OTT Mammootty Movies: ఈ వారంలోనే ఓటీటీలోకి వచ్చిన రెండు మమ్ముట్టి హిట్ చిత్రాలు.. తెలుగులోనూ స్ట్రీమింగ్-mammootty tubro and derick abraham ott streaming now on sony liv and aha malayalam ott movies crime thrillers ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Mammootty Movies: ఈ వారంలోనే ఓటీటీలోకి వచ్చిన రెండు మమ్ముట్టి హిట్ చిత్రాలు.. తెలుగులోనూ స్ట్రీమింగ్

OTT Mammootty Movies: ఈ వారంలోనే ఓటీటీలోకి వచ్చిన రెండు మమ్ముట్టి హిట్ చిత్రాలు.. తెలుగులోనూ స్ట్రీమింగ్

Chatakonda Krishna Prakash HT Telugu
Aug 10, 2024 11:39 PM IST

OTT Mammootty Movies: మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి హీరోగా నటించిన రెండు సినిమాలు తెలుగులో ఈ వారం స్ట్రీమింగ్‍కు వచ్చాయి. టర్బో మూవీ ఓటీటీకి అడుగుపెట్టింది. అలాగే, మరో సినిమా కూడా స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది. ఆరేళ్ల క్రితం మలయాళం రిలీజై ఇప్పుడు తెలుగు డబ్బింగ్ అయింది.

OTT Mammootty Movies: ఈ వారంలోనే ఓటీటీలోకి వచ్చిన రెండు మమ్ముట్టి హిట్ చిత్రాలు.. తెలుగులోనూ స్ట్రీమింగ్
OTT Mammootty Movies: ఈ వారంలోనే ఓటీటీలోకి వచ్చిన రెండు మమ్ముట్టి హిట్ చిత్రాలు.. తెలుగులోనూ స్ట్రీమింగ్

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టికి ఇతర భాషల్లోనూ మంచి క్రేజ్ ఉంది. విభిన్నమైన సబ్జెక్టులతో సినిమాలు చేసే ఆయన తెలుగులోనూ చాలా పాపులర్. ముఖ్యంగా ఓటీటీల్లో మమ్ముట్టి సినిమాలను తెలుగులోనూ బాగానే చూస్తారు. అందుకే ఆయన నటించే చాలా మలయాళం చిత్రాలు ఓటీటీలో తెలుగు భాషలోనూ అందుబాటులోకి వస్తుంటాయి. మమ్ముట్టి హీరోగా నటించిన రెండు సినిమాలు ఈ వారం ఓటీటీల్లోకి అందుబాటులోకి వచ్చాయి. టర్బో చిత్రం తెలుగులోనూ అడుగుపెట్టింది. ఆరేళ్ల క్రితం మలయాళం రిలీజైన ఓ మూవీ డెరిక్ అబ్రహాం పేరుతో తెలుగులో ఇప్పుడు వచ్చింది. ఈవారం ఓటీటీల్లో స్ట్రీమింగ్‍కు వచ్చిన ఈ రెండు సినిమాల వివరాలివే..

టర్బో

మమ్ముట్టి హీరోగా నటించిన యాక్షన్ డ్రామా మూవీ టర్బో మంచి హిట్ అయింది. ఈ ఏడాది మే 23వ తేదీన ఈ చిత్రం మలయాళంలో థియేటర్లలో రిలీజ్ అయింది. రూ.23కోట్లతో బడ్జెట్‍తో తెరకెక్కించిన ఈ మూవీ రూ.70కోట్ల వరకు వసూళ్లతో దుమ్మురేపింది. టర్బో మూవీకి వైశాఖ్ దర్శకత్వం వహించారు. హీరో మమ్ముట్టినే నిర్మించారు. ఈ చిత్రం ఆయనతో పాటు రాజ్ బీ శెట్టి, పాటు అంజన జయప్రకాశ్, షబరీష్ వర్మ, సునీల్, కబీర్ దుహాన్ సింగ్ కీరోల్స్ చేశారు.

టర్బో చిత్రం ఈ వారం ఆగస్టు 9వ తేదీనే సోనీలివ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి అడుగుపెట్టింది. థియేటర్లలో రిలీజైన సుమారు 70 రోజులకుపైగా తర్వాత ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు వచ్చింది. మలయాళంతో పాటు తెలుగులోనూ సోనీలివ్‍లో అందుబాటులో ఉంది. హిందీ, తమిళం, కన్నడ, మరాఠీ, బెంగాలీ వెర్షన్‍ల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. మొత్తంగా ఏడు భాషల్లో సోనీలివ్ ఓటీటీలో టర్బో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీకి క్రిస్టో గ్జేవియర్ సంగీతం అందించారు. స్నేహితుడి కోసం చిక్కుల్లో పడి సవాళ్లను టర్బో జోస్ (మమ్ముట్టి) ఎదుర్కోవడం చుట్టూ ఈ మూవీ సాగుతుంది.

డెరిక్ అబ్రహాం

మలయాళం మూవీ అబ్రహామింతే సంతాతికల్ 2018 జూన్‍లో రిలీజై బ్లాక్‍బస్టర్ అయింది. అప్పట్లో భారీ వసూళ్లను సాధించింది. ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలో మమ్ముట్టి హీరోగా నటించారు. ఈ సినిమా ఇప్పుడు ఆరేళ్ల తర్వాత తెలుగులో డబ్బింగ్ అయింది. డెరిక్ అబ్రహాం పేరుతో ఆహా ఓటీటీలో ఈ మూవీ ఈవారమే స్ట్రీమింగ్‍కు వచ్చింది. నేడే (ఆగస్టు 10) ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది.

డెరిక్ అబ్రహాం సినిమాలో మమ్ముట్టితో పాటు అన్సోన్ పౌల్, కనిక, తరుషి, రెంజీ పనికర్, యోగ్ జపీ, కళాభవన్ షాజోన్ ముఖ్యమైన పాత్రలు చేశారు. డైరెక్టర్ షాజీ పాడూర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. వరుస హత్యల మిస్టరీని పోలీస్ ఆఫీసర్ డెరిక్ అబ్రహాం (మమ్ముట్టి) ఛేదించడం చుట్టూ ఈ మూవీ సాగుతుంది. అలాగే, తన సోదరుడు ఓ హత్య కేసులో ఇరుక్కోవడంతో నిజాన్ని ఎలా నిరూపించాడన్నది కూడా ప్రధాన అంశంగా ఉంటుంది. డెరిక్ అబ్రహం మూవీని గుడ్‍విల్ ఎంటర్‌టైన్‍మెంట్స్ నిర్మించగా.. గోపీసుందర్, సెరిన్ ఫ్రాన్సిస్ మ్యూజిక్ ఇచ్చారు. ఇప్పుడు ఈ డెరిక్ అబ్రహాం తెలుగు వెర్షన్‍ను ఆహా ఓటీటీలో చూసేయవచ్చు.