రెస్టింగ్‌గా సాగింది. మార్చి 15 నుంచి ఆహా ఓటీటీ మిక్స‌ప్ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది.

మిక్స‌ప్ మూవీ
మిక్స‌ప్ మూవీ

Mixup OTT Release: ఓటీటీ ట్రెండ్ మొద‌లైన త‌ర్వాత బోల్డ్ క‌థాంశాల‌తో సినిమాల్ని తెర‌కెక్కించ‌డం ఎక్కువైపోయింది. వారానికి ఓ బోల్డ్ కంటెంట్ మూవీ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ద్వారా ప్రేక్ష‌కుల ముందుకొస్తున్నాయి. ఆహా ఓటీటీ ద్వారా ఓ బోల్డ్ మూవీ త్వ‌ర‌లో తెలుగు ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. మిక్స‌ప్ పేరుతో తెర‌కెక్కుతోన్న ఈ మూవీ టీజ‌ర్‌ను గురువారం ఆహా ఓటీటీ రిలీజ్ చేసింది. మిక్స‌ప్‌లో అక్ష‌ర గౌడ‌, ఆద‌ర్శ్ బాల‌కృష్ణ‌న్‌, క‌మ‌ల్ కామ‌రాజు, పూజా జ‌వేరి కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

డ‌బుల్ మీనింగ్ డైలాగ్స్‌...

ఓ రెండు జంట‌ల క‌థ‌తో బోల్డ్‌గా మిక్స‌ప్‌ టీజ‌ర్ సాగింది. డ‌బుల్ మీనింగ్ డైలాగ్స్‌, ఇంటిమేట్ సీన్స్‌తో యూత్‌ను అట్రాక్ట్ చేసేలా ఈ టీజ‌ర్‌ను క‌ట్ చేశారు. నాకు మూడ్ రావాలంటే ఎక్సైట్‌మెంట్ కావాలి. ఎంట‌ర్‌టైన్‌మెంట్ కావాలి అనే డైలాగ్‌తోనే ఇంట్రెస్టింగ్‌గా టీజ‌ర్ ప్రారంభ‌మైంది. దేవుడు మ‌నుషుల‌కు చేతులు ఎందుకు ఇచ్చాడో ఇప్పుడు అర్థ‌మైంది అంటూ ఆద‌ర్శ్ బాల‌కృష్ణ డైలాగ్‌తో ఎండ్ చేశారు. ఈ టీజ‌ర్‌లో అక్ష‌ర గౌడ్ అందాల‌ను ఆర‌బోసింది. ఆమెతో పాటు పూజా జ‌వేరి క్యారెక్ట‌ర్ కూడా రొమాంటిక్‌గా సాగింది. మిక్స‌ప్‌ టీజ‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

అపోహ‌లు, అపార్థాలు...

పెళ్లైన రెండు జంట జీవితంలో సెక్స్ విష‌యంలో నెల‌కొన్న అపోహ‌లు, అపార్థాల‌తో ద‌ర్శ‌కుడు మిక్స‌ప్ మూవీని తెర‌కెక్కించిన‌ట్లు క‌నిపిస్తోంది. రొమాన్స్‌తో పాటు చిన్న మెసేజ్‌ను కూడా సినిమాలో చూపించ‌బోతున్న‌ట్లు తెలిసింది.

డైరెక్ట్‌గా ఓటీటీలోనే...

మిక్స‌ప్ మూవీ రిలీజ్ డేట్‌ను శ‌నివారం అఫీషియ‌ల్‌గా అనౌన్స్‌చేశారు. మార్చి 15 నుంచి ఆహా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. థియేట‌ర్ల‌ను స్కిప్ చేస్తూ డైరెక్ట్‌గా ఓటీటీలోనే ఈ మూవీ రిలీజ్ చేస్తున్నారు. టీజ‌ర్‌తో మిక్స‌ప్ మూవీ ప్ర‌మోష‌న్స్ మొద‌లుపెట్టారు. ఈ సినిమాకు డైరెక్ట‌ర్ ఎవ‌ర‌న్న‌ది మాత్రం టీజ‌ర్‌లో రివీల్ చేయ‌లేదు.

మిక్స‌ప్‌తో రీఎంట్రీ...

మిక్స‌ప్ మూవీతో లాంగ్ గ్యాప్ త‌ర్వాత అక్ష‌ర గౌడ‌, పూజా జ‌వేరి టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తోన్నారు. మ‌న్మ‌థుడు 2 సినిమాలో ఐటెమ్ సాంగ్‌తో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టి అక్ష‌ర గౌడ‌. రామ్ పోతినేని ది వారియ‌ర్ మూవీలో ఆది పినిశెట్టి భార్య‌గా విల‌న్ పాత్ర‌లో క‌నిపించింది. . విశ్వ‌క్‌సేన్ దాస్ కా ధ‌మ్కీతో పాటు రెజీనా నేనేనా సినిమాల్లో కీల‌క పాత్ర‌లు పోషించింది.

పోలీస్ ఆఫీస‌ర్‌గా...

ప్ర‌స్తుతం తెలుగులో సుధీర్‌బాబు హీరోగా న‌టిస్తోన్న హ‌రోంహ‌రలో అక్ష‌ర గౌడ పోలీస్ ఆఫీస‌ర్ క‌నిపించ‌బోతున్న‌ది. ఈ సినిమాల‌తో తెలుగులో మ‌స్తీ అనే వెబ్‌సిరీస్‌లో అక్ష‌ర గౌడ న‌టించింది. త‌మిళంలో అజిత్ ఆరంభం, సందీప్‌కిష‌న్ మ‌యావ‌న్‌తో పాటు చాలా సినిమాలు చేసింది. హీరోయిన్‌గా కంటే ఐటెంసాంగ్స్‌, గ్లామ‌ర్ పాత్ర‌ల్లోనే ఎక్కువ‌గా క‌నిపించింది.

పూజా జ‌వేరి కూడా తెలుగులో ద్వార‌క‌, బంగారు బుల్లోడు, 47 డేస్‌తో పాటు కొన్ని సినిమాలు చేసింది. ప్ర‌స్తుతం తెలుగు, త‌మిళ భాష‌ల్లో నాలుగైదు సినిమాలు చేస్తోంది.క‌మ‌ల్ కామ‌రాజు, ఆద‌ర్శ్ బాల‌కృష్ణ కూడా తెలుగులో ప‌లు సినిమాల్లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్టులుగా, విల‌న్స్‌గా క‌నిపించారు.